S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/20/2016 - 00:57

అనంతపురం, మే 19:ఖరీఫ్ విత్తన వేరుశెనగ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం జిల్లా మంత్రులు ప్రారంభించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత రామగిరి, చెనే్నకొత్తపల్లి మండల తహశీల్దార్ల కార్యాలయాల ఆవరణలోనూ, ఐటి, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమందేపల్లి మండలంలో ప్రారంభించారు.

05/20/2016 - 00:56

బ్రహ్మసముద్రం, మే 19: మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం కాంగ్రెస్ మండల కన్వీనర్ కోడిపల్లి బసవరాజు అధ్యక్షతన కరవుపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ శైలజానాథ్, అనంతపురం పార్లమెంట్ ఇన్‌చార్జ్జి అనీల్‌చౌదరి, అనంతపురం ఇన్‌చార్జి దాదాగాంధీలు పాల్గొన్నారు.

05/20/2016 - 00:56

ఉరవకొండ, మే19:జిల్లాలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం పెన్నహోబిళం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగం గా గురువారం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ఆ లయంలో సుప్రభాత సేవలో భాగంగా స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చనలు, ప్రత్యేక పూజ లు నిర్వహించారు.

05/20/2016 - 00:55

ధర్మవరం, మే 19: స్థానిక లక్ష్మి చెన్నకేశవస్వామి బ్రహ్మ రథోత్సవం గురువారం భక్తిప్రపత్తుల మధ్య సాగింది. అశేష జనవాహిని చేసిన గోవింద నామ స్మరణలతో ధర్మవరం హోరెత్తింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహరాజు నేతృత్వంలో ఈ వేడుకలు పర్వదినాన్ని తలపించాయి.

05/20/2016 - 00:55

హిందూపురం, మే19:తెలంగాణ లో తాజాగా అక్రమంగా నిర్మిస్తున్న మూడు ప్రాజెక్టులు పూర్తయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మర ణ శాసనమే అవుతుందని ఎపి పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు భయపడే తెలంగాణలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ఎపి సిఎం చంద్రబాబునాయుడు వౌనం ఉంటున్నారని రఘువీరా ఆరోపించారు.

05/20/2016 - 00:54

అమరాపురం, మే 19:స్థానిక ఉన్నత పాఠశాలలో గురువారం వేరుశెనగ విత్తన పంపిణీని ఎమ్మెల్యే ఈరన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరవు పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సబ్సిడీతో వేరుశెనగ విత్తన కాయలను పంపిణీ చేయడం ఎంతో ఊరటనిస్తోందన్నారు. రైతులు విత్తన వేరుశెనగను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

05/20/2016 - 00:50

రెండేళ్ల క్రితం సంభవించిన మహా పరివర్తన ప్రభావం మరింతగా విస్తరించడం ఐదు శాసనసభల ఎన్నిల ఫలితాల ద్వారా ప్రస్ఫుటించిన అతిప్రధాన పరిణామం. అసోం ఎన్నికల ఫలితాలు ఈ విస్తృతికి ప్రతీకలు. పరివర్తన విస్తృతి వేగం ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాలలో సమానంగా సంభవించకపోవడం సహజం.

05/20/2016 - 00:46

అసోం, బెంగాల్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరిల్లో 2016లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒకటి హిమాలయ పాదసానువుల్లో ఉంటే, మరొకటి కన్యాకుమారి తీరంలో ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత వెలువడిన అతిపెద్ద ప్రజాభిప్రాయం (జనాదేశ్)ఇది. ఈ ఎన్నికలు మోదీ పాలనపై తీర్పు అంటూ ప్రతిపక్షాల వారు ఈ ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేశారు. నిజానికి కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి అసెంబ్లీల్లో భాజపాకు లోగడ అస్తిత్వం నామమాత్రమే.

05/20/2016 - 00:44

విద్యార్థి అనేపదానికి విద్యను అర్థించేవాడు అని అర్ధం. కాని ఈ పదం నేటి పాఠశాలలలో చదువుకునే వారికి ఎంతమాత్రం వర్తించదు. ఇంగ్లీషులో స్టూడెంట్ అనే పదానికి సరైన తెలుగు పదం కనిపించడం లేదు. కనుక ఈ పదాన్ని తప్పని పరిస్థతుల్లో వాడుతున్నాం. ప్రభుత్వం ఇప్పుడు అందరికీ ఉచితంగా విద్యను అందిస్తోంది. దీనితోపాటు భోజనం పుస్తకాలు కూడా ఉచితమే. అనేక వసతి గృహాలున్నాయి.

05/20/2016 - 00:43

ప్రపంచంలో ఏ దేశంలో కులాలు లేవు. మన దేశంలో మాత్రమే కులాలు ఉన్నాయ. కుల రహిత సమాజం ఐనప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని డా.బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అణగారిన వర్గాల వారికి దేవుడిలాంటి డా.బాబాసాహెబ్ అంబేద్కర్‌ను మా వాడని చెప్పుకోవడానికి అగ్రవర్ణాలైన ముఖ్యమంత్రులు పోటీపడి ఎతె్తైన విగ్రహాలను స్థాపించడానికి పూనుకొనడం రాజకీయ ఎత్తుగడలో భాగం. కుల నిర్మూలన జరగాలంటే కులాలకతీతంగా వివాహాలు జరగాలి.

Pages