S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 03:30

విజయనగరం(టౌన్), మే 17: రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరంచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జిఓ నెంబర్ 4102ను వెంటనే ఉపసంహరించక పోతే న్యాయపోరాటం చేసి ప్రభుత్వ విద్యను పరిరక్షించుకుంటామని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు స్పష్టంచేసారు.

05/18/2016 - 03:29

విజయనగరం (పూల్‌బాగ్),మే17: పట్టణంలోని కణపాక చెన్నారెడ్డి కాలనీలో నల్లమారమ్మ చదురువద్ద సినీ, రంగస్థల కళాకారుడు ఆర్. అప్పలనాయుడు వర్ధంతిని పురస్కరించుకుని శ్రీనివాసా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రదర్శించిన ప్రతిఘటన వీధినాటిక ఆకట్టుకుంది. విద్యలేని గిరిజన, ఆదివాసీలను గ్రామపెద్దలు ఏవిధంగా మోసంచేస్తారో ఈనాటికలో తెలిపారు. వారి మోసాలను విద్యావంతుడు ఏవిధంగా బయటపెట్టాడో స్పష్టంగా చెప్పారు.

05/18/2016 - 03:29

విజయనగరం(టౌన్), మే 17: కేంద్ర ప్రభుత్వం ఖాదీ, గ్రామీణ పరిశ్రమలను బలోపేతం చేసేందుకు ఆర్థికంగా చేయూతను ఇవ్వాలని జిల్లా బిజెపి నాయకులు కేంద్ర ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు సభ్యుడు జి.చంద్రవౌళికి విజ్ఞప్తి చేశారు.

05/18/2016 - 03:28

గజపతినగరం, మే 17: మండలంలోని పాతబగ్గాం గ్రామంలో పైడితల్లమ్మ సిరిమాను సంబరం మంగళవారం వైభవంగా నిర్వహించారు. 30 సంవత్సరాల తరువాత ఈపండగను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. పండగలో భాగంగా సాయంత్రం 4.30 గంటల సమయంలో అంజలి రథంపై సిరిమానును ఏర్పాటు చేయగా పైడితల్లమ్మ పోతురాజు సిరిమానును అధిరోహించి గ్రామంలోని ప్రధాన వీధులలో మూడు సార్లు ఊరేగింపు నిర్వహించారు.

05/18/2016 - 03:28

నెల్లిమర్ల, మే 17: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి పదవ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు మండల విద్యాశాఖ కార్యాలయానికి చేరాయని ఎంఇఓఎ కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 66వేల పాఠ్యపుస్తకాలకు ఇండెంట్ పెడితే 36708 పాఠ్యపుస్తకాలు వచాయని తెలిపారు.

05/18/2016 - 03:27

నెల్లిమర్ల, మే 17: నగరపంచాయతీ రద్దుపై అధికార టిడిపి ఇచ్చిన హామీని నిలబెట్టు కోవాలని వైసిపి కేంద్రపాలక మండలి సభ్యులు పి. సాంబశివరాజు డిమాండ్ చేసారు. జరజాపుపేటలో గ్రామ పంచాయతీ సాధనకు జరుగుతున్న ఏరిలే నిరహారదీక్షా శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించి సంఘీభావం తెలిపారు.

05/18/2016 - 03:27

విజయనగరం, మే 17: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాష్ట్ర ప్రయోజనాలకంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు.

05/18/2016 - 03:26

విజయనగరం, మే 17: మద్యం అమ్మకాల విషయంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు కోర్టుల తీర్పులను ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ విమర్శించారు. జిల్లాలో ఎక్సైజ్‌శాఖ వ్యవహారంపై కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, రాష్టమ్రంత్రి మృణాళిని నోరు మెదకపోవడంతో మద్యం సిండికేట్‌కు మంత్రులు మద్దతుగా ఉన్నట్లు ప్రజలు అనుమానిస్తున్నారని ఆయన అన్నారు.

05/18/2016 - 03:26

విజయనగరం, మే 17: విజయనగరం పట్టణంలోని విజ్జీ స్టేడియంలో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రేఖారాణి హామీ ఇచ్చారు. అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్ పూల్‌ను మంజూరు చేస్తామని తెలిపారు.

05/18/2016 - 03:25

విజయనగరం, మే 17: జిల్లా మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా మత్స్య సహకార సంఘాలు నిర్వహిస్తున్న చెరువులను మినహాయించి జిల్లాలోని మిగిలిన చెరువులను డ్వాక్రా సంఘాలకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. జిల్లాలో ఉన్న ఏడువేల చెరువులలో మహిళా సంఘాలకు ఎన్ని చెరువులు ఇచ్చే అవకాశం ఉందో గుర్తించాలని చెప్పారు.

Pages