S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 03:25

దత్తిరాజేరు, మే 17: మండలంలో ఎనిమిది గ్రామాల పరిధిలో 2556 ఎకరాల విస్తీర్ణంలో నావికాదళ యుద్ధ సామాగ్రి డిపో(ఎన్‌ఎడి) ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేయడంతో ఆయా గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ భూములు స్వాధీనం చేసుకుంటే తాము ఎలా బతకగలమని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రతిపాదనను అధికారులు వెనక్కి తీసుకోవాలని కోరారు.

05/18/2016 - 03:24

విశాఖపట్నం, మే 17: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన జలదీక్షక మద్దతుగా నగరంలోని పార్టీ నాయకులు తహశీల్దార్ కార్యాలయాల వద్ద మంగళవారం ధర్నా శిబిరాలు నిర్వహించారు. వేర్వేరుగా నిర్వహించిన ఈ ధర్నాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

05/18/2016 - 03:22

విశాఖపట్నం(స్పోర్ట్స్), మే 17 : రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ తొలిసారి విశాఖలో విజయాన్ని అందుకుంది ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై పూణే జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా రెండుమార్లు అంతరాయం కలగడంతో మ్యాచ్ రిఫరీ డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో పూణే జట్టును విజేతగా ప్రకటించారు. 11వ ఓవర్‌లో ఆట నిలిచిపోయిన సమయానికి పూణే జట్టు ఒక వికెట్ నష్టపోయి 76 పరుగులు చేసింది.

05/18/2016 - 03:21

విశాఖపట్నం, మే 17: ఇంటర్మీడియట్ తరువాత డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు సంబంధించి డీసెట్ (డిఇఇసిఇటి)-2016 మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. మే 19 వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారులు తెలిపారు. తొలిసారిగా పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న పరీక్షను జిల్లాలో ఏడు కేంద్రాల్లో నిర్వహించారు.

05/18/2016 - 03:20

విశాఖపట్నం, మే 17: వివిధ ఆరోగ్య సమస్యలకు యోగా చక్కని పరిష్కారమని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య ఇ.ఎ.నారాయణ అన్నారు. యోగా కేంద్రంలో ఆయన శిక్షణా శిబిరాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంతో అనేక వ్యాధులకు గురి అవుతున్నారని తెలిపారు. స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులకు యోగా ఉపయోగపడతాయని తెలిపారు.

05/18/2016 - 03:18

విశాఖపట్నం, మే 17: భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని, ఆయన మాటలతో రాష్ట్ర ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లు కాంగ్రెస్ ప్రవేశపెడితే మద్దతిచ్చింది భారతీయ జనతాపార్టీ అన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

05/18/2016 - 03:20

విశాఖపట్నం, మే 17: వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా రూ.46 కోట్లతో పనులు చేపట్టనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. నగరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ.38 కోట్లతో 456 చెరువుల్లో పూడికతీత పనులను, మరో రూ.8 కోట్లతో 789 చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.

05/18/2016 - 03:19

విశాఖపట్నం, మే 17: భూగర్భ విద్యుద్ధీకరణ ప్రాజెక్టుకు ముహూర్తం పెట్టేశారు. దీనికి రూ.720 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రపంచబ్యాంకు వీటిని కేటాయించేసింది. త్వరలో తొలిదశ టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధంమైంది. వినియోగదారులు, నగర ప్రజల్లో ఉండే అపోహలు, సందేహాలు తొలగించేందుకు సైతం అనేకసార్లు సదస్సులు నిర్వహించేశారు. తొలివిడత నిర్మాణ పనులకు విద్యుత్‌శాఖ ముహు ర్తం పెట్టనుంది.

05/18/2016 - 03:19

విశాఖపట్నం, మే 17: ఇంటర్మీడియట్ తరువాత డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు డీసెట్(డిఇఇసిఇటి)-2016 మంగళవారం ప్రశాంతం గా ప్రారంభమైంది. మే 19 వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారులు తెలిపా రు. తొలిసారిగా పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ప రీక్షను జిల్లాలో ఏడు కేంద్రాల్లో నిర్వహించారు.

05/18/2016 - 03:16

అనకాపల్లి, మే 17: మండు వేసవి, భూగర్భజలాలు అడుగంటిపోతున్నా యి. అసలే అంతంతమాత్రంగా ఉన్న తాండవ, రైవాడ రిజర్వాయర్ల జలాలను విశాఖకి తరలించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి యనమల రామకృష్ణ నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సమావేశం నిర్ణయించింది. ఈ సాగునీటి వనరులు విశాఖకు తరలింపు వ్యవహారం ముదిరిపాకాన పడుతోంది. రైవాడ నుండి చాలాకాలంగా నీటిని విశాఖలోని పరిశ్రమలు, ప్రజల అవసరాలకు తరలిస్తున్నారు.

Pages