S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 03:15

అనకాఫల్లి, మే 17: వచ్చే సీజన్‌లోనైనా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ జరిపేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కార్యాలయ ప్రతినిధి ఎస్. సత్యనారాయణను కలిసి మంగళవారం వారు వినతిపత్రం అందజేశారు.

05/18/2016 - 03:15

మునగపాక, మే 17: తరచూ ప్రమాదాలు జరిగే జాతీయ రహదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతామని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్ సందర్శించడానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఇటీవల నేషనల్ హైవేలపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

05/18/2016 - 03:14

మాకవరపాలెం, మే 17: ఏజెన్సీలో 465 గ్రామా ల్లో తాగునీటిని అందించే ందుకు 250 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని ఆర్‌డబ్ల్యుఎస్‌ఎస్. ఇ. ప్ర భాకర్ అన్నారు. మండల ంలోని లచ్చన్నపాలెం స మీపంలో సర్పానదిలో 13 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఏడు కోట్లతో నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టు పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.

05/18/2016 - 03:14

చోడవరం : పక్క తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లయినా లేదని వైకాపా విమర్శించింది. మంగళవారం వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి తెలంగాణా ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు, రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు నిర్వహించారు.

05/18/2016 - 03:13

అనకాపల్లి, మే 17: తెలంగాణ ఏకపక్షంగా తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ వైకాపా అధినేత జగన్‌మోహనరెడ్డి కర్నూలులో నిర్వహిస్తున్న జలదీక్షకు మద్దతుగా అనకాపల్లి వైకాపా కార్యకర్తలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు.

05/18/2016 - 03:12

విశాఖపట్నం, మే 17: జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యానికి ఫలితమే విశాఖలో తాగునీటి ఎద్దడికి కారణమని జిల్లా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.

05/18/2016 - 03:11

అరకులోయ, మే 17: ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, ఐ.టి.డిఎ ప్రాజెక్టు అధికారి ఎం.హరినారాయణన్, సబ్ కలెక్టర్ ఎల్. శివశంకర్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. నువ్వగుడ, లింబగుడ, పాతబిస్టుంగుడ, పిట్టమామిడివలస, పెదలబుడు గ్రామాల్లో సుడిగాలిలా పర్యటించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు.

05/18/2016 - 03:03

మచిలీపట్నం (కోనేరుసెంటరు), మే 17: రాష్ట్రంలో మత్స్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈమేరకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.350కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మండల పరిధిలోని క్యాంబెల్‌పేటలో 22 మంది మత్స్యకారులకు రూ.22లక్షల విలువైన వలలను మంగళవారం ఆయన పంపిణీ చేశారు.

05/18/2016 - 03:03

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల రోజురోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని, ధరలు తగ్గేవరకు మహిళలు ఉద్యమించాలని మహిళా సమాఖ్య మచిలీపట్నం ఏరియా కార్యదర్శి శీరంశెట్టి లలిత అన్నారు.

05/18/2016 - 03:02

గుడివాడ, మే 17: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టిడిపిని బిజెపిలో విలీనం చేయాలని, ఓటుకు నోటు కేసు తరహాలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

Pages