S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/03/2016 - 11:22

భద్రాచలం, ఏప్రిల్ 2: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలు కెసీఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై చేస్తున్న చిల్లర రాజకీయాలను మానుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు.

04/03/2016 - 11:09

‘జరిగిన దాన్ని మార్చలేము. జరగవలసిన దాని గురించి ఆలోచించు...’ అన్నాడు ఒక ప్రముఖ నిర్మాత.
‘సినిమా విడుదలకు ఇంకా పదిరోజులుంది. పైరేటెడ్ వెర్షన్ ఇప్పుడు రిలీజయితే, సినిమా రిలీజ్ నాటికి చూడటానికి ఎవరూ మిగలరు’ అన్నాడు భరత్.
‘సినిమా విడుదల ముందుకు జరిపితే...’ నా ఐడియా వివరించాను.

04/03/2016 - 10:29

తెల్లారుతుండగానే వచ్చేసిన రాజీని చూసి కాస్త ఆశ్చర్యమే వేసింది. చీపురు తీసుకుని ‘ఈయేల ఇల్లు ఊడుస్తా. తుడ్వ’ అంది.
‘అంటే’ అన్నాను. ఈ ఊడవడం, తుడవడం అనే మాటలకున్న భేదం నాకు చాలా రోజులు అర్థమయ్యేది కాదు.
‘తడిగుడ్డేయనమ్మా - నేను జల్దీ పోవాల’ అంది రాజీ. ‘సర్లే’ అన్నాను. ఎందుకూ, ఏమిటీ అని నేడగలేదు.

04/03/2016 - 10:14

ఆలోచనలను
ఎంతసేపు తిరగేస్తున్నా
కొత్త అంశమేదీ తళుకొత్తటం లేదు
నల్లని మబ్బులను
ఎంతసేపు జల్లెడ పట్టినా
ఒక్క మెరుపు తునక
కంటికి చిక్కటం లేదు.
ఇది సృష్టి లోపమా?
లేక అంతర్ద్రష్టి లోపమా?
లోపాలున్నప్పుడు గుణాలుంటాయి
చీకట్లున్నప్పుడు వెలుగులుంటాయి
మానవుడు
ఆవిర్భవించినప్పటి నుంచి
ప్రకృతి
ప్రభవించినప్పటి నుంచి

04/03/2016 - 10:10

బస్ దిగి ఇంటికి నడిచి వస్తున్న ఆమెని ఓ కొత్త వ్యక్తి పలకరించాడు.
‘హలో మేరియా! నేను గుర్తున్నానా?’
ఆమె ఆగి అతని వంక చూసి తల అడ్డంగా ఊపింది.
‘మీతో మాట్లాడాలి’
‘దేని గురించి?’
‘నేను గుర్తున్నానా? నా వంక సరిగ్గా చూసి చెప్పండి’
‘సారీ. గుర్తు లేదు’
‘పదకొండేళ్ల క్రితం మీరు నన్ను చూశారు’

04/03/2016 - 10:04

గ్రంథాలయం మనిషి పురోగతికి దోహదం చేస్తుంది. అందుకే అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రంథాలయ వ్యవస్థని ప్రజలకి అందుబాటులో ఉంచడం, వారు వాటిని ఉపయోగించుకోవడం జరుగుతూంటుంది. పుస్తకం అనగానే రచయిత గుర్తొస్తాడు. అతను పుస్తకం ద్వారా ఓ కొత్త విషయాన్ని చదువరులకి అందిస్తాడు. ఐతే పాఠకులు ఆ రచయితని తమ సందేహాలు ముఖాముఖి అడిగి నివృత్తి చేసుకునే అవకాశం లేదు. అలాగే రచయిత పుస్తకంలో రాసింది తప్ప ఇంకేమీ చెప్పలేడు.

04/03/2016 - 09:09

ఎల్ ఐ సీ వారు ఏడెనిమిది సంవత్సరాల కింద ఒక కాలెండర్ ఇచ్చినరు. అది బాగ పెద్ద సయిజులో ఉన్నది. అందులో జామినీరాయ్, రవి వర్మ మరెందరో మహామహుల కళాఖండాలు ఉన్నయి. అన్నట్లు ఆ మధ్యన ఒకానొక పేరు పొందిన పత్రిక వారు జామినీ రాయ్ బొమ్మను, అంటే ఆయన వేసిన, రాసిన బొమ్మను అట్ట మీదనో, ఆ లోపలనో అచ్చు వేసినరు. అంతటి గొప్ప పత్రిక వారు అమాంతం పప్పులో కాలేసి ఆయన పేరు జెమినీ రాయ్ అని రాసినరు.

04/03/2016 - 09:05

ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీ హయాంలో కోల్‌కతా హిందూ దేశానికి రాజధాని. రాజకీయ కేంద్రం న్యూఢిల్లీకి మారాక కూడా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవనానికి ఆ నగరమే జీవనాడిగా ఉండేది. మహా ప్రాసాదాలాంటి భవనాలు, అందమైన తోటలు, కళకూ సృజనకూ ఆలవాలమైన సాంస్కృతిక విభావరులు, మేధోమథనాలకు పెట్టింది పేరైన నవచైతన్య కేంద్రాలు కోల్‌కతాకు సహజాభరణాలు.

04/03/2016 - 08:38

కేన్సర్ చికిత్స, కాల నిర్ధారణ పరీక్షలు, శిలలు, అణు, జీవశాస్త్రం, ఆధునిక జన్యు శాస్త్రం వంటి పలు అధ్యాయాలు రేడియో ధార్మికతతోనే ప్రారంభమయ్యాయంటే అతిశయోక్తి కాదు. అణుశక్తి, అణుబాంబులకు కూడా ఇదే ఆధారం. హెన్రీ బెక్యురెల్ 1897లో ఎక్స్ కిరణాలను అధ్యయనం చేస్తూ యురేనియం లవణం ఫొటోగ్రాఫిక్ ప్లేట్‌పైన గుర్తులను ఏర్పరచటం గమనించాడు.

04/03/2016 - 08:33

స్కూల్ నించి వచ్చిన మయూరేష్‌ని తల్లి అడిగింది.
‘అక్క క్లాస్ టీచర్ రెడ్‌క్రాస్‌కి విరాళం ఇవ్వమని చెప్పిందిట. ఏభై రూపాయలు తీసుకెళ్లింది. మీ క్లాస్ టీచర్ అడగలేదా?’
‘అడిగారు’
‘మరి నాకు చెప్పలేదే?’
‘అది వృధా ఖర్చని’
‘రెడ్‌క్రాస్‌కి ఇచ్చేది వృధా అని ఎవరు చెప్పారు? యుద్ధ సమయాల్లో, ప్రకృతి వైపరీత్యాల్లో వాళ్లు అనేక మందికి సహాయం చేస్తూంటారు’

Pages