S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 02:30

ఆదోని, మే 17: రాజోలి బండ ఆనకట్ట అర్ధ అడుగు పెంచే విషయంలో కర్నాటక ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఆనకట్ట పెంచడానికి సన్నాహాలు చేయడంతో కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ రాజోలి రగడ రాసుకుంది. గతంలో కర్నాటక అధికారులు రాజోలి బండ ఆనకట్టను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే రాష్ట్ర అధికారులు అడ్డుకోవడంతో వెనుతిరిగిన విషయం విదితమే.

05/18/2016 - 02:30

కోసిగి : మూడు రాష్ట్రాల మధ్య తుంగభద్ర నదిపై నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద మంగళవారం పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఆర్డీఎస్ ఆనకట్టపై ఎత్తు పెంచేందుకు కర్నాటక అధికారులు ప్రయత్నం చేయడంతో సోమవారం రాత్రి ఆదోని ఆర్డీఓ ఓబులేసు, డీఎస్పీ శ్రీనివాసరావు వెళ్ళి తెలంగాణ ఇంజనిరింగ్ అధికారులతో చర్చించారు. ఆంధ్ర వైపు అనుమతి వచ్చినప్పుడు పనులు చేపట్టాలని వారు తెలియజేశారు. అనంతరం పనులను నిలుపుదల చేశారు.

05/18/2016 - 02:29

కర్నూలు సిటీ, మే 17 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వాకం వల్లే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టులు చేపడుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపి అనంతర వెంకట్రామిరెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను రద్దు చేయాని డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత వైఎస్.జగన్ కర్నూలులో చేపట్టిన జలదీక్ష 2వ రోజుకు చేరుకుంది.

05/18/2016 - 02:29

ఆదోని, మే 17 : ఆదోని రెవెన్యూ భవన్‌లో మంగళవారం హూవనూరు గ్రామానికి చెందిన విఆర్‌ఓ ఎల్లప్ప ఈ పాసు పుస్తకాల కోసం రైతు నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. అందుకు సంబంధించి ఏసిబి డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపిన వివరాలు.. ఆదోని మండల పరిధిలోని హూవనూరు గ్రామానికి చెందిన రైతు నాగేంద్ర, అతడి ఇద్దరు తమ్ములు వారికి పెద్దల నుంచి సంక్రమించిన భూములను పంచుకున్నారు.

05/18/2016 - 02:28

కర్నూలు సిటీ, మే 17: రాష్ట్రంలోని బలిజలు, కాపులు, తెలగ, ఒంటరి కులాల అర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తుందని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి వెల్లడించారు. నగరంలోని టిజివి కళాక్షేత్రంలో మంగళవారం మేధోమదన సదస్సు నిర్వహించగా ఎమ్మెల్సీ, టిడి పి జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి, కా పు చైర్మన్ రామాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

05/18/2016 - 02:27

నందికొట్కూరు, మే 17:జూలై 15వ తేదీ లోగా పుష్కరాల పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సంగమేశ్వరంలో గతంలో వున్న రెండు పుష్కర ఘాట్‌లను ఆధునీకరించి మరో పుష్కరఘాట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

05/18/2016 - 02:27

బనగానపల్లె, మే 17:్ఫ్యక్షన్, సమస్యాత్మక గ్రామాలపై నిఘా మరింత పెంచాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ మంగళవారం ఉదయం స్థానిక స్టేషన్‌కు రాగా ఆ సమయంలో ఎస్‌ఐ సి.నరేంద్రకుమార్‌రెడ్డి, ట్రైనీ ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బంది హాజరు, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అనంతరం స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల గురించి ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు.

05/18/2016 - 02:26

చాగలమర్రి, మే 17: మన రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణకు వ్యతిరేకంగా వైకాపా అధ్యక్షులు జగన్ కర్నూలులో చేపట్టిన జలదీక్షతో రాయలసీమకే నష్టం జరుగుతుందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన చాగలమర్రిలో విలేఖర్లతో మాట్లాడుతూ గుండ్రేవుల, ఆర్డీ ఎస్, సిద్ధేశ్వరం, శ్రీశైలం తదితర ప్రాజెక్టులు తెలంగాణతో ముడిపడి ఉన్నాయన్నారు.

05/18/2016 - 02:26

నందికొట్కూరు, మే 17:ఉద్యోగులు సమష్టిగా పని చేసి నష్టాల్లో వున్న ఆర్టీసీని లాభాల బాటలోకి తేవాలని రీజినల్ మేనేజర్ వెంకటేశ్వరరావు కోరారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంగళవారం ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ 2014-15 సంవత్సరానికి జిల్లాలో రూ. 70 కోట్ల నష్టాన్ని చవిచూశామని, అయితే ఆ ఏడాది చివరి నాటికి కార్మికుల కృషితో రూ. 8 కోట్ల నష్టాన్ని తగ్గించామన్నారు.

05/18/2016 - 02:25

కర్నూలు అర్బన్, మే 17:రాయలసీమ యూనివర్శిటీ కళాశాల, అనుబంధ పిజి కళాశాలల్లో పిజి కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే ఆర్‌యూ పిజి సెట్-2016 ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకూ జరుగుతుందని ఆర్‌యూ పిజి సెట్ కన్వీనర్ ఆచార్య ఆర్.సంజీవరావు తెలిపారు.

Pages