S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 02:25

పాములపాడు, మే 17:కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా చేపడుతున్న రోడ్ల పనులను మంగళవారం కలెక్టర్ విజయమోహన్ తనిఖీ చేశా రు. దిగువన చేపడుతున్న 600 మీటర్ల పుష్కర రహదారుల వల్ల ప్రయోజనం లేదని ఎర్రమఠం సర్పంచ్ రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకోగా పనులు నిలిచిపోయాయి. ఈ పనులను కలెక్టర్ పరిశీలించి పంచాయతీకి పుష్కర పనులకు సంబంధం లేదని రోడ్ల పనులను ఎందుకు అడ్డుకున్నావని ఎర్రమఠం సర్పంచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

05/18/2016 - 02:24

కోవెలకుంట్ల, మే 17:మండల పరిధిలోని జోలదరాశి గ్రామం వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన శంకరమూర్తి(34), జగదీష్ కోవెలకుంట్లలో పొలం కొనుగోలు చేసి కొంతకాలంగా ఇక్కడే ఉంటూ పొలం పనులు చూసుకునేవారు.

05/18/2016 - 02:22

ఖమ్మం, మే 17: పాలేరు ఉప ఎన్నికల్లో గెలుపోటములపై అన్ని రాజకీయ పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. 16వ తేదీన జరిగిన ఎన్నికల్లో 90శాతం మేరకు పోలింగ్ నమోదు కాగా, 19వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. 13మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టిఆర్‌ఎస్, కాంగ్రెస్, సిపిఎం అభ్యర్థుల మధ్యనే నెలకొన్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు గ్రామాల వారిగా లెక్కలు వేస్తున్నారు.

05/18/2016 - 02:22

ఖానాపురం హవేలి, మే 17: పాలేరు ఉప ఎన్నిక ఈవిఎంలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌కు చేరాయి. నియోజకవర్గంలోని 243పోలింగ్ బూత్‌లను 25రూట్లుగా విభజించిన అధికారులు అన్ని ప్రాంతాల నుంచి అర్థరాత్రి సమయానికి స్ట్రాంగ్ రూమ్‌కు అన్ని ఈవిఎంలను తెప్పించుకోగలిగారు.

05/18/2016 - 02:21

కొత్తగూడెం, మే 17: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 25వతేదీన సింగరేణి వ్యాప్తంగా అన్నిగనులు, డిపార్టుమెంట్ల ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయూనియన్ రాష్ట్ర డెప్యూటీ ప్రధాన కార్యదర్శి దమ్మాలపాటి శేషయ్య, కేంద్ర కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, కొత్తగూడెం ఏరియా బ్రాంచి కార్యదర్శి కూసన వీరభద్రయ్యలు తె

05/18/2016 - 02:21

జూలూరుపాడు, మే17: ఇది పది మందికి ఆరోగ్య సేవలందించే ప్రభుత్వ ఆసుపత్రా లేక బందెల దొడ్డా అని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బందిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎ.కొండలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుసార్లు ఆసుపత్రిని సందర్శించి పనితీరు మార్చుకోవాలని హెచ్చరించినా మీలో ఎంత మాత్రం మార్పురావటం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

05/18/2016 - 02:20

ఖానాపురం హవేలి, మే 17: ప్రకృతి సంపదను కాపాడుతున్న ఆదివాసీలకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రకృతి సంపదను కాపాడేందుకు అత్యధికంగా ఆదివాసీలేనని, కొంతమంది అధికారులు చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకునేందుకు తాము ప్రయత్నిస్తామన్నారు.

05/18/2016 - 02:20

ఖానాపురం హవేలి, మే 17: పాలేరు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సుమారు 50వేల మెజార్టీతో విజయం సాధిస్తారని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణలు అభిప్రాయపడ్డారు.

05/18/2016 - 02:19

ఖమ్మం(జమ్మిబండ), మే 17: కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ఇష్టమొచ్చినట్లు ఆయిల్ కంపెనీలతో లాలూచి పడి పెట్రో, డీజిల్ ధరలను పెంచుతూ ప్రజలపై తీవ్ర భారాన్ని వేస్తున్నారని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మహ్మద్‌సలాం డిమాండ్ చేశారు. పెంచిన ధరలను తగ్గించాలని మంగళవారం స్థానిక బైపాస్‌రోడ్డులో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

05/18/2016 - 02:18

ఖమ్మం(జమ్మిబండ), మే 17: కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ఇష్టమొచ్చినట్లు ఆయిల్ కంపెనీలతో లాలూచి పడి పెట్రో, డీజిల్ ధరలను పెంచుతూ ప్రజలపై తీవ్ర భారాన్ని వేస్తున్నారని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మహ్మద్‌సలాం డిమాండ్ చేశారు. పెంచిన ధరలను తగ్గించాలని మంగళవారం స్థానిక బైపాస్‌రోడ్డులో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Pages