S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/03/2016 - 03:39

న్యూఢిల్లీ, మే 2: వౌలికరంగాల ప్రగతి ఈ ఏడాది మార్చి నెలలో 16 నెలల గరిష్ఠాన్ని తాకింది. రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల రంగాల పనితీరు మెరుగుపడటంతో 6.4 శాతంగా నమోదైంది. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఎనిమిది కీలక రంగాల వృద్ధి 2.7 శాతంగా ఉంది. అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇది 4.5 శాతంగా ఉంది.

05/03/2016 - 03:38

ముంబయి, మే 2: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. సోమవారం రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో కనీస రుణ రేటు 9.20 శాతం నుంచి 9.15 శాతానికి దిగింది. కొత్త వడ్డీరేట్లు ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. ఫలితంగా గృహ, వాహన రుణాలు మరింత అందుబాటులోకి రానున్నాయ.

05/03/2016 - 03:37

ముంబయి, మే 2: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 169.65 పాయింట్లు క్షీణించి 25,436.97 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 43.90 పాయింట్లు పడిపోయి 7,805.90 వద్ద నిలిచింది.

05/03/2016 - 03:36

విశాఖపట్నం, మే 2: చైనాకు చెందిన ఉక్సి సిటీ జిన్‌హువా లిఫ్టింగ్ ఎక్విప్‌మెంట్ కంపెనీ ప్రతినిధుల బృందం సోమవారం విశాఖపట్నం పోర్టుట్రస్టును సందర్శించింది. కంపెనీ ఉన్నతాధికారి వాంగ్‌తో కలిసి గ్లోబల్ మార్కెటింగ్ మేనేజర్ లారెన్స్‌జంగ్ పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబుతో సమావేశమయ్యారు. పోర్టులో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి పలు అంశాలను చైనా ప్రతినిధులతో చైర్మన్ కృష్ణబాబు చర్చించారు.

05/03/2016 - 03:34

కొత్తగూడెం, మే 2: ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదటి మాసంలోనే సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై ప్రచండ భానుడు తీవ్ర ప్రభావం చూపాడు. దీంతో ఏప్రిల్ నెల ఉత్పత్తి లక్ష్యాలను కేవలం రెండు ఏరియాలు మాత్రమే సాధించగలిగాయి. మిగిలిన తొమ్మిది ఏరియాలు లక్ష్య సాధనలో విఫలమయ్యాయి.

05/03/2016 - 03:32

విశాఖపట్నం, మే 2: ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వివిధ పరిశ్రమల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆయా పరిశ్రమల్లో విపత్తు నివారణా ప్రణాళిక, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కనీస ఏర్పాట్లు లేకపోవడంతో పరిసర గ్రామాల ప్రజలు ప్రమాదాలు వాటిల్లినప్పుడు బెంబేలెత్తుతున్నారు.

05/03/2016 - 03:24

బెంగళూరు, మే 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. యూసుఫ్ పఠాన్ విజృంభణకు, ఆండ్రె రసెల్ తోడు కావడంతో ఒకానొక దశలో ఓటమి అంచున నిలిచిన నైట్ రైడర్స్ బరో ఐదు బంతులు మిగిలి ఉండగా, ఐదు వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది.

05/03/2016 - 03:21

రాజ్‌కోట్, మే 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన గుజరాత్ లయన్స్ మంగళవారం హోం గ్రౌండ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్న గుజరాత్ లయన్స్ జట్టుకు డేర్‌డెవిల్స్ నుంచి గట్టిపోటీ తప్పక పోవచ్చని విశే్లషకుల అభిప్రాయం.

05/03/2016 - 03:19

పుణె, మే 2: మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ గాయం కారణంగా ఐపిఎల్‌కు దూరమయ్యాడు. ఇప్పటికే కెవిన్ పీటర్సన్, ఫఫ్ డు ప్లెసిస్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సేవలను పుణె కోల్పోయింది. స్మిత్ ఇప్పుడు ఆ జాబితాలో చేరాడు.

05/03/2016 - 03:16

పుణె, మే 2: ముంబయి ఇండియన్స్ తరఫున ఐపిఎల్‌లో ఆడుతున్న తెలుగు వీరుడు అంబటి రాయుడుపై అదే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోపంతో అతనిని దూషించాడు. అయితే, రాయుడు కూడా వెనక్కు తగ్గకుండా మాటకు మాట సమాధానం చెప్పాడు. దీనితో కంగుతిన్న భజ్జీకి శాంతించక తప్పలేదు.

Pages