S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2016 - 06:48

న్యూఢిల్లీ, మే 1: కార్మికులు లేకుండా పురోగతి సాధించలేమని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురష్కరించుకొని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ‘‘శ్రమయేవ జయతే’’ నినాదం ద్యారా ప్రతి కార్మికుడికి న్యాయబద్ధమైన వ్యవస్థను సృష్టిస్తూ ఉత్తమ అవకాశాలను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

05/02/2016 - 06:47

అక్లాండ్, మే 1: అసమ్మతి లేకపోతే పార్లమెంటు వ్యవస్థ సక్రమంగా పనిచేసే అవకాశం ఉండదని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఇక్కడ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ సహా అనేక కీలక అంశాలపై విస్తృతంగా పోటాపోటీగా చర్చ జరిగినప్పుడే అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని భారత్, న్యూజిలాండ్ వ్యాపార మండలి సమావేశంలో ఆయన ఉద్ఘాటించారు.

05/02/2016 - 06:47

వాషింగ్టన్, మే 1: ‘ఒబామా ఔట్’.. ఈ మాట ఎవరో అన్నది కాదు.. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తనపై తానే పేల్చుకున్న జోక్ ఇది. వైట్‌హౌస్‌లో ఆదివారం జరిగిన ‘బ్లాక్‌టై’ కార్యక్రమంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు, జర్నలిస్టులు, తన తరువాతి అధ్యక్షపదవిని ఆశిస్తున్న హిల్లరీ, డొనాల్డ్ ట్రంప్‌లపైనా సరదా కామెంట్లు చేశారు.

05/02/2016 - 06:24

మహబూబ్‌నగర్, మే 1: కెనడా దేశం టోరంటోలో స్థిర నివాసం ఉంటున్న పాలమూరు పట్టణానికి చెందిన ప్రవాస భారతీయ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. పాలమూరుకు చెంనిన జాన్ కృపావరం, శోభ దంపతులు ఉద్యోగ రీత్యా టోరంటోలో ఉంటున్నారు. వీరి మొదటి కుమార్తె సింథియాజాన్ (24) ఆదివారం తెల్లవారుజామున ఓ శుభకార్యానికి హాజరై ఇంటికి వస్తూ మార్గమధ్యంలో షాపింగ్ చేసేందుకు మాల్‌కు వెళ్లింది.

05/02/2016 - 06:22

సంగారెడ్డి, మే 1: ఉదయం నుండి సాయంత్రం వరకు వివాహ శుభ కార్యక్రమంలో ఆనందంగా గడిపి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైన పెళ్లి బృందం వాహనానికి హైటెన్షన్ విద్యుత్ వైర్లు యమపాశమై కటికచీకట్లలో ఎనిమిది మంది ప్రాణాలను అపహరించాయి. మరో 14 మంది మృత్యువుతో చెలగాటమాడుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు..

05/02/2016 - 06:22

హైదరాబాద్, మే 1: ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ప్రైవేట్ విద్యాసంస్థలో నాణ్యతలేని విద్యతో పాటు తల్లిదండ్రులకు పెనుభారంగా మారిన ఫీజుల మోతకు అడ్డుకట్ట వేయడానికి తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తున్న సంస్థలపై ఉక్కుపాదం మోపే విషయంలో రాజీ పడకూడదని గట్టి పట్టుదలతో ఉంది.

05/02/2016 - 06:20

హైదరాబాద్, మే1: ప్రపంచ కార్మిక దినోత్సవం ఇద్దరు కార్మికుల ఇళ్లల్లో విషాదం నింపింది. హైదరాబాద్ మహానగరంలో మ్యాన్‌హోల్‌లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మురుగునీటి కాలువను శుభ్రం చేసేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగిన కార్మికులిద్దరికీ ఆక్సీజన్ అందక ఉక్కిరిబిక్కిరై దుర్మరణం పాలయ్యారు.

05/02/2016 - 06:18

హైదరాబాద్, మే 1: రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాన్ని పదివేల రూపాయలకుపైగా ఉండేలా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు కార్మిక, ఉపాధి కల్పన మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. కార్మికుల సమస్యలు, డిమాండ్లు ఏమిటో తమ ప్రభుత్వానికి క్షుణ్ణంగా తెలుసన్నారు. కార్మికులు ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం లేకుండానే సమస్యలు పరిష్కరిస్తున్నట్టు వెల్లడించారు.

05/02/2016 - 06:16

హైదరాబాద్, మే 1: ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో ఇళ్లు ఇతర నిర్మాణాలు చేసుకున్న వారికే వాటిని క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన జీవో 59 ఇంకా బాలారిష్టాలను అధిగమించలేకపోతుంది. నామామాత్రపు రుసుంతో ఆక్రమితదారునికే వాటిపై హక్కులు కల్పించేందుకు జారీ చేసిన జీవో 59కు అధికారుల వక్ర బాష్యాల వల్ల ప్రభుత్వ సద్దుదేశం నెరవేరకుండా పోతుంది.

05/02/2016 - 06:15

కరీంనగర్, మే 1: ఒకప్పుడు ‘మావో’లకు అది పెట్టని కోట. అలాంటి తూర్పు డివిజన్‌లోని దండకారణ్యంలో తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం అడుగుపెట్టబోతున్నారు. మేడిగడ్డ (కాళేశ్వరం) ఆనకట్ట శంకుస్థాపన సందర్భంగా తూర్పు డివిజన్‌లో సిఎం పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సిఎం కెసిఆర్ ఆదివారం రాత్రి 7:40గంటలకు కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

Pages