S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 22:13

మోర్తాడ్, ఏప్రిల్ 29: భూగర్భ జలాల పెంపుదలకై మండల అధికార యంత్రాంగం చేపడుతున్న రెండు రోజుల కార్యక్రమం సత్ఫలితాల దిశగా పయనిస్తోంది. ఎంపిక చేసిన ఆరు గ్రామాలలో ఆరు బృందాలు రెండు రోజులుగా పల్లెల్లోనే ఉంటూ పనులు చేపడుతున్నారు. మోర్తాడ్ మండలంలో వేయి ఇంకుడు గుంతలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గ్రామాల బాట పట్టారు.

04/29/2016 - 22:12

నందిపేట, ఏప్రిల్ 29: కరవు నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం సర్కారు బడుల్లో ప్రస్తుత వేసవి సెలవుల్లోనూ అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి పాతిక శాతం లోపే విద్యార్థులు హాజరవుతున్నారు. నందిపేట మండలంలో మొత్తం 56 పాఠశాలల్లో 4934మంది విద్యార్థులు ఏప్రిల్ నెల రికార్డుల ప్రకారం ఉండగా, శుక్రవారం 1145మంది విద్యార్థులు మాత్రమే మధ్యాహ్న భోజనం చేశారని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు.

04/29/2016 - 22:11

బోధన్, ఏప్రిల్ 29: డివిజన్‌లోని వర్ని మండలం బడాపహాడ్ దర్గా వద్ద వెలుగు చూస్తున్న ఘటనలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ మతపరంగా కొన్ని దారుణాలు జరుగుతున్నాయని, కొందరు పనిగట్టుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

04/29/2016 - 22:10

కంఠేశ్వర్, ఏప్రిల్ 29: ప్రైవేట్ విద్యా సంస్థలు సమ్మెను విరమించుకుని ప్రభుత్వం నిర్వహించే టెట్, ఎంసెట్, ఇంజనీరింగ్ పరీక్షలకు సహకరించాలని ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి కోరారు. శుక్రవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యా విధానంలో సమూల మార్పులను తీసుకు వస్తున్నారని అన్నారు.

04/29/2016 - 22:09

ఆర్మూర్, ఏప్రిల్ 29: ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన తెలంగాణ ప్రాంతంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో వెంకటేశ్వర మందిర నిర్మాణానికి ఆయన స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.

04/29/2016 - 22:02

క. ఎఱుక గలవారి చరితలు
గఱచుచు సజ్జనుల గోషిఠఁ గదలక ధర్మం
బెఱుఁగుచు నెఱిఁగిన దానిని
మఱవ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్

04/29/2016 - 22:01

‘‘సార్! మీ ప్రశ్న నా నిజాయితీని శంకిస్తోంది. మొబైల్ కూసేలోగానే మాట్లాడ్డం ఆపేసి నా నిజాయితీని నిరూపించుకున్నాక కూడా...’’ అన్నాడు యోగి.
శ్రీకర్ నవ్వాడు. ‘‘వెరీ ఇంటెలిజెంట్! నిజాయితీని నిరూపించుకున్నట్లు చెబుతూనే పది నిముషాలైపోయింది. కాబట్టి ఇక మాట్లాడనని పరోక్షంగా చెప్పారు. సరేలెండి, ఇకమీదట నో టైం లిమిట్, నేనడిగిందానికి బదులిస్తూండండి’’ అన్నాడు.

04/29/2016 - 21:59

అంతేకాక నా విరోధులైన రాజులందరూ మన వృష్ణి వంశాలతో ఇదివరకే బద్ధ వైరంతో ఉన్నారు. ఇదివరకు జరాసంధుడితో కలసి వచ్చి మనమీద ఎన్నిసార్లో దండయాత్రలు చేశారు. మళ్లీ వాళ్ళు ఇప్పుడు ఏకమవుతారు. ఇదివరకటి యుద్ధాలలోనే మనం చాలామందిని మన వారిని కోల్పోయాము.

04/29/2016 - 21:56

‘దు ష్టం ముఖం యస్యసః దుర్ముఖ’ అని అమరకోశ వాఖ్య. సనాతన ధర్మాన్ని కాపాడుటకు ఆదిత్యుడు దుర్ముఖుడవుతాడట. రావణాసురుడికి పది తలకాయల మొఖమే కాదు పది నోర్లతో దురహంకార మాటలు కూడా ఉండేవి. అహంకారంతో, తలబిరుసుగలవాన్ని దుర్ముఖ అని రామాయణం చెబుతున్నది. ఈ అహంకారం వల్ల పది తలకాయల రావణాసురుడు రాముడి చేత ఒక తల కూడా లేకుండా చేసుకున్నాడు. ఐదు తలకాయల బ్రహ్మదేవుడు సహితం శివుని చేత చతుర్ముఖుడైనాడు.

04/29/2016 - 21:49

దేశంలో శిశు మరణాల సంఖ్య నానాటికి అధికమవుతోంది. శాస్ర్తియ అవగాహన కొరవడటం వల్ల పురిట్లోనే పిల్లలకు నిండు నూరేళ్లు నిండుతున్నాయి. వెయ్యి మంది పిల్లలు పుడితే 40 మంది పిల్లలు చనిపోతున్నారు. అలాగే అపుడే పుట్టిన వెయ్యి మంది శిశువుల లో 28 మంది చనిపోతున్న ట్లు పార్లమెంట్‌లో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు మనదేశంలో ఎక్కువగా ఉంది.

Pages