S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/06/2016 - 03:27

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా విభిన్న ప్రతిభావంతులకు సార్వజనీక గుర్తింపు (యూనివర్సల్ ఐడి) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

03/06/2016 - 00:19

పినాకపాణి, వృషధ్వజుడు, విశాలాక్షుడు, సదానందుడు, శ్మశానవాసి, శైలధన్వుడు, శశిశేఖరుడు, కపర్ది అంటూ ఎన్ని పేర్లు పిలిచినా అవన్నీ ఒక్క శంకరునికే చెల్లుతాయ. అటువంటి కైలాసవాసునకు వారువీరను తేడాల్లేవు. రాక్షసులు దేవతలు, మనుష్యులు ఎవరైనా ఆయన్ను సేవించేవారే. రాజు-పేద, ఆడ - మగ, పశువు-పక్షి, పాము- చీమ శివుని పూజించేవారే. శివప్రేమను చూరగొంటే చాలు, శివతత్వం అర్థం చేసుకొంటేచాలు మనం శివునిగానే మారిపోవచ్చు.

03/06/2016 - 00:17

‘సద్గుణ భూషితమైన రాజ వంశంలో జన్మించిన వాడెవడూ ఇట్లా కారుకూతలు కూస్తాడా? అసలు నీకు రాజ్యార్హత వుందా? రాజ వంశంలో జన్మించావా? నిన్ను అనవలసిన పనిలేదు. నీ తల్లిదండ్రుల దౌర్భాగ్యం ఇది. వాళ్ళు కొర నోములు నోచుకున్నారు. నీవలవల్ల వంశనాశనం జరగబోతున్నది. నీవల్ల యాదవ కులమంతా నిందాస్పదమైంది. తనను తాను పొగడుకోవటం ద్వారా లోకంలో ఎవడూ ప్రజామోదాన్ని పొందలేడు.

03/06/2016 - 00:14

వివాహం అనేది జరిగినా జరక్కున్నా చంద్రప్ప తనూ మానసికంగా ఏనాడో భార్యాభర్తలయ్యారు. మంత్రాలు, సూత్రాలు లేకుంటే మాత్రమేం! కానీ లోకం...
‘‘మంజూ!’’ చంద్రప్ప పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది.
ఏమాలోచిస్తున్నావు మంజూ! గురువుగారి మాటలకు బాధపడకు. జ్యోతిష్యంలో ఉండే ప్రతి దోషానికి నివారణ, శాంతి ఉంటుంది. అన్నీ మళ్లీ చర్చించి చేద్దాం’’.
‘‘ఇక వెళ్దాం చంద్రా! దేవేరి వారు నాకోసం ఎదురుచూస్తారు’’

03/06/2016 - 00:11

క. భూసురు లాదిగఁ గల జను
లీసుర సేవించిరేని యిది మొదలుగఁ బా
పాసక్తిఁ బతితులగుదురు
చేసెతి మర్యాద దీనిఁ జేకొనుఁడు జనుల్

03/05/2016 - 23:48

గోదావరికి పుష్కరాలొస్తున్నాయి. ఎక్కడికి వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తున్న తరుణంలో, ‘కాళేశ్వరమంటే మరో కాశీ క్షేత్రమే’, ఓ మిత్రుడు చెప్పిన మాటలు గర్తుకువచ్చాయి. దూర దూరంలో ఉన్న క్షేత్రాల సంగతి సరే. దగ్గరలోనే ఉన్న కాళేశ్వరం వెళ్లాలని అనుకుంటున్నా ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వచ్చింది. అందరం ప్రభుత్వోద్యోగులం కావడంతో ఒకరికి సెలవు దొరికితే మరొకరికి దొరుకదు.

03/05/2016 - 23:45

రెండు పదులు దాటిన కుర్రాడు మద్యం మత్తులో బండి నడుపుతూ, మొబైల్‌లో తన స్నేహితుడితో ‘బాహుబలి విశేషాల గురించి మాట్లాడుతూ డివైడర్‌కి డాష్ ఇచ్చాడట’. స్పృహలోనే ఉన్న ఆ కుర్రాడి క్రింద పెదవి రెండుగా చీలింది. కుడివైపు కనుబొమ్మ మీద ఎవరో కత్తితో కోసినట్టు ఓ గాయమైంది. మెడ నుండి మోకాలి వరకూ అంతా బాగానే ఉంది, ఒక్క మొహంలోని ఎముకలే విరిగాయి. కొన్ని పళ్ళు దెబ్బతిన్నాయని అక్కడ డ్యూటీ డాక్టరు చెప్పాడు.

03/05/2016 - 23:45

ప్రయాణంలో పదనిసలు - కథ

03/05/2016 - 23:35

మహిళా దినోత్సవంనాడు పార్లమెంట్‌లో మహిళా ఎంపీలు మాత్రమే మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్టప్రతికి ధన్యవాదాలు తెలియజేస్తూ లోక్‌సభలో చేసిన ప్రసంగంలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై మహిళాలోకం హర్షం వ్యక్తంచేస్తోంది. అయితే 16వ లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యంపై పెదవి విప్పితే ఈనాటికీ తలదించుకోవాల్సిన పరిస్థితే.

03/05/2016 - 23:21

పేకాటలో గెలవడం ఎంత సహజమో ఓడడం అంతే సహజం. గెలవడానికి గల కారణాల్ని బేరీజు వేసుకున్నట్లే, ఓడడానికి గల కారణాల్ని వెతుక్కుంటాడు ప్రతీ ఆటగాడు. కాని, ప్రతీ పాలకపార్టీ అట్టహాసంగా తన ప్రణాళికను, విధి విధానాల్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తుంది. అయిదేండ్ల కాలపరిమితికై సిద్ధం చేసిన ఆ ప్రణాళిక, ఆచరణకు నోచుకోదు.

Pages