S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/03/2016 - 04:15

కాకినాడ, ఫిబ్రవరి 2: తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జనలో హింసను ప్రేరేపించిన, పాల్పడిన నిందితులపై కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. మంగళవారం పొద్దుపోయే సమయానికి వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 60 మందిపై కేసులు నమోదయ్యాయి.

02/03/2016 - 04:16

విజయవాడ, ఫిబ్రవరి 2: కాపుల సంక్షేమం కోసం ఏర్పాటైన కాపు కార్పొరేషన్‌కు ప్రస్తుతం వున్న రూ.100 కోట్ల నిధిని వెయ్యి కోట్లకు పెంచేందుకు సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కాపులకు బిసి రిజర్వేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందంటూ సాధ్యమైనంత త్వరగా కమిషన్ నివేదికను తెప్పించుకునే ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

02/03/2016 - 03:56

చర్మం ఎర్రగా మారిపోవడం, మంట పుట్టడం, దద్దుర్లు, పొలుసులు దేరడం, తేమను కోల్పోవడం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తే ఎగ్జిమా, సొరియాసిస్ వంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. ఇంట్లోనే కొద్దిపాటి చిట్కాలను పాటిస్తే చర్మసంబంధ సమస్యల నుంచి ఆదిలోనే గట్టెక్కే అవకాశం ఉంది.

02/03/2016 - 03:01

మహిళల సంక్షేమానికి ఎన్ని చట్టాలు చేసినా భారతీయ సమాజంలో అనాదిగా కొనసాగుతున్న లింగవివక్ష వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని సీనియర్ ఐపిఎస్ అధికారిణి అర్చన రామసుందరం (58) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో పారా మిలటరీ బలగాల్లో ఒకటైన ‘సశస్త్ర సీమా బల్’ (ఎస్‌ఎస్‌బి) డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె- ‘లింగవివక్ష అంతం కానిదే మహిళా సాధికారత సాధ్యం కాద’ని చెబుతుంటారు.

02/03/2016 - 02:57

దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అనతికాలంలోనే అరుదైన ఘనతను సాధించింది. హర్యానాలోని ఫరీదాబాద్ వద్ద జరుగుతు న్న ‘సూరజ్‌కుండ్ అంతర్జాతీయ కళా ప్రదర్శన’లో కీలక రాష్ట్రం (్థమ్ స్టేట్)గా స్థానం సంపాదించడంతో తెలంగాణ సంస్కృతి, కళల గురించి విదేశీయులకు సైతం తెలిసే అవకాశం కలిగింది. ‘30వ సూరజ్‌కుండ్ మేళా’లో తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే స్టాళ్లు సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి.

02/03/2016 - 02:55

‘మొన్న ఏకాదశి నాడు కటిక ఉపవాసం చేశాను.. ఒకేఒక్క పండు తిన్నా..’ అన్నాడట ఒక మహాభక్తుడు. పండు కూడా కటిక ఉపవాసం నాడు తినకూడదుకదా! అని మనసులో అనుకుని ‘ఏం పండు’ అని స్నేహితుడు అడిగాడట. అరటి పండో, బత్తాయి పండో అని చెప్తాడనుకున్నవాడికి కళ్లు తిరిగేలా ఆ భక్తాగ్రేసరుడు పనసపండు అని జవాబిచ్చాడట.

02/02/2016 - 23:17

ఆటో వచ్చి నా ముందరే ఆగింది. డ్రైవర్ వెనక్కి తిరిగి- ‘‘దిగండి బాబూ’’ అని అసహనంగా అన్నాడు.
ఆటో నుండి వౌనంగా దిగిపోయారాయన.

02/02/2016 - 23:07

కాలేజీ క్యాంపస్‌లో అడుగు పెట్టింది మధువని. ఆకాశంలో మేఘాలు విడిపోయి నిర్మలంగా ఉన్నా ఆమె మనసు మాత్రం దట్టంగా అలుముకున్న నిశిరాత్రిలా ఉంది.
‘‘హాయ్ మధూ! అబ్బ ఎన్ని రోజులయిందే మనం కలుసుకుని. ఈ వర్షం, మన సెలవులు అన్నీ కలసి మనల్ని దూరం చేసాయి’’ మధువని భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అంది సుష్మిత.
వౌనంగా ఉండిపోయింది మధువని.

02/02/2016 - 22:32

లేడీస్ క్లబ్ ఆవరణ అంతా మహా సందడిగా ఉంది. అసలే శీతాకాలం ఆరు గంటలు అవకుండానే సంధ్య చీకట్లు తరుముకొస్తున్నాయి. ఆ చీకట్లను తరిమికొడుతూ ఆ ప్రాంతమంతా విద్యుత్ కాంతులు మిరిమిట్లుగొలుపుతున్నాయి.

02/02/2016 - 22:06

‘నాగరాజుకి బ్రేకప్ చెప్పేశావట నిజమేనా’? అడిగింది అమృత.

Pages