S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/15/2019 - 13:48

న్యూఢిల్లీ: రామజన్మ భూమి కేసు విచారణ రేపటితో ముగుస్తుంది. అయిదుగురు సభ్యులు ఉన్న ధర్మాసనం విచారణ జరపుతుంది. దసరా సెలవులుతో సోమవారంనాడు సైతం ఈ కేసును విచారించటం జరిగింది. ఇదిలావుండగా రేపటితో విచారణ పూర్తవుతుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. సున్నీ వక్ఫ్ బోర్డు తరపున సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ వాదించారు.

10/15/2019 - 13:47

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ వద్ద ఖస్భా, కిర్నీ సెక్టార్‌లలో పాక్ సైన్యం షెల్లింగ్, మోర్టర్లతో కాల్పులు జరిపింది. భారత సైన్యం సైతం ధీటుగా సమాధానం ఇచ్చింది. పాకిస్థాన్ సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో ఉండే పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు జరుపుతుంది.

10/15/2019 - 13:46

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం చేసిన కృషి మరువలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కలాం జయంతి సందర్భంగా ప్రధాని మోదీ కలాం జ్ఞాపకాలను ట్విట్టర్ ద్వారా నెమరవేసుకున్నారు. ఉన్నతమైన పదవులు అధిరోహించినా అతి సాధారణ జీవితాన్ని గడిపారని మోదీ కొనియాడారు. వ్యక్తిగతంగా ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేదని, పుస్తకాలే ఆయన ఆస్తి అని అన్నారు.

10/15/2019 - 13:44

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. పర్యాటకుల బస్సు లోయలోపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి - చింతూరు మధ్యలోని వాల్మీకి కొండ వద్ద పర్యాటకులతో వెళ్తున్న ప్రయివేటు బస్సు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

10/15/2019 - 05:07

విజయవాడ, అక్టోబర్ 14: రాష్ట్రంలోని స్వయం సహాయ సంఘాల మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాన్ని నాలుగు దఫాలుగా నేరుగా మహిళా సంఘాలకు అందజేసి రుణభారం నుంచి విముక్తి కలిగిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

10/15/2019 - 05:05

విజయవాడ, అక్టోబర్ 14: రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధికి సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. ఈ చట్టం అమలుకు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ నోడల్ ఏజన్సీగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర స్థాయి కమిటీకి కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

10/15/2019 - 05:04

రాజమహేంద్రవరం, అక్టోబర్ 14: విద్యార్థినులు వేధిస్తున్నారనే ఆరోపణలొచ్చిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఇంగ్లీషు విభాగం అధిపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ సూర్య రాఘవేంద్రను సస్పెండ్‌చేస్తూ యూనివర్సిటీ వైస్-్ఛన్సలర్ పి సురేష్ వర్మ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను విచారించడానికి ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు.

10/15/2019 - 05:02

హైదరాబాద్, అక్టోబర్ 14: ఇద్దరు ఆర్టీసీ కార్మికుల బలవన్మరణాన్ని సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోమవారం బస్ డిపోల వద్ద బైఠాయింపు కార్యక్రమాల్లో కార్మిక కుటుంబాలు కన్నీరు పెట్టారు. శనివారం ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి ఆత్మార్పణం, ఆదివారం హైదరాబాద్‌లో కండక్టర్ సురేందర్ గౌడ్, నర్సంపేటలో డ్రైవర్ ఆత్మహత్యకు ప్రయత్నిండం వంటి ఘటనలు కార్మికుల భయాందోళనలు వెంటాడుతున్నాయి.

10/15/2019 - 04:54

హైదరాబాద్, అక్టోబర్ 14: ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరమైందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరించడం సహించరానిదని పలువురు వక్తలు ధ్వజమెత్తారు.

10/15/2019 - 04:51

హైదరాబాద్, అక్టోబర్ 14: ఆర్టీసీ కార్మికులు 19వ తేదీన నిర్వహించే తెలంగాణ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు అండగా జనసేన కార్యకర్తలు నిలుస్తారని చెప్పారు. 48వేల మంది ఉద్యోగాలు తీసేస్తాననడం సబబుకాదని, అభద్రతా భావంతోనే ఉద్యోగులు చనిపోతున్నారని అన్నారు. సమస్య మరింత జఠిలం చేయకుండా చూడాలని ఆయన హితవుపలికారు.

Pages