S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2019 - 04:10

కౌలాలంపూర్, జనవరి 19: మలేషియా ఓపెన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్, 28 ఏళ్ల సైనా నెహ్వాల్ పోరు ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో స్పెయిన్‌కు చెందిన ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ కరొలినా మారిన్ చేతులో 16-21, 13-21 తేడాతో పరాజయం పాలైంది. 2001 సీజన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సైనా 2017 సీజన్‌లో టైటిల్ అందుకుంది.

01/20/2019 - 04:08

హైదరాబాద్, జనవరి 19: గతంలో భూమి, నీరు, వాయు మార్గాల్లో మూడు రకాలైన యుద్ధాలు మాత్రమే జరిగేవని, కానీ ప్రస్తుతం ఈ మూడింటికీ తోడు అంతరిక్షం, సైబర్ ప్రపంచం కూడా తోడైందని, ఐదు రకాల యుద్ధాలకు దేశాలు సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడిందని డీఆర్‌డీఓ చైర్మన్ , రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు.

01/20/2019 - 04:06

హైదరాబాద్, జనవరి 19: ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసినందుకే రెండోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని అందుకే గవర్నర్ ప్రసంగంలో చేర్చారన్నారు. అన్ని రంగాల్లో వౌలిక వసతులు కల్పించారని చెప్పారు.

01/20/2019 - 04:05

హైదరాబాద్, జనవరి 19: నేత్ర సంరక్షణ, కంటి జీవ శాస్త్రం, శస్త్ర చికిత్సా ప్రక్రియలు, నేత్ర నిధి, బాలల నేత్ర ఆరోగ్యం వంటి రంగాల్లో అనేక వినూత్న ఆవిష్కారాలకు అనేక సంవత్సరాలుగా తాము కృషి చేస్తున్నామని ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్లోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘు గుళ్ళపల్లి తెలిపారు.

01/20/2019 - 05:02

ముమ్మిడివరం, జనవరి 19: విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్ మోహనరెడ్డిపై కోడి కత్తి దాడికి సంబంధించి ఎన్‌ఐఏ అధికారుల బృందం శనివారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో దర్యాప్తు నిర్వహించింది.

01/20/2019 - 04:01

కాకినాడ సిటీ, జనవరి 19: టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు ఎన్నికల సర్వే నిర్వహించారో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ కారెం శివాజీ ప్రశ్నించారు. శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆయన విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు.

01/20/2019 - 03:59

విజయవాడ, జనవరి 19: రాష్ట్ర విభజన జరిగిన దాదాపు నాలుగున్నర సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో గవర్నర్‌ను నియమించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న కిరణ్‌బేడీని ఏపీ గవర్నర్‌గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

01/20/2019 - 03:57

మహబూబాబాద్, జనవరి 19: ఏజెన్సీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి అనువుగా తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం చుట్టూ ఉన్న వాగులు, వంకలు, పాకాల ఏరు వంకల నుంచి ప్రవహిస్తున్న నీటిని వినియోగంలోకి తేవటంలో ప్రభుత్వం విఫలమవుతోంది. దీంతో వేలాది క్యూసెక్కుల నీరు వృధాగా సముద్ర పాలవుతుంది.

01/20/2019 - 03:55

హజీరా (గుజరాత్), జనవరి 19: దేశంలో మొదటి సారిగా ప్రైవేట్ రంగంలో శక్తివంతమైన హౌట్జిర్ గన్స్ కే9వజ్రను తయారు చేసే ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఎల్ అండ్ టీ సంస్థ రూ.4500 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత రక్షణ రంగం స్వావలంభనను అభివృద్ధి చేసేందుకు జరుగుతున్న కృషిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

01/20/2019 - 03:48

గాంధీనగర్, జనవరి 19: ఆఫ్రికా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ అభివృద్ధి, సామాజిక సాధికారత సాధనలో కలిసి పనిచేస్తామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. శనివారం ఇక్కడ విభ్రాంత్ గుజరాత్ గ్లోబల్ సదస్సు సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆఫ్రికా దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

Pages