S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/21/2019 - 01:24

హైదరాబాద్: హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1920 ఏప్రిల్ 20న హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. 1915 ఏప్రిల్ 15న ప్రారంభమైన ఈ భవన నిర్మాణం 1919 మార్చి 31 నాటికి పూర్తయినా 1920 ఏప్రిల్ 20న అధికారికంగా ప్రారంభమైంది.

04/21/2019 - 01:22

హైదరాబాద్, ఏప్రిల్ 20: రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో న్యాయమూర్తుల నియామకం పూర్తి చేసేందుకు కసరత్తు జరగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల కోర్టుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

04/21/2019 - 01:18

అమరావతి: రాజ్యాంగ పరిరక్షణ, సమాజ అభివృద్ధి సివిల్ సర్వెంట్ల అంతిమ లక్ష్యాలు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం అమరావతి సచివాలయంలో ఏపీ హెచ్‌ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో 13వ సివిల్ సర్వీసెస్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

04/21/2019 - 01:15

తిరుపతి, ఏప్రిల్ 20: నాడు ఎస్వీయూ విద్యార్థిగా విద్యార్థుల సమస్యలపై పోరాడాను. విద్యార్థి దశలోనే ఎమ్మెల్యే అయి నియోజకవర్గ ప్రజల సమస్యలపైన పోరాడాను. నేడు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నా. తన చివరి ఊపిరి వరకు ప్రజా, రాష్ట్ర హక్కుల కోసం ఎవరితోను రాజీపడే ప్రసక్తేలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.

04/21/2019 - 01:11

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్ 4,3) సర్వీస్ ఉద్యోగాలకు ఈ నెల 21, ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే వౌర్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు 13 జిల్లాల్లో 1320 పరీక్షా కేంద్రాల్లో 1051 పోస్టులకు 4,95,526 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆదివారం ఉదయం 10 గం. నుండి 12.30 గం.

04/21/2019 - 01:10

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తిరస్కరించారు. వీటి వెనుక పెద్ద కుట్ర ఉందని, ఈ ఆరోపణలన్నీ నిరాధారమంటూ కొట్టి వేశారు. తనపై ఈ ఆరోపణలు చేసిన ఆ మహిళ వెనుక కొన్ని పెద్ద శక్తులే ఉన్నాయని ఆయన అన్నారు. తనపై ఈ రకమైన ఆరోపణలు రావడం నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు.

04/21/2019 - 01:06

రాజంపేట, ఏప్రిల్ 20: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రుడు శనివారం ఉదయం కాళీయమర్దన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చిన అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. కాళీయమర్దనుడిగా రమణీయంగా కనువిందు చేసిన స్వామిని చూసి భక్తజనం జయజయధ్వనాలు చేశారు.

04/21/2019 - 00:03

చేతిలోవున్న అదృష్టం మెదడుకు చేరకముందే మర్చిపోతే-
ఇదేదో సినిమా పాయింట్‌లా ఉందనిపిస్తోంది కదూ. నిజమే -పాయింట్ కనెక్టయితే చాలు కొత్త దర్శకులు.. కాదు కాదు కుర్ర దర్శకులు చెలరేగిపోతున్నారు. సినిమా అంటే ఒకప్పటి రుచి కాదు, కొత్త రుచులు కూడా ఆస్వాదించండంటూ వినోదాన్ని విస్తట్లో వడ్డిస్తున్నారు.

04/21/2019 - 00:01

బోనాలు. ఒక తన్మయత్వపు వేడుక. మహంకాళి, పోచమ్మ తదితర స్ర్తి దేవతలను శతాబ్దాలుగా ఆరాధిస్తూ తమ కాలాతీత నమ్మకాలను వర్తమానంతో మిళితం చేసుకుని, భవిష్యత్తు పట్ల విశ్వాసం నింపుకునే వేడుక. బోనాలు అంటే భోజనం. బువ్వ. వివిధ స్ర్తి దేవతల పేరుతో తాము కొలిచే మహంకాళికి భక్తులు ఇష్టంతో సమర్పించే భోజనం బోనాలు.

04/20/2019 - 23:57

జైపూర్: హమ్మయ్య.. రాజస్థాన్ గెలిచింది. ముంబైపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌గా అజింక్యా రహానే నుంచి బాధ్యతలు తీసుకున్న స్టీవ్ స్మిత్ తొలి మ్యాచ్‌లోనే జట్టును దగ్గరుండి మరీ గెలిపించాడు. శనివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి రాజస్థాన్ ముంబైకి బ్యాటింగ్ అప్పగించింది. దీంతో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, క్వాంటన్ డీకాక్ క్రీజులోకి వచ్చారు.

Pages