S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/17/2019 - 04:58

తిరుపతి : శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య భక్తులకు త్వరితగతిన, సంతృప్తికరంగా స్వామివారి దర్శనం కల్పించాలన్నదే తమ ఆలోచన టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం శ్రీవారి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో పాల్గొన్న ఆయన విలేఖరులతో మాట్లాడారు.

07/17/2019 - 01:27

హైదరాబాద్ : కొత్త టీచర్ల నియామకాలు జరుగుతున్నాయని, పాత టీచర్లకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని చాలా కాలంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నా వౌనంగా ఉన్న ప్రభుత్వం దొడ్డిదారిన మాత్రం టీచర్ల బదిలీలు చేస్తోంది. టీచర్ల బదిలీలకు స్పష్టమైన కౌనె్సలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం, పాలనాపరమైన చర్యలు పేరుతో అడ్డదారిలో బదిలీలు చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

07/17/2019 - 01:26

హైదరాబాద్, జూలై 16: ఎట్టకేలకు ఆల్మట్టి రిజర్వాయర్ నిండబోతోంది. నిన్న మొన్నటి వరకు ఎడారిలా ఉన్న ఆల్మట్టి కర్నాటక, మహారాష్టల్రో కురుస్తున్న భారీ వర్షాలతో జలకళను సంతరించుకుంది. ఇప్పటికే జలాశయం 85శాతం నిం డింది. కర్నాటకలో ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీ. ప్రస్తుతం 105 టీఎంసీలకు నీరు చేరింది.

07/17/2019 - 01:25

హైదరాబాద్, జూలై 16: తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈ నెల 18 నుండి 20 వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వచ్చిన వాతావరణ మార్పుల కారణంగా నైరుతీ రుతుపవనాలు బలంగా మారుతున్నాయన్నారు. తెలంగాణతో పాటు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

07/17/2019 - 01:22

హైదరాబాద్ : తెలంగాణ విద్యాశాఖ అధికారుల తీరే వేరు. దేశం మొత్తం ఒక విధంగా స్పందిస్తే, వీరు మాత్రం మరోలా వ్యవహరిస్తారు. కేంద్ర బడ్జెట్‌పై కనీస అవగాహన కూడా లేని కారణంగా, విద్యా శాఖకు నిధులు తగ్గిపోయాయి. కేంద్రప్రభుత్వం వివిధ పథకాల కింద నిధులు జారీ చేసే ముందు రాష్ట్రాలకు ప్రతిపాదనలు పంపించమని కోరుతుంది.

07/17/2019 - 01:20

హైదరాబాద్, జూలై 16: ఇళ్లు లేని నిరుపేదలపై నయాపైసా భారం మోపకుండా ఉచితంగా ఇచ్చే డబుల్ బెడ్‌రూమ్ పథకం కింద నిర్మించిన లక్షా 23 వేల ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నా, మున్సిపల్ ఎన్నికలు అడ్డంకిగా మారింది.

07/17/2019 - 04:56

గౌహతి : అస్సాంలో కుంభవృష్టి ఫలితంగా తలెత్తిన వరద పరిస్థితి మంగళవారం మరింత ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 17కు పెరిగింది. దాదాపు 45 లక్షల మంది వరదల కారణంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

07/17/2019 - 05:21

విజయవాడ(సిటీ) : రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు, నేతలపై దాడులు పెరిగాయని దీనిపై చర్చించేందుకు వాయిదా తీర్మానానికి అనుమతించాలంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పట్టుబట్టారు.

07/17/2019 - 01:12

అమరావతి, జూలై 16: రాష్ట్ర విభజన నాటి నుంచి కాపు రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రతరమైందని, అయితే నాడు 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో దీనిపై ఆధ్యయనానికి రూ.40 లక్షలు కూడా కేటాయించకుండా వంచించారని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఆరోపించారు.

07/17/2019 - 05:22

అమరావతి : ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పట్ల విశ్వసనీయత పెంపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతివారం నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమం అమలు తీరుతెన్నులపై మంగళవారం సచివాలయం నుంచి సమీక్షించారు. ఇందులో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Pages