ఈ వారం తార

హాట్ స్వీట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తెరపై అదృష్టాన్ని వెతుక్కుంటూ బెంగాల్ నుంచి ఎగిరొచ్చిన బంగారు బొమ్మ -మిస్తీ. అసలు పేరు -ఇంద్రాణి చక్రవర్తి. ముద్దుపేరు మిస్తీ. పేరుకు తగ్గట్టే తియ్యని అందం. -‘చిన్నదాన నీకోసం’ అంటూ వెతుక్కుంటున్న నితిన్‌తో ఫస్ట్‌టైం టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. వాస్తవానికి కెమెరాకు మిస్తీ కొత్తేం కాదు. ఏరికోరి సుభాష్‌ఘాయ్ ఎంచుకున్న కుందనపు బొమ్మే ఈ -‘కాంచి’. మనీషా కోయిరాలా, జాకీష్రాఫ్, మహిబా చౌదరిలాంటివాళ్లను స్క్రీన్‌కు పరిచయం చేసిన సుభాష్ -తన ‘కాంచి’ ప్రాజెక్టు కోసం వెతికివెతికి ఎంపిక చేసుకున్నాడు. 350కి ఆడిషన్స్ నిర్వహించి -ఒక్క లుక్‌లోనే మిస్తీని ఒకే చేశాడు సుభాష్. అలా స్క్రీనింగ్‌లో మార్కులు కొట్టేసింది మిస్తీ. ప్యార్ కా పంచనామాలో కార్తీక్ తివారితో జత కట్టి, ‘ఆకాశ్‌వాణి’లోనూ అందంగా కనిపించింది మిస్తీ. బెంగాలీ సహా ఒకవైపు ప్రాంతీయ భాషా సినిమాలపై దృష్టిపెడుతూనే -బాలీవుడ్‌లో తనెంటో నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తోంది. పక్కింటి పిల్లలా కనిపించే ఈ బెంగాలీ భామ -పుట్టింది పెరిగింది కోల్‌కతాలోనే. ‘చిన్నదాన నీకోసం’లో మంచి పర్ఫార్మెన్స్ అందించిన ఇద్రాణి -తెలుగులో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆశపడుతోందట. నెరవేరాలని ఆశిద్దాం.