S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/18/2018 - 02:34

ముంబయి: ప్రపంచ సానుకూల సంకేతాల మధ్య ఎఫ్‌ఎంసీజీ, లోహ, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తిరిగి బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 284 పాయింట్లు పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 11,470.75 పాయింట్ల వద్ద ముగిసింది.

08/18/2018 - 01:39

న్యూఢిల్లీ, ఆగస్టు 17: చమురు మార్కెటింగ్ సంస్థలు శుక్రవారం నాలుగు మెట్రో నగరాలలో డీజిల్ ధరలను పెంచాయి. అయితే పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. గురువారం ఈ రెండింటి ధరలు పెరిగాయి. పెరిగిన రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 77.20, ముంబయిలో రూ. 84.63, కోల్‌కతాలో రూ. 80.14, చెన్నయ్‌లో రూ. 80.19గా ఉంది. పెట్రోల్ ధరలు ఢిల్లీలో తక్కువగా ఉంటాయి.

08/18/2018 - 00:41

న్యూఢిల్లీ, ఆగస్టు 17: బొగ్గును మినహాయించి, మిగతా లోహాలకు సంబంధించిన గనుల అనే్వషణకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని కేంద్రం ఆహ్వానిస్తున్నది. ఏటా పెరుగుతున్న డిమాండ్‌కు సరిపర ఉత్పత్తి లేకపోవడంతో, కొత్త గనులను కనుక్కోవడం, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం అత్యవసరమైంది.

08/18/2018 - 01:38

న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశంలో పర్సనల్ కంప్యూటర్ (పీసీ) మార్కెట్ శర వేగంతో విస్తరిస్తున్నది. డిమాండ్ కూడా రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ విషయాన్ని అంతర్జాతీయ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మాసాల మధ్య పీసీ మార్కెట్ 28.1 శాతం పెరిగిందని తెలిపింది. దీనితో పీసీల అమ్మకం 2.25 మిలియన్ యూనిట్లకు చేరింది.

08/18/2018 - 00:39

న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి మృతికి నివాళిగా దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నందున ఐపీపీబీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

08/17/2018 - 17:34

ముంబయ: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 284 పాయింట్లు లాభపడి 37,948 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 86 పాయింట్లు లాభపడి 11,471 వద్ద సరికొత్త రికార్డులో ముగిసింది.

08/17/2018 - 01:20

మదుపరులను వెంటాడిన రూపాయి బలహీనత ఖ 188 పాయింట్లు తగ్గిన సెనె్సక్స్ ఖ 11,400 దిగువకు నిఫ్టీ

08/17/2018 - 01:21

పుణే, ఆగస్టు 16: కాస్మొస్ బ్యాంక్‌లో చోటు చేసుకున్న భారీ సైబర్ మోసంపై విచారణకు ప్రత్యేక బృందం (సిట్)ను ఏర్పాటు చేసినట్టు పుణే పోలీస్ అధికారులు ప్రకటించారు. బ్యాంక్ మాల్‌వేర్‌ను హ్యాక్ చేసి, కేవలం రెండు రోజుల్లోనే 94 కోట్ల రూపాయలను కాజేసిన వైనం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫిర్యాదు అందుకొని రంగంలోకి దిగిన పోలీస్‌లు ఇది సైబర్ నేరం కావడంతో సిట్‌ను ఏర్పాటు చేశారు.

08/17/2018 - 00:46

న్యూఢిల్లీ, ఆగస్టు 16: కేంద్ర తీసుకుంటున్న చర్యలు, ఆర్‌బీఐ తీర్మానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఇటీవల బ్యాంక్‌లకు చేరుతున్న డబ్బు స్పష్టం చేస్తున్నది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ, రెపో రేట్‌ను ఇటీవలే ఆర్‌బీఐ పెంచిన విషయం తెలిసిందే. దీనికితోడు కేంద్రం దివాలా చట్టాన్ని చురుగ్గా అమలు చేస్తున్నది. దీనితో మొండి బకాయులు క్రమంగా తిరిగి రావడం మొదలైంది.

08/17/2018 - 00:45

ముంబయి, ఆగస్టు 16: రూపాయి పతనం గురువారం కూడా కొనసాగింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు పడిపోయి, 70.15 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 70 మార్కుకన్నా కిందికి దిగజారడం చరిత్రలో ఇదే మొదటిసారి. టర్కీ కరెన్సీ సంక్షోభం ప్రతికూల ప్రభావం వల్ల రూపాయి బలహీనపడుతోంది.

Pages