S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

03/26/2017 - 21:57

ఆకాశంబున నినె్చ ఘల్ఘలలు నృత్యన్మంజుమంజీర శిం
జా కల్యాణ పరంపరాశ్రుతులు ఋక్సామోజ్వల ద్ఘోషలున్
రాకా చంద్ర కలా తరంగ తతి చర్చాసాంద్రతల్ నూత్న వి
శ్వాకారంబు సహస్ర పత్రకమల స్పందద్వికాసంబులై

03/26/2017 - 21:56

నామ కోశము
శ్రీమదాంధ్ర భారతము,
రెండు భాగములు
వెల: ఒక్కొక్క భాగము 700
ప్రతులకు: నవోదయ, కాచిగూడ చౌరస్తా, హైదరాబాదు లేదా
రచయిత: 17-1-388-1-ఎ,
శ్రీ లక్ష్మీనగర్ కాలనీ, హైదరాబాదు-51.
**

03/26/2017 - 21:52

ఆధునిక తెలుగు సాహిత్యంలో అంపశయ్య నవీన్ ఒక విలక్షణమైన కాల్పనిక వచన రచయిత. విలక్షణత వారి మొట్టమొదటి నవల ‘అంపశయ్య’ మొదలు, ముప్ఫై రెండవ నవల ‘ప్రేమకు ఆవలి తీరం’ దాకా మళ్ళీ మల్ళీ రుజువవుతూనే వుంది.

03/20/2017 - 00:58

మనిషన్నాక జిగ్రి దోస్తులుండాలె
మనిషి మనిషికీ మహా సోపతి గాళ్లుండాలె
కరచాలనమే ఒక నులివెచ్చని స్పర్శ

బాధల గాథలు బొక్కెనతో చేది
తల్లడిల్లిన మనసును సేద తీర్చేందుకు
సావాసగాళ్లు ఒక్కరిద్దరైనా ఉండాలి

ఆత్మాఆత్మ ఆలింగనం చేసికొని
ఆపతిల ఆదుకొనే ఆకృతి స్నేహం
జిందగీ నిండా జిలుగు వెలుగుల పూలు

03/20/2017 - 00:57

మనం ఒక వ్యక్తిని వ్యక్తిగా అంచనావేస్తాం. ఒక శక్తిగా కూడ వ్యక్తి సద్గుణుడైతే మంచివాడంటాం. వ్యక్తి ప్రతిభావంతుడైతే శక్తిమంతుడంటాం. అవి రెండూ కలిసినవాన్ని మహానుభావుడు, మహాత్ముడని అంటాం. ప్రతిభ గొప్పదా, మంచితనం గొప్పదా అని అంటే, రెండూ అనవలసి వస్తుంది. ఒకటి మాత్రమే ఉండి ఇంకొకటి లేకపోతే వ్యక్తి అంతగా రాణించడు, జనుల హృదయాల్లో చోటుచేసికోడు, అట్టే కాలం జ్ఞాపకముండదు.

03/20/2017 - 00:52

అందరం వెళ్ళిపోవాలి
బ్రతుకు కలవరాలన్నింటికీ వీడ్కోలు పలికి
సన్నిహితంగా మెలిగిన జ్ఞాపకాల్ని ఓదార్చుకుని
మట్టి పూతలతో నిండిపోయిన కలలు
మృత్యువు తలుపు తట్టి నిల్చున్నాక
ఒక పరిపూర్ణ వేదన అంతమవుతుంది
ఎక్కడనుంచి వచ్చావు?
తొమ్మిది గుమ్మాల గూడు ధ్వంసమవుతుంది
నీలో ఏదీ నీకోసం మిగలదు కదా
భయాలు కూలిపోయాయి
బొడ్డు పేగు మట్టిలోంచి మరలా మొల్చి

03/20/2017 - 00:59

తెలుగు సాహిత్యంలోని అనేక ప్రక్రియలలో అవధానం ఒకటి. ఆధునిక కాలంలో ఒకటి రెండు భాషల్లో ఈ ప్రక్రియ ఉన్నా తెలుగులో ఉన్నంత ప్రాచుర్యం మరే భాషలోనూ లేదనే చెప్పవచ్చు. ఈ అవధాన రంగంలో డా.సి.వి.సుబ్బన్నగారు 1950 ప్రాంతంలో అడుగుపెట్టి శతావధానిగా పేరుపొంది రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాలలో పండితుల మెప్పు పొందా రు. అయిదు దశాబ్దాలు అవధానాన్ని నిబద్ధతతో కళాత్మకంగా నిర్వహించారు.

03/12/2017 - 21:59

పట్టాలకు వ్రేలాడే రైలు బండి లాంటి
అతను
పొగకక్కడమే జీవితమనుకొంటాడు
చివరికి మిగిలేదేముందని
ఎవరు ఎంత ప్రశ్నిస్తే ఏమిటి
తాను కూడా ఒక అవశేష దుఃఖమని
ఎంతకూ అర్థం చేసుకోలేడు
తాను బతుకగా మిగిలిన
ఏ కొంచెం గాలో అది
దాన్నైనా శుభ్రంగా పిలుస్తాడా అంటే
అబ్బే అసలు ఇష్టపడడు
అగాథ వ్యాకరణం
సరళీకరణం చెందినపుడు
ఒక రసోన్మాదంవల్ల

03/12/2017 - 21:57

చెమట చుక్కనెప్పుడూ
చులకన చెయ్యెద్దు
నుదుటి మీద రాతనే మార్చగలదు-
నుదురుపై మొలిచిన చెమట!
సేవకుడూ, కర్షకుడూ, శ్రామికుడూ....
వీళ్ళంతా భ్రమల్లో బతకరు-
శ్రమలోనే జీవిస్తారు!!
స్వేదం - ఒక వేదం....
కరకురాయిని పిండి చేసి
బీడుభూమిని పండించే మనోజ్ఞరాగం
శ్రమైక జీవన సౌందర్యానికి
నిలువెత్తు సత్యం

03/12/2017 - 21:56

అకాడమీలు, భాషా ప్రాధికారిక సంస్థలు చేస్తున్న కార్యక్రమాలు చాలా సందర్భాల్లో ఆయా భాషా సాహిత్య సంస్కృతుల వికాసానికి, ఇరుగు పొరుగు భాషల్లో ఆయా భాషల స్థానాన్ని సుస్థిరపరచేందుకు, వికాసానికి తోడ్పడతాయి. అయితే కారణాలేవయినా అకాడమీలు రద్దుకావడంతో దాదాపు మూడు దశాబ్దాల నుండి తెలుగువాళ్ళం ‘అకాడమీ’లు చేసే కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యాం.

Pages