S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/19/2019 - 01:32

యానిమేషన్ స్టూడియోకు నిప్పు*

36 మందికి గాయాలు.. మరో పది మంది పరిస్థితి విషమం*
జపాన్‌లో ఓ దుర్మార్గుడి దారుణం

07/18/2019 - 23:45

కాట్మండు, జూలై 18: బౌద్ధుల పుణ్యభూమిగా భావించే నేపాల్ దేశంలో జరగకూడని విధ్వంసమే జరిగింది. బౌద్ధులు ఆరాధ్యదైవంగా భావించే బుద్ధుడికే కొంతమంది అపచారం తలపెట్టారు.

07/18/2019 - 23:05

ప్యారిస్‌లోని చాంటిలీలో గల తమ కార్యాలయం వద్ద అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ లిప్టన్ (కుడి)కు స్వాగతం పలుకుతున్న ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి బ్రూనోలే మైర్, బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ గవర్నర్ ఫ్రాంకోస్ విలెరాయ్ డి గల్ హువా. దేశంలో వివిధ అభివృద్ధి పనులకు ఐఎంఎఫ్ సాయాన్ని ఫ్రాన్స్ కోరుతోంది.

07/17/2019 - 04:18

ఐక్యరాజ్యసమితి, జూలై 16: భారత్‌లో తినడానికి తగినంత తిండిలేని వారి సంఖ్య తగ్గగా, ఊబకాయుల సంఖ్య పెరిగింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 82 కోట్ల మంది ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారని కూడా ఈ నివేదిక వెల్లడించింది.

07/16/2019 - 23:34

లండన్, జూలై 16: భారత్‌లోని మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలు మారే పరిస్థితి లేదని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ విధానాన్ని రూపొందించడం జరిగిందని భారత్ వాణిజ్య, పారిశ్రామిక మంత్రి పియూష్ గోయల్ మంగళవారం నాడిక్కడ వెల్లడించారు.

07/16/2019 - 23:22

ది హాగ్, జూలై 16: పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరి శిక్ష విధించిన భారత నేవీ రిటైర్డ్ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసుపై అంతర్జాతీయ కోర్టు (ఐసీజే) బుధవారంనాడు తీర్పును వెలువరించనుంది. కుల్‌భూషణ్ జాదవ్ విడుదల కోసం భారత్ సమర్పించిన సమగ్ర సమాచారం ఆధారంగా ఐసీజే తన తీర్పును ప్రకటించనుంది. 49 ఏళ్ల జాదవ్‌ను బలూచిస్తాన్ ప్రాంతంలో 2016 మార్చి 3న పాక్ సైన్యం పట్టుకుంది.

07/16/2019 - 23:10

రంగ్‌పూర్ (బంగ్లాదేశ్), జూలై 16: భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సీమాంతర స్మగ్లింగ్‌ను పూర్తిగా అడ్డుకోజాలమని బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతాబలగం బోర్డర్ గ్వార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) పేర్కొంది. ఈ స్మగ్లింగ్‌ను నిరోధించడానికి భారత సరిహద్దు భద్రతాబలగం (బీఎస్‌ఎఫ్) మరింతగా సహకరించాలని కోరింది.

07/16/2019 - 23:10

న్యూయార్క్, జూలై 16: ఎప్పుడు ఎక్కడ ఏ మేరకు వర్షాలు కురుస్తాయి?, వరదల ప్రభావం ఎలా ఉంటుంది? అని ముందుగానే అంచనా వేసే సరి కొత్త పరికరాన్ని అమెరికా శాస్తవ్రేత్తలు కనుక్కున్నారు. ఈ శాస్తవ్రేత్తల బృందంలో భారతీయ సంతతికి చెందిన శాస్తవ్రేత్త కూడా ఉన్నారు. అమెరికా, న్యూయార్క్‌లోని సిటీ కాలేజీకి చెందిన పరిశోధకులు నాస్సెర్ నజ్బీ, నరేష్ దేవినేని దీనిని కనుక్కున్నారు.

07/16/2019 - 05:11

న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంలో నిలిచి ఉన్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ 737 బోయంగ్ విమానం. రెండు ఘోర ప్రమాదాల నేపథ్యంలో బోయంగ్ 737 మాక్స్ విమానాలను ఇకపై వినియోగించబోమని అమెరికన్ ఎయిర్‌లైన్స్ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఏరోస్పేస్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బోయింగ్ కంపెనీ షేర్ ధర 1.4 శాతం పతనమై 360.23 డాలర్లకు చేరింది.

07/16/2019 - 04:53

లండన్, జూలై 15: భారతీయ రైల్వేలను అవినీతి రహితంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. తమ శాఖలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్టు ఆదివారం ఇక్కడ చెప్పారు. యూకేలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన పీయూష్ గోయల్ బ్రిటన్‌లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.

Pages