S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/12/2017 - 01:19

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ వివాహంపై నెలకొన్ని సస్పెన్స్‌కు తెరపడింది. తమపెళ్లి మిలన్ (ఇటలీ)లోని ఒక ప్రైవేటు రిసార్ట్‌లో జరిగిందని కోహ్లీ, అనుష్క ట్విటర్ ద్వారా సమాచారమిచ్చారు. పెళ్లి ఫొటోలను కూడా వారు సోషల్ మీడియాలో ఉంచారు. ముంబయ, ఢిల్లీ నగరాల్లో వేర్వేరుగా వారు రిసెప్షన్ ఇవ్వనున్నారు.

12/12/2017 - 01:18

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారత్‌లో 2019-2023 కాలానికి ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం 81 మ్యాచ్‌లు జరుగుతాయి. సోమవారం జరిగిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఫ్యూచర్ టూర్ ప్రోగామ్ (ఎఫ్‌టీపీ)ని లాంఛనంగా ఆమోదించారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. కాగా, రాబోయే ఎఫ్‌టీపీలో 30 మ్యాచ్‌లు అదనంగా జరుగుతాయి.

12/12/2017 - 01:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఇటీవలే ఐర్లాండ్‌తోపాటు టెస్టు హోదాను సంపాదించుకున్న అఫ్గానిస్థాన్ జట్టు తన తొలి టెస్టును టీమిండియాతో ఆడే అవకాశాలున్నాయి. నిజానికి 2019లో ఆస్ట్రేలియాతో అఫ్గాన్ మొదటి టెస్టు దాదాపు ఖాయమైంది. అయితే, ఆ అఫ్గాన్ క్రికెట్ బోర్డుతో ఉన్న సన్నిహిత సంబంధాలను దృష్టిలో ఉంచుకొని, మొదటి టెస్టుకు ఆతిథ్యమివ్వాలని బీసీసీఐ తీర్మానించింది.

12/12/2017 - 01:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్‌లో విజయం సాధించి, ఈ సీజన్‌ను పూర్తి చేస్తానని భారత బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు ధీమా వ్యక్తం చేసింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌కు అన్ని విధాలా సిద్ధమయ్యానని సోమవారం పీటీఐతో మాట్లాడుతూ సింధు తెలిపింది. గత ఏడాది, రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న సింధు ఈ ఏడాది అదే ఒరవడిని కొనసాగించింది.

12/12/2017 - 01:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన వారికి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్)ను వర్తింప చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ తెండూల్కర్ విజ్ఞప్తి చేశాడు. చాలా మంది క్రీడాకారులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ, సరైన చికిత్స చేయించుకోలేకపోతున్నారని సచిన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

12/12/2017 - 01:10

హామిల్టన్, డిసెంబర్ 11: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌పై న్యూజిలాండ్ పట్టు బిగించింది. మాజీ కెప్టెన్ రాస్ టేలర్ రికార్డు శతకంతో రాణించడంతో, రెండో ఇన్నింగ్స్‌ను ఎనిమిది వికెట్లకు 291 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రత్యర్థి ముందు 414 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

12/12/2017 - 01:08

మాడ్రిడ్, డిసెంబర్ 11: స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లిగాలో బార్సిలోనా సూపర్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ జోరు కొనసాగుతున్నది. విల్లారియల్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అతను 83వ నిమిషంలో ఒక గోల్ చేశాడు. అంతకు ముందు, 72వ నిమిషంలో లూయిస్ సొరెజ్ గోల్ సాధించాడు. దీనితో బార్సిలోనా రెండు గోల్స్‌తో ఆధిక్యాన్ని సంపాదించి, అదే తేడాతో మ్యాచ్‌ని ముగించింది. విల్లారియల్ ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది.

12/11/2017 - 02:13

భువనేశ్వర్, డిసెంబర్ 10: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాకే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్ టైటిల్ దక్కింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగినీ జట్టు తుది పోరులో అర్జెంటీనాను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. ఎత్తులు, పైఎత్తులతో సాగిన ఈ మ్యాచ్ కొంత సేపు ఉత్కంఠ రేపినప్పటికీ, పెనాల్టీ షూటౌట్ వరకూ ఆటను కొనసాగించడమే రెండు జట్లు లక్ష్యంగా ఎంచుకోవడంతో, ఎక్కువ సమయం నింపాదిగా సాగింది.

12/11/2017 - 02:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన ఫ్యూచర్స్ టూర్ ప్రోగ్రాం (ఎఫ్‌టీపీ) తీరుపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సోమవారం జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఒక నిర్ణయానికి రావచ్చని తెలుస్తున్నది.

12/11/2017 - 02:17

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి నిరోషన్ డిక్‌విల్లా బి సురంగ లక్మల్ 2, శిఖర్ ధావన్ ఎల్‌బి ఏంజెలో మాథ్యూస్ 0, శ్రేయాస్ అయ్యర్ బి నువాన్ ప్రదీప్ 9, దినేష్ కార్తీక్ ఎల్‌బి సురంగ లక్మల్ 0, మనీష్ పాండే సి ఏంజెలో మాథ్యూస్ బి సురంగ లక్మల్ 2, మహేంద్ర సింగ్ ధోనీ సి దనుష్క గుణతిలక బి తిసర పెరెరా 65, హార్దిక్ పాండ్య సి ఏంజెలో మాథ్యూస్ బి నువాన్ ప్రదీప్ 10, భువనేశ్వర్ కుమార్ సి నిరోషన్ డిక్‌విల్లా బి సురం

Pages