S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భవిత ప్రగతికి నాంది.. ఉగాది

పంచపాదం పితరం ద్వాదశాకృతం
దివ ఆహుః పరే అర్థే పురీషిణం
అధౌమే అన్య ఉపరే విచక్షణం
సప్తచక్రీ షకోర ఆహురర్పితమితి
- ఋగ్వేదం
సర్వ ప్రపంచమునకు పై భాగము నందుండి, తన కిరణముల పరిపాక విశేషము చేత సంవత్సరము, ఆయనము, ఋతువు, మాసము, పక్షము, దినము మొదలైన కాల భేరాల్ని ఏర్పరుస్తున్నారు సూర్యుడని చెప్పింది వేదం. కాలాన్ని ఏర్పరచి భాగవిభాగాలుగా ఉన్న సంవత్సరంగా కొలత ఇచ్చి, హేమంతము శిశిరము. ఒక ఋతువుగా చెపితే, అయిదు ఋతువులుగా లేక ఆరు ఆకులు అనగా ఆరు ఋతువులతో, ఏడు చక్రాల రథముతో ఏడు గుర్రములుగా చెప్పబడే ఏడు రంగులతో లేక వారములోని ఏడు దినములతో, పనె్నండు రూపాలు అనగా పనె్నండు నెలలుగా అన్నిటికీ నియామకుడుగా, తండ్రిగా వ్యవహరిస్తున్నారు సూర్యభగవానుడని ఋగ్వేదం చెపుతోంది.
కనుక, జీవానికి కార్యకలాపాలకు మూల కారణం సూర్యుడు. సూర్యుడు - శక్తి (ఎనర్జీ). చంద్రుడు సూర్యుని వెలుగు చేత ప్రకాశించినట్లే, పదార్థం కూడా శక్తి ద్వారానే ప్రకటితమవుతుంది. కనుక, చంద్రుడే పదార్థం (మ్యాటర్) అన్ని గ్రహములకు, భూమికి, శక్తి పదార్థముల క్రియాక్రియల పరస్పర సమ్మేళనమే. అనంతమైన కాలంగా, సృష్టి ప్రళయాలుగా వ్యక్తమవుతుంది. ఇదే ‘కాల’ గమనానికి, గణనానికి మూలం. కాల సంబంధమైన పండుగ - ఉగాది.
కాలము
అర్థకామాలు: కాలము అపరిమితమైనది. అపరిమితమైన కాలాలలో పరిమితమైనది మానవజీవితం. ఎన్నో జన్మల పుణ్యఫలము చేత లభించింది మానవ జన్మ. కాలాన్ని కేవలము లౌకిక వ్యవహారముల నిమిత్తమై, ధన, కనక, వస్తు, వాహనముల కోసం వినియోగించి, వృథా చేయక, అర్థ, కామాలు కావల్సినవే. అయితే వాటిని ధర్మబద్దంగా అనుభవించి, కాలాన్ని కాయాన్ని సార్థకం చేసుకోవాలని, హెచ్చరించే కాల సంబంధమైన పండుగ - ఉగాది.
కాలము - పరమాత్మ స్వరూపము
సంవత్సరము, సూర్యభగవానుని రూపమని ఉపనిషత్తులు చెపుతున్నాయి. పారమార్థికమైన చైతన్యమే, కాలస్వరూపంగా ‘సంవత్సరః’ అని పిలుస్తారని వివరించారు శ్రీ శంకర భగవత్పాదులు. కాలస్వరూపుడై సంవత్సర రూపంలో వెలుగొందేవాడు పరమాత్మ. సమస్తమును లెక్క చూచేవాడు కౌలుడు. సర్వజీవుల చరాచరముల, ఆయువును గణనం చేసే, కాలస్వరూపుడైన ఈశ్వరుడే ‘‘కౌలుడని’’, ఆయనే్న ‘‘కాలాయ నమః’’ అన్నారన్నారు ఆదిశంకరులు. ఆద్యంతము విలువైన కాలము భగవంతుని స్వరూపము.
కాల స్వరూపం
జీవితం: ‘కాల’లో, ‘కా’ అనగా శుభములను, ‘ల’ అనగా అందించునది అని అర్థం. ‘‘అహమేవ అక్షయ కాలః’’ అనేది భగవద్వాక్యం. ‘‘అక్షయమైన కాలాన్ని నేనే’’ అని చెప్పాడు పరమాత్మ. ‘‘కాలః కలయతా మహం’’ అన్నాడందుకే. ‘‘కాలా అప్రునివి శక్తే’’ అని చెప్పింది యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం. కాలము జలములందున్నది. అనగా సంవత్సరానికి ‘నీరే’ స్థానం. ‘‘అపోవా ఇదమగ్రేసలిలమాసేత్’’ అన్న వేద ప్రమాణము చేత, సృష్టికి పూర్వం అంతా జలమయమే అగుట చేత సంవత్సరము మొదలగు కాలములకు జలమే ఆధారం. జలములకు సంవత్సర స్వరూపుడైన సూర్యభగవానుడు ఆధారం. జలముల వల్లనే సంవత్సరానికి అవసరమైన జీవధాతువులు, ఆహారం లభిస్తాయి. కనుక సంవత్సరానికి జలములు ఆధారం. కాలానికి, జలానికి ఉండే అవినాభావ సంబంధం తెలుసుకుంటే కాలస్వరూపం ‘జీవితం’ అని గోచరమవుతుంది.
కాలానికి కొలమానం
ఈ విశ్వంలో ప్రతిదానికి ఒక కొలమానం ఉంది. అలాగే కాలానికి కూడా కొలమానం ఉంది. అదేమిటో పరిశీలిద్దాం. అంతరిక్షం మన మస్కిష్కంలో మెదలినప్పుడు జ్ఞప్తికి వచ్చేవారు. సూర్యచంద్రులు, గ్రహ నక్షత్రములు, వీటి ప్రభావం ప్రకృతిపై బాగా ఉంటుంది. అంతరిక్షంలో ఒక వస్తువు పొందే మార్పుకి, కదలికకు ఒక కొలమానం ఇచ్చారు. ‘‘అంతరిక్షంలో పుర్భారిషోదకాభిః..’’ దీనినే ‘కాలము’ అన్నారు. అందరూ కాలానికి బద్ధులే. కాలానికి పక్షపాతం లేదు. స్వార్థం లేదు. కనుకనే ‘కాలం’ భగవత్స్వరూపం అన్నార. మన్వంతరము, యుగములు, సంవత్సరము, ఆయనములు, ఋతువులు, మాసము, పక్షము, వారము, రోజులు, రాత్రింబవళ్లు, ఘడియలు, విఘడియలు, త్రుటి, కనురెప్పపాటు. ఇలా కాలానికి కొలమానాన్ని నిర్ణయించారు.
ప్రకృతి శోభ
శిశిర ఋతువు నందు జీవశక్తిలేమితో, ఆకులు రాల్చి మోడువారిన వృక్షణములు, తిరిగి సమస్త విశ్వంలో పదార్థ ధర్మాలకు ‘‘ప్రతీకలైన ‘‘వసువులు’’ అధిదేవతలు కానున్న వసంతఋతువు ఆగమనంతో ప్రకృతిలో నవజీవనం వెలిగి నూతన తేజోత్సాహాన్ని కలిగిస్తుంది. కనుకనే ‘‘ఋతూనాం కుసుమాకరః’’ ఋతువులలో వసంత ఋతువును నేనే’’నని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో సెలవిచ్చారు. మోడువారిన జీవితాలను చైతన్యవంతం చేసి, వైషమ్యాలను, వైరుధ్యాలను, వైమనస్యాలను తొలగించి, నవ్య తేజస్సుతో, భవిత ప్రగతికి బంగారు బాటలు దిద్దే మహోదాత్త శక్తి ప్రకృతి. మృగ నగ భగ తరుతారులతాదులు, చీకటి వెలుగలన్నీ ప్రకృతి వర ప్రసాదమే.. సూక్ష్మరూపంగా.. శబ్ద స్పర్శ రూప రస గంధములు తనలో అదృశ్యంగా ఉండే పంచభూతములను దర్శించి అవగాహన చేసుకునేందుకు, బాహ్య ప్రపంచంలో అనగా బాహ్య ప్రకృతిలోని భూమి, నీరు, నిప్పు, గాలి ఆకాశాన్ని గురించి ఆలోచిస్తాం. ఇదే ప్రకృతి శోభ. ఈ ప్రకృతియే శక్తిస్వరూపం, అదే పరమాత్మ స్వరూపం. ఈ విశేషాన్ని హృద్యంగా అందించారు నాదయోగి శ్రీత్యాగరాజస్వామి, వాగధీశ్వరీ రాగ కీర్తనలో ‘‘పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరె హరియట హరుడట. సురలట, నరులట అఖిలాండ కోటులట. ఇందరిలో గగనానిల తేజోజల భూమయమగు మృగ ఖగ నగ తరు కోటులలో సగుణములలో విగుణములలో సతతము సాధు త్యాగరాజార్జితుడిలలో..
వసంత ఋతువు
ఆరు ఋతువులలో మొదటిది వసంత ఋతువు. ‘‘మధుశ్చ మాధవశ్చ వాసన్తి కావుతూ’’ అన్నది లేదు. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. ‘‘మధు’’ పదానికి చైత్రమాసము, అశోకవృక్షము తేనె మున్నగు అర్థాలున్నాయి. పౌర్ణమి చిత్తా నక్షత్రంతో కూడిన మాసం చైత్రమాసం ‘‘ఇంద్రస్య చిత్రా’’ చిత్తా నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. చిత్తా నక్షత్రం కుజగ్రహానిది. కుజుడు అగ్ని సంబంధమైన గ్రహం. విశాఖా నక్షత్రంలో పౌర్ణమి వస్తే, అది వైశాఖ మాసం. విశాఖా నక్షత్రానికి అధిపతి గురుడు మాధవవరానికి - వైశాఖం. తేనె, ఇంద్రుడు, అనే అర్థాలున్నాయి. చైత్రమాసంలో సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. వైశాఖమాసంలో, వృషభ రాశిలో ఉంటాడు. కుజ, గురులు సూర్యునికి మిత్రులు. ఇంద్రాగ్నులు. సూర్య స్వరూపులు. చిత్తా, విశాఖా నక్షత్ర కాంతులు - సూర్యకాంతులు. కనుక, రవి మేష, వృషభ రాశులలో ఉన్నప్పుడు కలిగే ప్రకృతి శోభ, దాని ప్రభావము, ఇంద్రాగ్నుల, చిత్తా, విశాఖా నక్షత్రముల ప్రభావముల మేలు కలయిక వచ్చేది వసంత ఋతువు అని జ్యోతిష, ఖగోళ, వేద శాస్తమ్రులు పేర్కొన్నాయి.
యుగాది - ఉగాది
‘యుగాది’ అంటే యుగ ప్రారంభము అని అర్థము. ‘యుగ’ అనగా కృత, త్రేతా, ద్వాపర, కలియుగ ప్రారంభ దినములను పండుగగా జరుపుకున్నారు. వైశాఖ శుద్ధ తదియనాడు - కృతయుగాది, కార్తిక శుద్ధ దశమనినాడు త్రేతాయుగాది, భాద్రపద బహుళ త్రయోదశి ద్వాపర యుగాది, మాఘ పౌర్ణమి కలియుగాది పండుగలను జరుపుకొనేవారు. కాలానుగుణంగా ఆ పద్ధతి మారి యువ ఆరంభ దినములలో కాక, నూతన సంవత్సర ఆరంభకాలాన్ని పండుగగా జరుపుకుంటున్నాం. అదే ఉగాది పండుగ.
పరమాత్మకు ‘‘యుగాది కృత్’’ అనే పేరుంది. యుగాన్ని సృష్టించడమే కాక, యుగమును నడిపేవాడు, కూడా పరమాత్మే కనుక ఆయనకు ‘‘యుగావర్తకుడు’’ అని పేరు. ‘‘యుగాది కృత్యునిగా వర్తో నైక మాయో మహాశనః’’ అన్నాయి విష్ణు సహస్ర నామములు.
‘‘యుజిర్ యోగే’’ అనే ధాతువు నుండి వచ్చింది యుగము కనుక, యుగము, యోగము. యోగమనగా చిత్తవృత్తి. ‘యోగశ్చిత్తవృత్తి నిరోధః’ అని పతంజలి యోగ సూత్రము. చిత్తములు చెడు విషయ నివృత్తి యోగము. అలాగే పరమేశ్వరుని యందు చిత్తాన్ని లగ్నం చేయుట, అని సూత్రార్థము. ప్రతి యుగములోను పరమాత్మ, ధర్మ సంస్థాపన కొరకు అవతరిస్తాడు.
సంవత్సరంలో రెండు ఆయనములలో, ఉత్తరాయణం మొదటిది. ఋతువులలో మొదటిది వసంతం, మాసములలో మొదటిది చైత్రమాసం, పక్షములలో మొదటిది శుక్లపక్షం, తిథులలో మొదటిది పాడ్యమి. నక్షత్రములలో మొదటిది అశ్వని, వసంత ఋతువులో చైత్రమాసంలో, శుక్లపక్ష పాడ్యమినాడు వర్షారంభంగా నిర్ణయించి, ఆ రోజు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఆరోజే నూతన సంవత్సరాది.
పేరంటానికి వెళ్లే బాలిక జడలోని మల్లెమొగ్గలు, వేపకొమ్మకు అవి చిగురాకు సజ్జనీనెకు పట్టిన పూత, కోకిల కుహూ కుహూ.. కారములు, మగ కోయిల ఆమ్రకిసలయములనన్నింటిని ముక్కుతో చిదిమి, ఆ రసాన్ని పెంటికందించే హొయలు, సెలయేళ్లలో నీళ్లు పోసుకంటున్న ఏనుగుల మధుర మనోవికారాలు, చక్రవాక పక్షుల అనురాగాల వర్ణంతోను, మహాకవి కాళిదాసు కవి సామ్రాట్ విశ్వనాథం ‘‘ఋతు సంహార’’ కావ్య రచనలతో, ఏటేటా శోభాయమానంగా వస్తుంది, వసంత ఋతువులో ఉగాది పండుగ.
ఉగాది-సప్తస్వరములు
‘ఉ’ అంటే ఉత్తమమైన, ‘గం’ అంటే జ్ఞానం. కనుక ‘ఉగం’ అంటే ఉత్తమమైన జ్ఞానం, అనగా పరమాత్మ, అనగా వేదజ్ఞానం. ‘ఓం పరమాత్మానం గామాయతీతి ఉగం’ పరమాత్మతత్త్వాన్ని తెలియచేసేది వేదము. కనుక ‘ఉగమ్’ అంటే వేదము. ఉగాది, అంటే ఉగమునకు ఆది, అనగా వేదమునకు ఆది, ఏమిటది? ఓంకారము. ఓంకార ప్రణవ నాదము ప్రాణాగ్నుల కలయికతో, నాదము ఏర్పడుతుంది. అదే దైవ వాక్కు. ‘దైవంవాజ మనయన్తదేవాః తాం విశ్వరూపాః వశవోవదన్తి’ దైవీవాక్కుగా సృజింపబడిన నాదము, విశ్వమందున్న జీవులు పలుకుతూ ఉంటారు. ఆ నాదాన్ని ఇంద్రాది దేవతలు వ్యవహార యోగ్యమగునట్లుగా, అకారాది అక్షర స్వరూపమునొందించారు. అదే ప్రణవనాదమైంది. ఈ ప్రణవనాదమే - వేదపురాణాగమశాస్త్రాదులకు ఆధారమైనది. ఇదే వేదనాదము. అవే, ‘స రి గ మ ప ద ని’ సప్తస్వరములు. కనుక ఉగాది అంటే వేదములకు ఆదియందున్న స్వరము - ఓంకార ప్రణవనాదమే.. అని అర్థం. ‘‘యో వేదా దౌస్వరః ప్రోక్తో వేదాంతేషు ప్రతిష్ఠితకి’’ అన్నది వేదము. కనుక ‘‘స్వరము’’ కూడా ఉగాదే. సప్తస్వర సుందరుల ఆరాధనా దినమే - ఉగాది. ‘‘సద్గురు త్యాగరాజస్వామి వారి జగన్మోహిణిని రాగకీర్తన, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా’’ ఉగాదికి స్ఫూర్తినిస్తుంది.
ఆథ్యాత్మిక విద్యారంభము-ఉగాది
‘‘ఉగము’’ ఆదిగా గలది - ఉగాది. ‘ఉగము’ అంటే జన్మ, ఆయుష్షు, యుగము, అనే అర్థాలున్నాయి. ఉగ్+ఆది ఉగాది. ‘‘ఉక్ ఆదౌయస్వసః ఉగాదిః’’. ‘‘ఉగ్’’ ఆదియుందుగల రోజు - ఉగాది. ‘ఉ’ అంటే శివుడు. ‘ఉ’ ఆదిగా గలది ‘ఉమ’. కనుక ఉగాది అంటే ‘ఉమ’ - ప్రకృతిసుందరి - బ్రహ్మవిద్య - కుండలినీ యోగాశక్తి, చేతనాచేతన జీవరాశికి ప్రతీక. సరైన జీవన విధానానికి ఉపకరించే అసలైన విద్యను నేర్చుకొనటానికి ప్రారంభ దినమే - ఉగాది.
జన్మాది- ఉగాది
ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభ దినమ. గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, నూతన సంవత్సరాలకి స్వాగతం పలికే రోజు. ఈ సంయోగ వియోగ పరిధి రోజు - ఉగాది. ‘గాది అనే పదం ‘‘యుగాది’’ అనే సంస్కృత పదానికి వికృతి రూపం. కనుక ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. ఉగము ఆదిగా గలది ఉగాది. ‘‘ఉగము’’ అంటే - జన్మ, ఆయుష్షు, యుగము అనే అర్థాలున్నాయి. ‘యుగము’ అంటే ‘జన్మ’ అనే అర్థముంది. కనుక, ఉగాది అంటే జన్మాది, జన్మకు ఆది - జన్మాది. ఎవరు? శ్రీ మహావిష్ణువు’’ ‘‘జననో జవ జన్మాదిః భీమో భీమ పరాక్రమః’’ అన్నది విష్ణు సహస్రనామ స్తోత్రం. కనుక ఉగాది అంటే పరమాత్మ.
విష్ణు సహస్ర నామములు
పరమాత్మ కాల స్వరూపుడిని గదా. ఒప్పుకున్నాం. యుగ సంవత్సర, ఋతు, మాస, స్వరూపుడని కూడా విష్ణు సహస్ర నామములు తెలియజేస్తున్నాయి. అహః సంవత్సరో వ్యాళః ఋతు స్సుదర్శనః కాలః, ఉగ్రః సంవత్సరో, దక్షో, వత్సరో వత్రలో వత్సి’ దీనిని బట్టి సంవత్సరాది కూడా యుగాది - ఉగాది అవుతుంది.
ఉగస్య ఆది ఉగాది
ఉగమంతా, నక్షత్ర గమనం. నక్షత్రముల నడవడిక ఆరంభమైన కాలమే అనగా సృష్టి మొదలైన కాలము యొక్క ఆది - ఉగాది. వేదములను తస్కరించిన సోమకాసురుని చెంత నుడి వేదాలను గైకొని చతుర్ముఖునికి అందజేసిన శ్రీహరి మత్స్యావతారాన్ని దాల్చిన రోజు, చైత్ర శుద్ధ పాడ్యమి, ఉగాది రోజు అని, పురాణములు పేర్కొన్నాయి.
ఉగాది నాడు పాటించే ప్రధానాంశములు
ఉగాది పండుగ నాడు ప్రధానంగా ఆచరించే విషయములు: అభ్యంగన స్నానము, ఇష్ట దేవతారాధన, సంవత్సర దేవతారాధన, భగవంతునికి నివేదించిన షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి సేవనం, పంచాంగ శ్రవణం.
ఉగాది పచ్చడి
ఇది షడ్రుచులతో కూడిన భక్షణం. వేపపువ్వు (చేదు), మామిడి పిందె (వగరు), క్రొత్త చింతపండు (పులుపు), మిరియాల పొడి (కారం) ఇప్పుడు పచ్చి మిర్చి ముక్కలు వేస్తున్నారు. కొద్దిగా సైంధవ లవణం (ఉప్పు).
మానవజీవిత వైవిధ్యం అంతా, ఉగాది పచ్చడిలో ప్రతిబింబిస్తుంది. జీవితంలో అంతా మాధుర్యము- సుఖమే ఉండదు. చేదు, పులుపు, వగరు లాంటి కష్టనష్టములతో, ఒడుదుడుకులతో కూడికొని ఉంటుంది. ఉప్పు ఉంటుంది, బెల్లము ఉంటుంది. జీవితంలోనూ సుఖదుఃఖాలుంటాయి. అన్నింటినీ సమచిత్తంతో స్వీకరించే ఆత్మస్థైర్యం ఉండాలన్నది, ఉగాది పచ్చడి మనకిచ్చే సందేశం.
ఉగాది పచ్చడి, జఠరాగ్నిని ప్రవృర్థం చేసి, శే్లష్మాన్ని హరించి, పిత్తాన్ని తగ్గించి, రక్తశుద్ధిని చేసి, ఆకలిని పెంపొందించి మనోవ్యాధుల్ని నశింపజేసి, చిత్త శాంతిని కలిగిస్తుందని, ‘‘శతాయుర్వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం’’ అనే శ్లోకాన్ని పఠిస్తూ సేవిస్తే, ఆయుర్‌వృద్ధి జరుగుతుందని, ఆయుర్వేద విజ్ఞానశాస్త్రం పేర్కొన్నది. వేపపువ్వు పచ్చడిని సేవించిన వారికి దీర్ఘాయుష్షు, దేహ ధారుఢ్యం, సర్వసంపదలు చేకూరుతాయి. అరిష్టాలు తొలగి, సుఖ సంతోషాలు లభిస్తాయి. ఉగాది పచ్చడి విశేషములు, గుణములు తెలుసుకున్న తర్వాత పండుగ నాడు చేసే పంచాంగ శ్రవణం గురించి తెలుసుకుందాం.
పంచాంగం
తిథి వార నక్షత్రయోగ కరణములతో కూడినది - పంచాంగం.
‘‘తిథేశ్చ, శ్రీయమాప్నోతి వారాదాయుష్య వర్థనమ్
నక్షత్రాత్థరతాపాపం, యోగార్రోగ నివారణమ్
కరణాత్కార్య సిద్ధిస్తు పంచాంగం ఫలముత్తమమ్
కాల విత్కర్మ కృద్దీమాన్ దేవతానుగ్రహం లభౌత్’’
పంచాంగ శ్రవణం వలన చేకూరు లాభములు
తిథి వలన సంపద, వారము వలన ఆయుష్షు, నక్షత్రము వలన పాపపరిహారం, యోగము వలన వ్యాధి నివారణం, కరణము వలన కార్యానుకూలత, పంచాంగ శ్రవణము వలన నవగ్రహముల ధ్యానము వలన కలిగే శుభ ఫలితాలు కలుగుతాయి.
ప్రతి సంవత్సరానికి, ప్రాచీన మహర్షులు పరిపాలకులను నిర్ణయించారు. ప్రభవ నుండి అక్షయ వరకు ఉండి 60 సంవత్సరాలకు, ఏయే గ్రహములకు ఏయే అధికారములు సంక్రమిస్తాయో, దాని ఆధారంగా ఆ సంవత్సరములో ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసేది - పంచాంగం. నవనాయక ఫలితములతో పాటు ఆదాయ వ్యయములు, రాశి ఫలితాలను, రాజపూజ్య అవమానములను బేరీజు వేసి తెలియజేసేది - ఉగాది పంచాంగం. 15 తిధులు, 7 వారములు, 27 నక్షత్రములు, 27 యోగములు 11 కరణములతో కూడినది ఉగాది పంచాంగం.
ప్రభవ నుంచి 34వ సంవత్సరం ‘‘శార్వరి’’ నామ సంవత్సరం.
పంచాంగ శ్రవణం వలన కలిగే శుభములు
‘‘శ్రీ కల్యాణం గుణావహం రిపుహరం, దుస్వప్న దోషాపహం, గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదమాత్తమం శుభకరం, సంతాన సంపత్వరం నానా కర్మ సముచితం, పంచాంగ మాకర్ణ్యాతామ్’’.
పంచాంగం వినటం వలన సంవత్సరమంతా శుభం కలుగుతుంది. శతృ బాధలు ఉండవు. చెడుకలల వలన కీడు తొలగుతుంది. గంగలో స్నానం చేసినంత పుణ్యం, గోదానంతో సమానమైన మేలు చేకూరుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. సంతాన సౌభాగ్యం కలుగుతుంది. అనేక కర్మలు నిర్వహించటానికి పంచాంగం సాధనమవుతుంది.
శ్రీ శార్వరి నామ సంవత్సర దేవత
శ్రీ శార్వరి నామ సంవత్సరమునకు ‘‘్భస్కర’’ దేవత, గ్రహముల సంచారం ఎలా ఉన్నా, అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా, శని దోషములున్నా, కుజ సంచార దోషములున్నా, రాహు, కేతు సంచార దోషములున్నా, భాస్కర దేవతారాధనతో అన్ని దోషములు తొలగి, శార్వరి నామ సంవత్సరమంతా శుభప్రదంగా యోగదాయకంగా ఉంటుంది.
‘‘భాస్కరం శార్వరి సంజ్ఞం భాషా పూర తదిజ్బుభిమ్
చక్రోజ్వలకరం వందే భాస్వద్రిధి సమాశ్రయం’’
‘‘ఆది దేవ నమస్త్భ్యుం, ప్రసీదమమ భాస్కర్
దివాకర నమస్త్భ్యుం, ప్రభాకర నమోస్తుతే’’
ఈ శ్లోకాన్ని ఒక్కొక్కటి రోజుకి మూడు సార్లుగానీ, సమయాన్ని బట్టి ఇంకా ఎక్కువసార్లు గానీ చదువుకుంటే, శార్వరి నామ సంవత్సరం అంతా శుభంగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయానే్న లేచి, స్నానం చేసి ఉదయించే సూర్యభగవానునికి నమస్కరిస్తూ దినారంభం చేస్తే, శార్వరి నామ సంవత్సరమంతా ఆరోగ్యాన్నిస్తాడు.
‘‘శార్వరీ వత్సరే సర్వాసస్యవృద్ధిర్భవేత్ భువి’’
శార్వరి నామ సంవత్సర మందు, భూమి యందు అన్ని సస్యములు అభివృద్ధి చెందుతాయి.
శ్రీ శార్వరి నామ సంవత్సర ఫలితాలు
ఫాల్గుణ బహుళ అమావాస్య వెళ్లి, చైత్య శుద్ధ పాడ్యమి ప్రవేశించే సమయాన్ని తీసుకొని గణనం చేయగా వచ్చేది ‘‘వర్ష లగ్నం’’. రవి, మేషరాశిలో ప్రవేశించే సమయాన్ననుసరించి, ‘జగల్లగ్నం’ గణనం చేస్తారు. ఉగాది పండుగ వచ్చిన వారాధిపతి, ఆ సంవత్సరానికి ‘‘రాజు’’గాను, రవి, మేషరాశిలో అనగా మేష సంక్రమణం చేసిన వారాధిపతి మంత్రిగాను, రవి మిగిలిన రాశులలో ప్రవేశించే వారాధిపతులు, ఆర్ర్ధా నక్షత్ర ప్రవేశ వారాధిపతి, నవనాయకులుగాను నిర్ణయిస్తారు. నవనాయకులు, ఉప నాయకుల, మితృత్వ శతృత్వములకు బట్టి సంవత్సర ఫలితాలు, వాతావరణ పరిస్థితులు, రాజ్యాంగ విశేషాలు, బేరీజు వేసి వివరించటం జరుగుతుంది. రాజు, మంత్రి, సేనాధిపతి వార్ల సంచారము మితృత్వమును బట్టి కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల సంబంధములు, పరిపాలనాఫలితాలు మున్నగునవి సిద్ధాంతీకరిస్తారు.
నవగ్రహములు రాశి సంచారమును అనుసరించి, ఆయా రాశులవారికి మాస, సంవత్సర, ఫలితాలు చెప్పటం జరుగుతుంది. గ్రహ దోషములు తొలగించుకోవటానికి, పఠించవలసిన స్తోత్రములు మున్నగునవి చెప్పటం జరుగుతుంది.
కుజ, రవి, రాహు, గ్రహ సంచార విశేషములను బట్టి, ప్రకృతివైపరీత్యములు, అంతుపట్టని రోగములు మున్నగు విషయాల్ని బేరీజు వేసి చెప్పటం జరుగుతుంది. ఆవిధంగానే కర్తరీ, మాగ్రాములు, సూర్యచంద్ర గ్రహణములు, కందాయ ఫలములు, ఆదాయ వ్యయములు, రాజపూజ్య అవమానములు మున్నగు వాటిని చెప్పటం జరుగుతుంది.
కరోనా వంటి వైరస్ వ్యాధులు, కుజగ్రహము జూన్ 28, 2020లో మీన రాశిలో ప్రవేశించినప్పుడు, అదే సమయంలో ఇంచుమించుగా జూన్ 15న, రవి మిథునరాశిలో, మిత్ర క్షేత్రంలో ప్రవేశించినపుడు, అనగా సుమారు జూలై నుండి, తగ్గుముఖం పట్టే పరిస్థితి సూచితమవుతుంది.
పంచాంగ శ్రవణ మంటే విష్వారచన. ‘‘యద్ధోవై విష్ణుః’’ అను పంచాంగ శ్రవణం వలన యజ్ఞ్ఫలం లభిస్తుంది.
ఉగాది పండుగకు దీప్తి
కాలము భగవంతుని స్వరూపం. కాల శక్తి ఈ దృశ్య ప్రపంచమును చిత్రించి, పరిణామగతిని కలిగిస్తుంది. కనుక చీమ నుండి బ్రహ్మ వరకు, చేతనాచేతన ప్రకృతి యందు ‘కాల’ ప్రభావము ఉంటుంది. కాలప్రాముఖ్యాన్ని గుర్తెరిగి, కేవలము ప్రపంచ విషయాసక్తులతో కాలాన్ని వెలిబుచ్చక, ఋజువర్తనతో, ఆదర్శ జీవితాన్ని గడిపి, గమ్యస్థానాన్ని చేరి సార్థకత చెందాలి. ఎంతకాలము ఎచ్చట ఏమి అనుభవించినా, పక్షులు తిరిగి తిరిగి తమ గూటికి చేరుకున్నట్లు, వివేకులు జన్మాద శ్రీరామ దివ్య చరములనే ఆశ్రయించి ‘‘కాల నిమిత్తమైన భయాన్ని పొందారని చెప్తూ’’ నీ పాదములను ఆశ్రయించిన నన్ను రక్షించటానికి ‘‘కాలహరణ’’ మేలరా సీతారామ’’ చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వదకురీతి, భువిని పుట్టగానే నీ పదముల బట్టుకొన్న నన్నుబ్రోవ’’ కాలహరణ మేలరా హరే సీతారామ’’ అన్న సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి, శుద్ధ సావేరి రాగ కీర్తన ఉగాది పండుగకు సంపూర్ణ దీప్తినిస్తుంది.
ఆది శంకరులిచ్చిన స్ఫూర్తి
‘‘దినయామిన్సా సాయం ప్రాతః శిశిర వసంతా పునరాయాతః కాలః క్రేజిత గచ్ఛత్వాయుః తదపి, నముంచ త్యా శావాయః’’ అన్నారు, శ్రీ శంకరభగవత్పాదులు.
రాత్రింబవళ్ళు ఉదయాస్తమానాలు, ఆకురాలే కాలమూ చిగురించే కాలాలూ మళ్లీ మళ్లీ వస్తుంటాయి. కాలం అన్నిటి కన్నా బలీయమైనది. దాని క్రీడా విలాసంలో ఆయుష్షు క్షీణిస్తూనే ఉంటుంది. తరాలు గడుస్తునే ఉంటాయి. అయినా మనిషిలో ఉండే స్వార్థం, మూర్ఖత్వం తొలగవు. ‘‘కాలః క్రీడతి’’ అన్నారు శంకరులు. మానవుని వివేకాన్ని నాశనం చేసి అతని పతనానికి మూలమైనవి ధన జన వనగర్వాల. మానవుడు వీటి ద్వారా ఎంత విర్రవీగినా ‘‘కాలం’’ ప్రతికూలమైనవి. క్షణాల మీద పేకమేడల్లా కుప్పకూలిపోతాయి. ‘‘మాయామయ పాద మభిలం హిత్వా, బ్రహ్మ పదం త్వం ప్రవిశవిదిత్వా’’ అన్నారు.’’ అన్నారు శంకర భగవత్పాదులు. మానవుడు తన పరిధిని తెలుసుకొని, వ్యక్తిగతంగా సమిష్టిగా, స్వార్థ రహిత బుద్ధితో మంచి నడతతో, ధన జన వన గర్వాది సవస్త మాలిన్యాలనూ విడిచిపెట్టి శాశ్వతానందాన్ని నాశనం లేని స్థితిని కలిగించే పరామత్మ సాన్నిధ్యాన్ని, సర్వసమ భావనతో పొందాలన్నారు. ఇదే ‘‘కాలం’’ యొక్క నిజ స్వరూపం. ఉగాది పండుగ నాడు తప్పకుండా మననం చేసుకోవలసిన విషయం, ఉగాది పండుగకు స్ఫూర్తి నిచ్చేది ఈ ఆదిశంకరుల హితబోధ.
ఉగాది సందేశం
నదిని దాటటానికి, ఇవతలి ఒడ్డున పడవను ఎక్కుతాం. నడిపేవాడు దిగమనే వరకు అవతలి ఒడ్డు వచ్చిందని తెలియదు. సుఖానుభవంతో కాల పరిమితి తెలియదు. వయసు తీరిపోతోంది. ఇది మానవజీవితానికి అవతలి ఒడ్డు. వయసుచరి, కాలము - పడవ, వయసు అనే నదిని దాటటానికి, కాలమనన పడవలో ప్రయాణం చేసేటప్పుడు, నావలోని తోటి ప్రయాణీకులను అనగా తనతో సమాజంలో సహజీవనం చేసే వారిని, ఏకాత్మతా భావంతో దర్శించి, తనలో ఉన్న చైతన్యం, ఎదుటి వారిలో ఉన్న చైతన్యం ఒకటేనన్న విజ్ఞాన వెలుగును దర్శించి, మానవసేవలో మాధవసేవను దర్శించి, సర్వమానవ సౌభ్రాతృత్వంతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించాలని సందేశమిస్తుంది శ్రీ శార్వరి నామ ఉగాది. గ్రహబలమేమి రామానుగ్రహ బలమే బలమన్నాడు. రేవగుప్తి రాగంలో సద్గురు, నాదయోగి శ్రీ త్యాగరాజస్వామి. *

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464