S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/16/2019 - 05:39

జోగిపేట, అక్టోబర్ 15: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

10/16/2019 - 05:37

దేవరకొండ, అక్టోబర్ 15: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలో ట్రాలీ ఆటో బోల్తాపడిన ప్రమాదంలో 32 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. నేరెడుగొమ్ము మండలం చిన్నమునిగల్ గ్రామ సమీపం లోని ప్రధాన రహదారిపై మంగళవారం పత్తి కూలీలతో వెళుతున్న ట్రాలీ ఆటో టైర్ పేలిపోయి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో 32 మంది గాయపడ్డారు.

10/16/2019 - 05:37

మాక్లూర్, అక్టోబర్ 15: దొంగతనానికి పాల్పడుతూ గ్రామస్థుల చేతికి చిక్కి వారు కొట్టిన దెబ్బలకు తాళలేక ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మోర గ్రామంలో జరిగింది. మాక్లూర్ ఎస్‌ఐ సాయినాథ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

10/16/2019 - 05:35

బెల్లంపల్లి, అక్టోబర్ 15: ఇద్దరు రైతుల మధ్య ఏర్పడిన పాతకక్షలు ఒక బాలుడిని బలిగొన్నాయ. తన ఎదురుగా ఉన్న పొలానికి చెందిన వ్యక్తిపై కక్ష తీర్చుకునేందుకు మరో రైతు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి పెట్టడం, అది తాగి చిన్నారి మృతి చెందడంతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లి తండాలో మంగళవారం విషాదం నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ.

10/16/2019 - 01:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో మసీదు నిర్మిస్తూ బాబర్ చక్రవర్తి పాల్పడ్డ చారిత్రక తప్పిదాలను సరిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉందని ఓ హిందూ సంస్థ మంగళవారం సుప్రీంకోర్టులో స్పష్టం చేసింది.

10/16/2019 - 01:47

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ ఉద్దేశపూర్వంగానే తనపై కేసులు బనాయించిందని, తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో అరెస్టయిన చిదంబరం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

10/16/2019 - 01:18

కొడంగల్, అక్టొబర్ 15: కులం పేరుతో దుషించి దాడి చేసిన నలుగురిపై అట్రాసిటి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పరిగి డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు.

10/16/2019 - 01:18

కొత్తూరు, అక్టోబర్ 15: గొంతు నులిమి భార్యను ఆమె భర్త హత్య చేసిన సంఘటన చింతగట్టు తండాలో చోటుచేసుకుంది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దాపూర్ అనుబంధ తండా చింతగట్టుకు చెందిన సబావత్ లక్ష్మణ్‌కు కడ్డాల్ మండలం రేక్యాతండాకు చెందిన రజిత(22)తో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వివాహమైంది. మంగళవారం రజిత గొంతును లక్ష్మణ్ నులిమి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

10/16/2019 - 01:14

మేడ్చల్, అక్టోబర్ 15: మేడ్చల్ మండలం రాజబొల్లారం తండాలోని ఓ ఇంట్లో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలిన ఘటనలో ఓ బాలికకు స్వల్ప గాయాలు కాగా తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. రాజబొల్లారం తండాలో కూరిస్వామి అక్రమంగా చిన్న సిలిండర్‌లలో గ్యాస్ రీఫిల్లింగ్ చేసి విక్రయిస్తుంటాడు.

10/16/2019 - 00:52

హైదరాబాద్, అక్టోబర్ 15: చర్చించుకోవడం ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చని, ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి చొరవ చూపాలని హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ప్రభుత్వానికి సూచించింది. 18న సానుకూల నివేదికతో రావాలని స్పష్టం చేసింది. సమ్మె సమస్యపై పలు పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు ధర్మాసనం ఇరుపక్షాల వాదనలనూ విచారించింది.

Pages