S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెన్నెల

చించుతున్న టీజర్లు ట్రైలర్లు

తినబోతూ -రుచెందుకు చూడటం అన్నది పెద్దల మాట. తినాలో వద్దో తేల్చుకోవాలంటే -టేస్ట్ చేయకుండా ఎలా? అన్నది ఈతరం ప్రశ్న. నిజమే -కలర్‌ఫుల్‌గా
కనిపించే పదార్థాలన్నీ రుచిలో గొప్పగా ఉండకపోవచ్చు. రంగురంగుల ఫాస్ట్ఫుడ్స్ అనుభవాలు ఇప్పటితరానికి ఒకింత ఎక్కువే కనుక -ఆచి తూచి నోరు తెరుస్తున్నారు.
ఫుడ్డు విషయంలోనే కాదు, స్క్రీన్ విషయంలోనూ ఈతరానిది అదే థియరీ.
విడుదలైన టీజర్నో, ట్రైలర్నో ఒకటికి వందసార్లు వాచ్‌చేశాకే -్థయేటర్‌కు వెళ్లాలా? వద్దా? అని లెక్కలేసుకుంటున్నాడు. ట్రైలరో, టీజరో కనెక్టై మిలియన్ వ్యూస్ సాధిస్తే -ఆ సినిమా ఒక మెట్టేక్కేసినట్టేనని నిర్మాత లెక్కేసుకుంటున్నాడు. ఎవరి లెక్క వాళ్లది.
**
ఒకప్పటి-
తెలుగు సినిమా పరిస్థితి వేరు. ఎన్ని ఎక్కువ పోస్టర్లు పడితే అంత పెద్ద సినిమా అన్న భావన ఉండేది. ఎన్టీవోడిదో, ఏఎన్నార్‌దో సినిమా విడుదలవుతుందంటే ఊరు ఊరంతా పోస్టర్లుపడేవి. జడ్కా బండికో, సైకిల్ రిక్షాకో తడిక గూడు కట్టించి, దాన్నిండా పోస్టర్లు అంటించి -ఊరంతా తిప్పే సంస్కృతి ఉండేది. కథను ప్రతిబింబించేలాగో, కీలకాంశాన్ని నాలుగైదు లైన్లలో చెప్పినట్టో పోస్టర్లను ముద్రించేవారు. తరువాతి తరంలో -స్టార్ ఫ్రేమ్‌లోకి చిరంజీవి వచ్చిన తరువాత పోస్టర్లతోపాటు, థియేటర్ల వద్ద కటౌట్ల హంగామా బాగా పెరిగింది. ఈ కసరత్తులన్నీ -సినిమా విడుదలకు ముందు ప్రచారం బాపతే. ఇప్పుడు నడిచేది డిజిటల్ యుగం కనుక -అందుకు అనుగుణంగా ఫస్ట్‌లుక్కులు, టీజర్లు, ట్రైలర్లు అంతర్జాలాన్ని దునే్నస్తున్నాయి.
‘ఇదీ మేం తీసిన సినిమా. ఓ లుక్కేయండి’ అంటూ టీజర్‌నో, ట్రైలర్‌నో విడుదల చేయడం పాపం.. గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. పెద్ద దర్శకులు, స్టార్ హీరోలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు, బయోగ్రాఫిక్ చిత్రాలు.. ఇలాంటివాటి పట్ల ఆడియన్స్ ఆసక్తితో ఉండటం సహజం. అలాంటి సినిమాల ట్రైలర్ విడుదలైతే -గంటల్లోనే మిలియన్ వ్యూస్ రావడం కూడా అంతే సహజం. కానీ, ఇటీవలి కాలంలో ‘వ్యూస్’ రేటింగ్‌లో అలాంటి భేదాలేమీ కనిపించటం లేదు. సినిమా చిన్నదా పెద్దదా? స్టార్‌దా కాదా? లాంటి మ్యాథమెటికల్ ఈక్వెషన్స్‌కు దూరంగా -వ్యూస్ వచ్చిపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సోషల్ మీడియాలో కావొచ్చు, వెబ్ చానెల్స్‌లో కావొచ్చు, యూట్యూబ్‌లాంటి ప్రముఖ చానెల్స్‌లో కావొచ్చు. వ్యూస్ రేటింగ్ మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ‘చెలియా’ను తీసుకుందాం. తన మార్క్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడానికి మణి ‘సిగ్నేచర్’ బయటకు వదిలాడు. మిలియన్ వ్యూస్ వచ్చిపడ్డాయి. పెద్దగా పరిచయం లేని దర్శకుడు శ్రీముని ‘లంక’ సినిమా తీస్తూ ట్రైలర్ కట్ చేశాడు. లక్షల్లో వ్యూస్ వచ్చిపడ్డాయి. ‘వ్యూస్’ విషయంలో రెండూ ఒకటేనన్నట్టే ఆడియన్స్ రిజల్స్ ఇచ్చారు. విడుదలకు సిద్ధమవుతున్న మీడియం రేంజ్ సినిమాలు రెండు తీసుకుందాం. రెండు చిత్రాల టీజర్లు, ట్రైలర్లు కూడా షాక్‌నిచ్చే రిజల్టే ఇచ్చాయి. అందులో ఒకటి -నిఖిల్ హీరోగా వస్తున్న ‘కేశవ’. రెండోది వరుణ్‌తేజ్ హీరోగా చేస్తున్న ‘మిస్టర్’. నిజానికి వరుస ప్రయోగాత్మక చిత్రాలతో హీరోగా నిఖిల్ మంచి ట్రెండ్‌నే కొనసాగిస్తున్నాడు. హీరోగా తనకు సరైన బ్రేక్‌నిచ్చిన సుధీర్ వర్మతో తాజా సినిమా చేస్తున్నాడు. వైవిధ్యమైన కథగా ఇండస్ట్రీలో టాక్ తెచ్చుకున్న ఆ సినిమాయే ‘కేశవ’. ఆ వైవిధ్యం ఎలా ఉండబోతుందో రూచి చూపిస్తూ ఇటీవల -టీజర్‌ను యూట్యూబ్‌కు రిలీజ్ చేశారు. గంటల్లోనే సెనే్సషన్ క్రియేట్ చేసింది.
ఆగడు, బ్రూస్‌లీలాంటి రొటీన్ ఫార్ములా ప్రయోగాలు కొట్టిన దెబ్బతో స్టార్ డైరెక్టర్ హోదానుంచి పూర్తిగా చతికిలపడిన శీను వైట్ల డిజైన్ చేస్తున్న సినిమా ‘మిస్టర్’. వరుణ్ తేజ్, లావణ్యత్రిపాఠి, హెబ్బాపటేల్‌తో రూపొందుతున్న మిస్టర్‌ను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నారు. పాత కథే అయినా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా డిజైన్ చేశారన్నది ఇండస్ట్రీ టాక్. ‘్ఫల్ గుడ్’ టేస్ట్ చూపిస్తూ ఇటీవలే -్థయేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మొదటిరోజే మిలియన్ వ్యూస్ దక్కాయి. అటు నిఖిల్, ఇటు వరుణ్‌తేజ్ రేంజ్‌కి ‘వ్యూస్’ రిజల్ట్ ఊహించనిదే. టీజర్, ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్‌బట్టి ఆడియన్స్‌లో రెండు సినిమాకు ఆసక్తి ఉందన్న విషయం అర్థమవుతుంది. ఇక హారర్ థ్రిల్లర్‌గా రాబోతున్న ‘లంక’కూ అదే రేంజ్‌లో వ్యూస్ దక్కాయి. సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రాశిని ప్రధాన పాత్రగా పెట్టి శ్రీముని డిజైన్ చేసిన హారర్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఓ కుర్ర బృందం షూటింగ్ కోసం అడవిలాంటి ప్రాంతంలో సంచరిస్తుంటే, అక్కడ ఎదురయ్యే భయానక సంఘటనల నేపథ్యంగా ట్రైలర్ కట్ చేశారు. టెలీపతి చుట్టూ కథల్లుకున్నట్టు అర్థమవుతుంది. రాశి లుక్, ట్రైలర్ షాట్స్ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. మొన్నటికి మొన్న పూరీ విడుదల చేసిన ‘రోగ్’ టీజర్‌కు భారీగా వ్యూస్ దక్కాయంటే ఒకే. వరుస ఫెయిల్యూర్స్‌తో కసిమీదున్న పూరీ తీస్తున్న సినిమాగా కొద్దిరోజులుగా ఎక్కడలేని ప్రచారం సాగింది కనుక, టీజర్‌పట్ల ఆడియన్స్ ఆసక్తి చూపించారని అనుకోవచ్చు. ‘బాహుబలి-2’కి కోట్లలో వ్యూస్ వచ్చి పడ్డాయంటే అప్పుడూ ఆశ్చర్యపోనక్కర్లేదు. నాలుగేళ్లుగా రాజవౌళి -తెలుగు ఆడియన్స్‌కి ‘బాహుబలి’ని బ్రాండ్ అంబాసిడర్ చేసేశాడు కనుక అన్ని వ్యూస్ దక్కాయని సరిపెట్టుకోవచ్చు. అసలు ఏమాత్రం అంచనాలు లేని సినిమాలకు, మీడియం రేంజ్ చిత్రాలకు సైతం లక్షల్లోను, కోట్లలోను ‘వ్యూస్’ దక్కుతున్నాయంటే -గొప్ప విషయమే అంటున్నారు పరిశ్రమ నిపుణులు. ఒకటి -టీజర్‌ను కట్ చేయడంలో మన తెలుగోళ్లు ఆరితేరిపోయయినా ఉండాలి. లేదూ.. సినిమాకు వెళ్తామో లేదో తెలీదు కనుక ఫ్రీగా వస్తున్న టీజర్‌ను, ట్రైలర్‌ను చూసిపారేద్దామన్న ఆలోచన ఆడియన్స్‌కైనా వచ్చుండాలి. ప్రతి సినిమాకు మిలియన్స్ వ్యూస్ దక్కుతుండటంపట్ల పాతకాలపు సినిమా పెద్దాయన ఒకరు తన అనుభవాన్ని రంగరించి అద్భుతమైన విషయమొకటి చెప్పాడు.
‘జియో 4జి సిమ్ ఫ్రీగా దొరికిన తరువాత చాలామంది చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి. అంతర్జాలాన్ని వినియోగించేవాళ్ల సంఖ్య లక్షల నుంచి కోట్లకు వచ్చేసింది కనుక -మిలియన్స్‌లో వ్యూస్ దక్కడం పెద్ద విచిత్రం ఏంకాదు’ అన్నది ఆయన మాట.
ముక్తాయింపు
వ్యూసే బలుపనుకున్న చాలా సినిమాలు -విడుదల తరువాత వాపుగా మిగిలిపోయాయి. నెట్‌లో ఫ్రీగా కనిపించే టీజర్నో, ట్రైలర్నో చూసిన వాళ్లంతా థియేటర్‌కు వస్తారనుకోవడం భ్రమే.