S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/18/2018 - 07:06

విజయవాడ, అక్టోబర్ 17: చెడుపై మంచి గెలుపునకు సంకేతమే విజయదశమి అని, మంచి సంకల్పాలకు దేవతల ఆశీర్వచనాలు లభించే శుభ సమయం ఇదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుందని, గెలవాలన్నదే తమ అభిమతమని ముఖ్యమంత్రి వివరించారు. తెలుగు లోగిళ్లలో ఆనందం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

10/18/2018 - 07:06

శ్రీశైలం, అక్టోబర్ 17: శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన కంకర రవీంద్రారెడ్డి దంపతులు వజ్రాలు అమర్చిన బంగారు ఖడ్గాన్ని బుధవారం బహూకరించారు. 400 గ్రాముల వజ్రాలు అమర్చిన బంగారు ఖడ్గం విలువ సుమారు రూ. 15 లక్షలు వరకు ఉంటుందని దాతలు తెలిపారు. ఈ ఖడ్గాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో కార్యనిర్వహణాధికారికి దాతలు ఈ ఖడ్గాన్ని అంచజేశారు.

10/18/2018 - 07:04

గుంటూరు, అక్టోబర్ 17: బాధ్యత గల పదవుల్లో ఉండి సంస్కారవంతంగా మెలగాల్సిన తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు వాడుతున్న భాష సంస్కార హీనమని, అభ్యంతకరమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

10/18/2018 - 07:03

కాకినాడ, అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన వారి గొంతు నొక్కడానికి కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తోందని లోక్‌సభలో టీడీపీ పక్ష నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం అన్నారు. తెలుగుదేశం నేతలు, ప్రజాప్రతినిధులపై ఉద్దేశ్యపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తోందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

10/18/2018 - 07:03

శ్రీకాకుళం, అక్టోబర్ 17: తిత్లీ బాధిత కుటుంబాలను మాటల్లో కాకుండా చేతల్లో ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జిల్లాలోని టెక్కలి నియోజక వర్గ పరిధిలో తుఫాన్ ప్రభావిత మత్స్యకార గ్రామాల్లో బుధవారం పవన్ కల్యాణ్ పర్యటించారు. బాధితుల సమస్యలను వింటూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భావనపాడులో పర్యటించి ప్రభుత్వం నుంచి బాధితులకందుతున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు.

10/17/2018 - 16:56

విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా దంపతులపై చర్య తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్ల తయారీ, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు రామిరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఉమా దంపతులతో పాటు తొమ్మిది మందిపై చర్య తీసుకోవాలని ఆదేశించింది.

10/17/2018 - 16:55

గుంటూరు: పోలీసు అమర వీరుల కుటుంబాలను ఏపీ డీఐజీ ఆర్పీ ఠాకూర్ పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో కొత్తగా ఏర్పాటుచేసిన జిమ్‌ను ప్రారంభించారు.

10/17/2018 - 13:46

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో అష్టమి రోజుని దుర్గాష్టమిగా వ్యవహరిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రిపై రద్దీ పెరిగింది. అదే సమయంలో దీక్ష విరమణ కోసం భవానీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున 3గంటల నుంచి భక్తులను దుర్గమ్మ దర్శనానికి అనుమతించారు.

10/17/2018 - 12:25

తిరుమల: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు స్వామి స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామి వారిని దర్శించుకుని భక్తులు పులకించిపోతున్నారు. రాత్రికి అశ్వవాహనంపై శ్రీనివాసుడు దర్శనమివ్వనున్నారు.

10/17/2018 - 06:30

విజయనగరం, అక్టోబర్ 16: జిల్లాను నిన్న మొన్నటి వరకు డెంగ్యూ పట్టిపీడించగా, తాజాగా స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పటికే స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడి ఇద్దరు మృతి చెందడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని సాలూరు పట్టణానికి చెందిన బోనుమంతి వౌనిక (24) అలియాస్ సంతోషి స్వైన్‌ఫ్లూ వ్యాధితో విశాఖలోని చెస్ట్ ఆసుపత్రిలో మృతి చెందింది.

Pages