S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/20/2018 - 06:05

హైదరాబాద్, జూన్ 19: రాష్ట్ర పండుగగా బోనాల జాతరను ప్రకటించడంతో జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు రాష్టవ్య్రాప్తంగా అంగరంగ వైభవంగా బోనాలను నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఏర్పాట్లపై మంగళవారం తలసాని అధికారులుతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం బోనాల పండుగను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

06/20/2018 - 06:05

హైదరాబాద్, జూన్ 19: పట్టణ ప్రాంతాలలో మిషన్ భగీరథ పనులు వచ్చే ఆగస్టు వరకు పూర్తి చేయాలని వర్కింగ్ ఏజన్సీలను మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. పట్టణ ప్రాంతాలలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై మంగళవారం బేగంపేట మెట్రోరైలు భవన్‌లో సంబంధిత అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. చాలా పట్టణాలలో ఇప్పటికే మిషన్ భగీరథ పనులు వేగంగా నడుస్తున్నాయన్నారు.

06/20/2018 - 06:04

* జూలై 6 నుండి రెండో విడత ఇంజనీరింగ్ కౌనె్సలింగ్

06/20/2018 - 06:03

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ రాష్ట్రంలోని అడువులను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుటుంది. అటవీ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు వస్తున్న పర్యాటకులతో అడవుల్లో, అర్బన్ ఫారెస్టు పార్కుల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు పెరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో అటవులను ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా తీర్చిదిద్దిలని అటవీ శాఖ నిర్ణయించింది.

06/20/2018 - 06:02

హైదరాబాద్, జూన్ 19: రోజురోజుకూ తెలంగాణలో తెలుగుమాద్యమం మసకబారుతోంది. ప్రాధమిక పాఠశాలలు మొదలు , జూనియర్ కాలేజీల్లో తెలుగు మాద్యమం పాఠశాలలకు ప్రాధాన్యత తగ్గి ఆంగ్ల మాద్యమంవైపు విద్యార్థులు తరలివెళ్తున్నారు. మోడల్ స్కూళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలకు ఉన్న గిరాకీ తెలుగుమాద్యమంలోని స్కూళ్లకు ఉండటం లేదు. అదేపరిస్థితి జూనియర్ కాలేజీల్లోనూ ఏర్పడింది.

06/20/2018 - 06:01

హైదరాబాద్, జూన్ 19: రాష్ట్రంలో జాతీయ రహదారుల భూ సేకరణను ఈనెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. సచివాలయం నుంచి మంగళవారం కలక్టర్లతో జోషి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ రహదారులు సకాలంలో పూర్తి చేయడానికి భూ సేకరణనే కీలకమైన అంశమన్నారు. సకాలంలో భూ సేకరణ జరుగలేదని సిఎస్ జోషి అసంతృప్తి వ్యక్తం చేసారు.

06/20/2018 - 06:01

హైదరాబాద్, జూన్ 19: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో విద్యుత్ చౌర్యం 43 శాతం జరుగుతోందని సాక్షాత్ సంబంధిత శాఖ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పకతప్పదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారుల్లో రోజూ 2,3 గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అక్రమార్కుల చేష్టలతో నేరం వారిది ఇబ్బందులు మాకా అంటూ వినియోగదారులు ఆహ్రం వ్యక్తం చేస్తున్నారు.

06/20/2018 - 06:00

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జన చైతన్య యాత్ర మార్గం ఖరారైంది. ఈ యాత్ర 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరిలో మొదలవుతుంది. భువనగిరి సభ అనంతరం నాయకులు అక్కడే బస చేస్తారు. 24వ తేదీ ఉదయం 11 గంటలకు నల్లగొండ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు మనుగోడులో సభలు జరుగుతాయి. రాత్రికి మనుగోడులో బస చేస్తారు.

06/20/2018 - 05:44

* ఈ నిజామాబాద్ వాసులు ఇక భారతీయులే

06/20/2018 - 01:40

ఖమ్మం, జూన్ 19: తెలంగాణ రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఆగస్టు 15 వతేదీ నుండి ఇది అమలులోకి వస్తుందని రాష్టవ్య్రవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు వెల్లడించారు.

Pages