S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/19/2019 - 17:39

న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ఏయిర్ ఇండియాకు నష్టం కలిగిస్తూ జరిగిన భారీ కుంభకోణం, అక్రమ నగదు చెలామణి కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం ఈనెల 22న అధికారుల ఎదుట హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. 2008-09 మధ్య కాలంలో విదేశీ ప్రయివేటు విమాన సంస్థలకు ఎయిర్‌ స్లాట్స్‌ కేటాయించడంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి.

08/19/2019 - 17:38

న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై ప్రస్తుతం ఎలాంటి చర్చ అవసరం లేదని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవతే చేసిన సూచనను ఆయన తోసిపుచ్చారు. ఏ వర్గాలు రిజర్వేషన్లు పొందుతున్నాయో ఆ రిజర్వేషన్ల జోలికి పోరాదని ఆయన అన్నారు. రిజర్వేషన్లు ఉండాలా?వద్దా? అనే అంశంపై చర్చ అవసరం లేదని అన్నారు.

08/19/2019 - 17:38

న్యూఢిల్లీ: రాజ్యసభకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన రాజస్థాన్ నుంచి నామినేషన్ వేశారు. ఎవ్వరూ నామినేషన్ దాఖలు చేయకపోవటంతో సోమవారంనాడు మన్మోహన్ సింగ్ ఎన్నికైనట్లు ప్రకటించారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వటం పట్ల ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ అభినందిస్తూ ట్వీట్ చేశారు.

08/19/2019 - 17:37

జమ్మూకశ్మీర్: ఆర్టికల్ 370 రద్దు తరువాత అక్కడ నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అత్యున్నత సమావేశం నిర్వహించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత దాదాపు రాష్ట్రంలో 11 రోజులు పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులపై జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ నివేదిక సమర్పించారు. అలాగే అక్కడ విద్యాసంస్థలు, పలు కార్యాలయాలు తెరుచుకున్న తరువాత నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో చర్చించారు.

08/19/2019 - 13:32

న్యూఢిల్లీ: మహారాష్టల్రో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 15మంది చనిపోయారు. నీమ్గల్ గ్రామ సమీంపలో షాహాడ - దొండైచ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

08/19/2019 - 13:31

న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లో గల్లంతయిన ఓ విమాన శకలాలను గుర్తించారు. స్పితి జిల్లాలో గల ఢాకా గ్లేషియర్‌లో ఏఎన్‌-12 బీఎల్‌-534 విమాన శకలాలను అధికారులు గుర్తించారు. 1968 ఫిబ్రవరి 7న 98 మంది రక్షణశాఖ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ విమానం రోహ్తంగ్‌ పాస్‌ మీదుగా వెళ్తుండగా కంట్రోల్‌ రూంతో సంబంధాలు తెగిపోయి
గల్లంతయింది.

08/19/2019 - 13:29

జమ్మూకశ్మీర్: 370 ఆర్టికల్ రద్దు తరువాత రాష్ట్రం పారామిలటరీ దళాల చేతిలో చిక్కుకుందని జవహార్‌లాల్ యూనివర్శిటీ విద్యార్థి నేత షీలా రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందిస్తూ.. రాష్ట్రంలో నెలకొన్న పది అంశాలను పేర్కొన్నారు. స్థానిక పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని అన్నారు. మిలటరీ బలగాలు ఇళ్లలోకి జొరబడి యువకులను నిర్భందిస్తున్నారని ఆరోపించారు.

08/19/2019 - 13:28

బెంగళూరు: రేపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కర్ణాటక సీఎం యడియూరప్ప వెల్లడించారు. రేపు ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప కేబినెట్‌ విస్తరణకు మూడు వారాలు ఆగాల్సి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేందుకు సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా అవకాశం దక్కని వారే... కారణం.

08/19/2019 - 13:27

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ ఘటనపై దర్యాప్తు గడువును మరో రెండు వారాలకు పొడిగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున సీబీఐ మరో నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరింది. బాధితురాలి వాంగ్మూలాన్ని ఇంకా నమోదు చేయలేదని అందువల్ల విచారణకు మరో నాలుగు వారాల సమయం కావాలని అలాగే న్యాయవాది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సీబీఐ కోర్టుకు వివరించింది.

08/19/2019 - 13:27

న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా కన్నుమూశారు. ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారంనాడు ఢిల్లీలో కన్నుమూశారు. దాదాపు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ రాకతో రాజకీయాల్లో ఆయన ప్రభావం తగ్గిపోయింది. కాగా దాణా కేసులో ఈయన సైతం నిందితుడిగా ఉన్నారు. గతేడాది మిశ్రా ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డారు.

Pages