S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర

06/23/2017 - 21:06

తన 150వ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నాడు చిరంజీవి. ఈ చిత్రం 100 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరింది. తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇస్తూ తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఆయన 151వ చిత్రానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ పూర్తికావచ్చింది.

06/23/2017 - 21:05

సైడర్‌మాన్ సినిమా అటు పిల్లలతోపాటు ఇటు పెద్దలకూ ఆసక్తే. చిన్నపిల్లల్లో సూపర్‌హీరోగా మారిన స్పైడర్‌మాన్ సినిమాలు వస్తూనే వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్‌ని ఏర్పర్చుకున్న స్పైడర్‌మాన్ సినిమాకు ఇప్పుడు మరో సిరీస్ రానుంది. స్పైడర్‌మాన్ హోమ్ కమింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

06/23/2017 - 21:04

గోపీచంద్, హన్సిక, కేథరిన్ హీరో హీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.పుల్లారావు, జె.్భగవాన్ నిర్మిస్తున్న చిత్రం ‘గౌతమ్‌నంద’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇంతకముందు కేథరిన్ పాత్రను పరిచయం చేశారు.

06/23/2017 - 21:02

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలవకుశ’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బిజినెస్ వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తోంది.

06/23/2017 - 21:01

మొదటి సినిమాతో అచ్చతెలుగు అమ్మాయిగా ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామకు వరుసగా అలాంటి పాత్రలే రావడంతో బోర్ కొట్టింది.. నేను గ్లామర్ షో చేస్తాను బాబోయ్ అన్నా కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోవడంలేదు. అప్పుడప్పుడు సినిమాల్లో గ్లామర్ పెంచినా కూడా లాభం లేకపోయింది. అన్నీ అలాంటి పాత్రలే! దాంతో ఇక లాభం లేదనుకుందో ఏమో.. బయట ఈవెంట్స్‌కు కూడా గ్లామర్ డ్రెస్‌లో వచ్చి షాక్ ఇస్తోంది.

06/23/2017 - 20:58

దువ్వాడ జగన్నాథమ్ తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న ‘నా పేరు సూర్య’ చిత్రం షూటింగ్ మొదలైంది. ప్రముఖ రచయిత వక్కంతం వంశి దర్శకుడిగా మారుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బన్నీ పాత్ర కొత్తగా వుంటుందని తెలిసింది. ఇందులో హీరోయిన్‌గా అను ఇమాన్యుయెల్ నటిస్తుందని సమాచారం.

06/23/2017 - 20:56

ప్రేమకథల స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కరుణాకరన్. ఈమధ్య వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయనకు చేతిలో సినిమాలు లేవు. దాంతో కాస్త బ్రేక్ తీసుకున్న కరుణాకరన్, తాజాగా మరో ప్రెష్ లవ్‌స్టోరీతో రీఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈసారి ఆయన మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడట. ఇప్పటికే సాయిధరమ్‌తో కథా చర్చలు కూడా జరిగినట్టు తెలిసింది.

06/23/2017 - 20:54

సందీప్ కిషన్ హీరోగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేం వంశీకృష్ణ దర్శకత్వంలో ఆర్.జె.డి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ డి.గోహిల్ నిర్మిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

06/23/2017 - 20:53

2016 చివరలో విడుదలై సినీ ప్రేక్షకుల్ని, విమర్శకులని సైతం మనసుతో కంట తడి పెట్టించిన వినూత్న కథా చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. ఈ చిత్రంలో నారా రోహిత్, శ్రీవిష్ణు కలయిక మర్చిపోలేని విధంగా నిలిచిపోయింది. ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలతో ఎప్పుడూ ప్రేక్షకుల్ని ఆలరించే దిశగా తమ సినీ ప్రయాణం సాగిస్తున్న వీరిద్దరి కాంబినేషన్‌లో నటిస్తున్న చిత్రం ‘వీర భోగ వసంతరాయలు’.

06/23/2017 - 20:51

అలనాటి మేటి నటీమణి సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వప్న సినిమా పతాకంపై స్వప్నాదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుపుకుంటోంది.

Pages