S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఐడియా
అజీర్తి, అసిడిటీ, కడుపునొప్పితో బాధపడేవారు చాలామంది ఉంటారు. అసిడిటీ కారణంగా గుండెలో మంట కూడా వస్తుంది. ఆహారం జీర్ణం కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. అవి మనం తీసుకునే ఆహారం, సమయంపై ఆధారపడి ఉంటాయి. వేళ తప్పించి భోజనం చేయడం, మద్యపానం, ధూమపానం, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తదితర కారణాల వల్ల కూడా కొందరిలో అజీర్ణ సమస్య వస్తుంటుంది. మనం జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
పెరుగు చక్కని రుచిని, అంతే చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది. అలాగే పెరుగు అద్భుత సౌందర్యాన్ని కూడా ఇస్తుంది. పెరుగుతో కొన్ని వంటింటి వస్తువులను జత చేస్తే శరీరం మెరుపులీనడం ఖాయం మరి..
* అరకప్పు పెరుగులో చెంచా వేప పొడి, అరచెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే వెంట్రుకలు పట్టుకుచ్చులా తయారవుతాయి. అంతేకాదు చుండ్రు సమస్య కూడా అదుపులో ఉంటుంది.
స్టౌపై ఏమైనా పెట్టి కొద్దిగా ఏమరుపాటుగా ఉన్నామంటే చాలు అవి పొంగిపోయి మొండి మరకలు పడుతుంటాయి. తరువాత వాటిని శుభ్రం చేయడానికి ఎన్నో తంటాలు పడాల్సి వస్తుంది. కానీ కొన్ని చిన్న చిట్కాలను పాటించడం ద్వారా స్టవ్‌పై ఉన్న మరకలన్నీ సులభంగా పోగొట్టవచ్చు.
అందమైన జుట్టు ఉండాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. కానీ ప్రస్తుత కాలంలో జుట్టు రాలుతున్న సమస్యతో చాలామంది అమ్మాయిలు బాధపడుతున్నారు. జుట్టు రాలకుండా ఉండేందుకు కాస్మొటిక్ ఉత్పత్తుల కన్నా, సహజ సిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించడం మేలు.. ఆ చిట్కాలేంటో చూద్దాం..
* నిత్యం పాదాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి సమస్యలు దరిచేరవు. స్నానం చేసేటపుడు, బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నపుడు పాదాలను పరిశుభ్రమైన నీటితో కడగాలి. స్నానం చేసేముందు వారానికోసారైనా నాణ్యమైన క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీని పాదాలకు పట్టించాలి.
* పాదాలు పగిలిపోయి నొప్పి అనిపించినపుడు వైద్యుల సలహా మేరకు ఆయింట్‌మెంట్లు, లోషన్లు వాడడం మంచిది.
ముఖానికి నవ్వు ఎంత అందాన్నిస్తుందో పెదవుల నాజూకుదనం ఆ నవ్వుకు మరింత అందాన్నిస్తుంది. కొందరి ముఖం చక్కని ఛాయతో ఉన్నా పెదవులు మాత్రం నల్లగా ఉంటాయి. కొందరికి వాతావరణాన్ని బట్టి నల్లబడి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే సరి..
* ఒవెన్ శుభ్రం చేయాలంటే ముందు ఒవెన్‌ను ఆన్‌చేసి 65 డిగ్రీల వేడి వచ్చిన తరువాత ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక కప్పులో సగం వరకు అమ్మోనియా పోసి ఒవెన్‌లో ఉంచాలి. తరువాత ఒక పెద్ద గినె్నలో వేడినీళ్లను కూడా పెట్టి ఒవెన్‌ను మూసేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయానే్న అమ్మోనియా కప్పు, వేడినీటి గినె్నలను కూడా బయటకు తీసి కొద్దిసేపు ఒవెన్‌ను ఓపెన్ చేసి ఉంచాలి.
ఆహారం జీర్ణం కాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. నేటి వాతావరణ పరిస్థితుల్లో ఇందుకు జీవనశైలి ప్రధాన కారణంగా ఉంది. కారణం ఏదైనా గానీ, అల్లం జీర్ణ సమస్యకు సరైన మందు.
* గ్లాసు నీటిలో తురిమిన అల్లం ముక్కలు వేసి వేడిచేయాలి. దీన్ని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి.
* అల్లం ముక్కలను దంచి, రసం తీసి కొంచెం నీళ్లు కలుపుకుని తాగినా అజీర్తి తగ్గుతుంది.
ఉదయం అల్పాహారంగా చాలామంది బ్రెడ్ స్లైసులను తినడం చాలామందికి అలవాటు. ఇది మంచిది కాదంటున్నారు పరిశోధకులు. ఆధునిక ఆహారశైలి కారణంగా ఉదర సంబంధ సమస్యలతో పాటు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్రెడ్, పాస్తాలాంటివి ఎక్కువగా తీసుకునేవారిలో మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు వారు. దీనికి కారణం బ్రెడ్‌లో గ్లుటేన్ ఎక్కువ అని వారు స్పష్టం చేస్తున్నారు.
అన్ని పండ్లూ ప్రతి కాలంలోనూ దొరకవు. ఒక్కో కాలానికి ఒక్కో పండు ప్రత్యేకం. అలా కమలాపండ్లు చలికాలంలోనే దొరుకుతాయి. వైద్య నిపుణుల ప్రకారం.. ప్రతి ఒక్కరూ సీజనల్ పండ్లను తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలుంటాయి. చలికాలంలో విరివిగా కమలాపండ్లు లభిస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఎన్నో లాభాలున్నాయి. చలికాలంలో విరివిగా కమలాపండ్లు లభిస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఎన్నో లాభాలున్నాయి.