క్రైమ్/లీగల్

675 అక్రమ మద్యం కేసుల నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలోని వైన్‌షాప్‌ల ద్వారా మద్యం తరలించి ఎక్కువ ధరలకు అమ్మడం వంటి అంశాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటి వరకు అక్రమంగా మద్యం అమ్మిన వారిపై 675 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అదేశాలు జారీ చేశారు. సోమవారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఉన్నాతాధికారులతో వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పద్యం దుకాణాల ద్వారా మద్యం తరలించి ఎక్కువ ధరలకు అమ్మిన వారిపై, అందుకు కారకులైన షాపు లైసెన్స్‌లను రద్దు చేయాలని, భారీ జరిమానాలను విధించాలని మంత్రి అధికారులకు సూచించారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి అసత్య వార్తలను ఎప్పటికపుడు మానిటర్ చేసి, పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. అలాగే ఆదివారం ట్విట్టర్లో కూలీలకు మద్యం పంచుతూ హైదరాబాద్‌లోని చంపాపేట నుండి వచ్చిన వీడియో ఆధారిత ఫిర్యాదును అబ్కారి శాఖ అధికారులు నాలుగు, ఐదు గంటల్లోనే సంజు కుమార్‌ను గుర్తించి అరెస్టు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. మద్యం అమ్మకాలు, అక్రమ మద్యం సరఫరా జరిగినట్లయితే సంబంధిత స్థానిక ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ సమీక్షలో ఎక్సైజ్, ప్రొహిబిషన్‌కు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు.