తెలంగాణ

సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో 142 కరోనా ఐసోలేషన్ పడకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13:కరోనా వ్యాధి బాధితుల కోసం సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో 142 ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేశారు. కరోనా వ్యాధి సోకిన వ్యక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించడానికి రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపధికన ఐసోలేషన్ పడకలను సిద్ధం చేశారు. కరోనా వ్యాధి సోకిన వ్యక్తులకు అందించే వైద్య సదుపాయ ఏర్పాట్లను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ ఆసుపత్రిని పరిశీలించారు. సికింద్రాబాద్‌తో పాటు విజయవాడలో 100 ఐసోలేషన్ పడకలు, గుంతకల్‌లో 42 ఐసోలేషన్ పడకలను సిద్ధం చేశారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అందుబాటులో మాస్కులు, వెంటిలేటర్లు, ప్రైవేట్ పర్సనల్ ఎక్విప్‌మెంట్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాత్కాలికంగా వైద్య సిబ్బందిని భర్తీ చేయడానికి ఆదేశాలు జారీ చేశారని రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేష్ తెలిపారు.
నిత్యావసర సరకుల రవాణాకు
89 ప్రత్యేక పార్శిల్ రైళ్లు

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలుగు రాష్ట్రాల్లో కరోనా లాక్‌డౌన్ అమలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర సరుకులను చేరవేయడానికి 89 ప్రత్యేక పార్శిల్ రైళ్లను నడుపుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు పార్శిల్ రైళ్ల ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారు. కాకినాడ నుంచి సికింద్రాబాద్, రేణిగుంట నుంచి గుంతకల్ వరకూ ఈ పార్శిల్ రైళ్లు నడుస్తాయి. పార్శిల్ రైళ్లు నడిచే మార్గంలో ఉన్న ముఖ్యమైన స్టేషన్లలో సరుకును అన్‌లోడ్ చేస్తారు.