కృష్ణ

7వ వేతన సిఫార్సుల్లో అధికారులకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కార్మికులకు మిగిలింది శ్రమదోపిడీ
* కార్మికుల గోడు వినేదెవరు?
విజయవాడ, నవంబర్ 20: రైలు పట్టాలపై సురక్షితంగా నడవాలంటే అందుకు ఆయా విభాగాలకు చెందిన కార్మికుల పాత్ర ఎంతో ప్రధానమైనది. అటువంటి కార్మికుల పట్ల ఏడవ వేతన సంఘం చూపిన విధానం చాలా ఘోరమైన విధానమని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డివిజనల్ సెక్రటరి బండ్రెడ్డి వెంకట చలపతిరావు తనను కలిసిన విలేఖర్లతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడవ వేతన సంఘం సిఫార్సులో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను, ప్రజలను విస్మరించిన ప్రభుత్వాలు కుప్పకూలిన సంగతులు ఈ ఎన్‌డిఎ ప్రభుత్వానికి తెలియదాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో 2006 వరకు ప్రకటించిన ఆరు పే కమిషన్‌లు ప్రకటించని విధంగా ఈ సంఘం ప్రకటించడం కార్మికులను విస్మరించి, పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో కార్మిక సంఘాలన్నీ ఏకమై జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో త్వరలో తమ జెఎసి జాతీయ నేత, ఎన్‌ఎఫ్‌ఐర్ న్యూఢిల్లీ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య నేతృత్వంలో తీసుకునే నిర్ణయానుసారం సమ్మె బ్యాలెట్‌ను విడుదల చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. రైలు ప్రయాణాలకు అనుగుణంగా భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న కార్మికులను విస్మరించి అధికారులకు పెద్ద పీట వేయడంలో అసలు ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం కరువుభత్యం 119 శాతం ఉండగా దానిని మూలవేతనంలో కలపకుండా ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా పే కమిషన్ ఇచ్చారని అన్నారు. కార్మికుడికి ఇచ్చే ఇంటి అద్దె చెల్లింపు (హెచ్‌ఆర్‌ఎ) ఇప్పటివరకు కార్మికులు చేస్తున్న హోదాల ప్రకారం పది, ఇరవై, ముఫై శాతం ఇస్తుండగా దానిని తగ్గించి అత్యంత ఘోరంగా 8, 16,24 శాతానికి కుదించడం ఎంతవరకు సమంజసంగా ఉందని దుయ్యబట్టారు. ఈ ఎన్‌డిఎ ప్రభుత్వం నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటి కూర్చున్న ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం నోటివద్ద తిండిని తీసే విధంగా ఈ కమిషన్ ఉందని చలపతిరావు అన్నారు. కార్మికులకు వివిధ రూపాలలో వారి కష్టానికి తగిన విధంగా ప్రస్తుతం ఉన్న అలవెన్స్‌లో 52 అలవెన్సులను రద్దు చేయడం కార్మికుల పట్ల వారికి ఉన్న అభిప్రాయం తేటతెల్లమవుతుందన్నారు. ఇప్పటివరకు ఇస్తున్న జీవిత భీమా (ఇన్సూరెన్స్) నెలసరి కింద ముఫై రూపాయలు వంతున ఒక్కొక్క కార్మికుని వద్ద నుంచి వసూలు చేస్తున్న దానిని నేటి ఈ కమిషన్ ఏకంగా 15 వందలకు అంటే యాభై శాతం పెంచడం పట్ల కార్మికుని శ్రేయస్సు కోరినట్లాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కమిషన్‌లో కిందస్థాయి ఉద్యోగి నుంచి వసూలు చేయడం తప్ప ఇచ్చింది ఏమీలేదని క్షుణ్ణంగా అర్ధమవుతోందని అన్నారు. అధికారులకు మాత్రం ఈ పే కమిషన్‌లో 2.80 - 2.81 కింద స్థిరత్వం (్ఫట్‌మెంట్) చేసి కిందస్థాయిలో కష్టపడే అసలైన ఉద్యోగి, కార్మికుడికి మాత్రం 2.55 శాతం అనేది కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ఈ ప్రభుత్వం అమలంభించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కనీసం తింటానికి కూడా నోచుకోని విధంగా ఈ కమిషన్ ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పే కమిషన్ కమిటీని కార్మిక సంఘాల కళ్లు కప్పటం కోసం నియమించి వారి మీద వత్తిడి తెచ్చి ఇటువంటి రిపోర్టుని ఇచ్చే విధంగా మోదీ ప్రభుత్వం ప్రయోగం చేసిందని క్షుణ్ణంగా అర్థమవుతుందన్నారు. రెండవ పే కమిషన్ నుంచి ఆరవ పే కమిషన్ వరకు కార్మికుల వేతనాలు పెంచడం చూడగా ఈ కిందివిధంగా ఉన్నాయి. రెండవ పే కమిషన్‌లో 14.2 శాతం, మూడవ పే కమిషన్ 20.6 శాతం, నాలుగవ పే కమిషన్ 27.62 శాతం, ఐదవ పే కమిషన్ 31 శాతం, ఆరవ పే కమిషన్ 54 శాతంగా పెంచారు. అయితే ఈ ఏడవ వేతన సంఘం కేవలం 14.3 శాతం పెంచడం పట్ల కేంద్ర ప్రభుత్వ కార్మికులను యాభై సంవత్సరాలు వెనక్కు తీసుకుందని అన్నారు. అలాగే ఆరవ వేతన సంఘంలో 18 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలున్న తల్లి ఉద్యోగం చేస్తుంటే తన బిడ్డల సంరక్షణ కోసం రెండు సంవత్సరాల పాటు పూర్తి జీతంతో కూడిన శెలవు ఆనాడు ప్రకటించగా, నేటి ఈ కమిషన్ ఒక సంవత్సరం పాటు వంద శాతం జీతాన్ని యధావిధిగా ఇస్తూ రెండవ సంవత్సరం దానిని ఎనభై శాతానికి కుదించడం పట్ల మహిళా ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వ అభిప్రాయం వెల్లడవుతోందన్నారు. ఈ ఏడవ వేతన సంఘం అన్నివిధాల కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని త్వరలో ప్రభుత్వం కళ్లు తెరిపించకపోమని ఈ సందర్భంగా కార్మిక సంఘాలు, కార్మికులు అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. భారతదేశ భద్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ రాబడి కోసం ప్రతి కార్మికుడు సమ్మె పదం విడనాడి తన స్వార్థం చూసుకోకుండా పని చేస్తుంటే ప్రభుత్వం సమ్మెకు ఉసికొలిపి కార్మికుని, ప్రజలని కాపాడవలసిన ప్రభుత్వం కార్మికుడిని రోడ్డుమీదకు ఈడుస్తోందని అందుకు తగిన గుణపాఠం త్వరలో నేర్పడం జరుగుతుందని అందుకు జెఎసి సన్నద్ధం అవుతోందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.