రంగారెడ్డి

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 14: ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఆలయాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని శివాలయంలో శ్రీరాజరాజేశ్వరీ దేవీ విగ్రహ ప్రతిష్టాపణ, కళ్యాణ మహోత్సవాన్ని పారిశ్రామికవేత్త పాండురంగారెడ్డి, జ్యోతి దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించారు. మహోత్సవానికి జడ్పీ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల పాలనలో తెలంగాణ ప్రాంతంలోని ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. తమ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసుకున్నారని, తెలంగాణలోని ఆలయాల వైపు కనె్నతె్తైనా చూసిన పాపాన పోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకుందని చెప్పారు. ఆలయాల అభివృద్ధి కోసం అత్యధికంగా నిధులు వెచ్చిస్తోందని వెల్లడించారు. రానున్న రోజుల్లో చారిత్రాత్మక ఆలయాలను పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంపిపిలు గుండెమోని జయమ్మ, మర్రి నిరంజన్‌రెడ్డి, ఆరుట్ల సర్పంచ్ ఆనంగళ్ల యాదయ్య, ఎంపిటిసి శ్రీకాంత్, కోఆప్షన్ సభ్యులు సలాం, తెరాస నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, సత్తు వెంకట రమణారెడ్డి, తెదేపా నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, చీరాల రమేష్, సికిందర్‌రెడ్డి పాల్గొన్నారు.