తెలంగాణ

అమ్మో... హెలికాప్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం బృందం, ఫిబ్రవరి 19: భక్తుల సౌకర్యార్థం మేడారం జాతరకు విచ్చేసే విఐపిలను చేరవేసేందుకు ఏర్పాటుచేసిన హెలికాప్టర్ వస్తుందంటే మేడారం గద్దెల పరిసరాలలో ఎటు 3కిలోమీటర్ల దూరంలో బస చేసిన భక్తులు హడలిచస్తున్నారు. విషయం ఏంటంటే...వచ్చిన విఐపిలు ఏరియల్ వ్యూ అంటూ మేడారం పరిసరాలను రెండు రౌండ్‌లు వేసుకుని మరీ గద్దెల సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ వెనుక భాగంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతున్నారు. ఆ సమయంలో లేచే దుమ్ము ప్రాణసంకటంగా మారింది. ఇప్పటివరకు డిజిపి అనురాగశర్మ, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిలతో పాటు మరికొందరు విఐపిలు పలుమార్లు వచ్చివెళ్లినట్లు సమాచారం. హెలికాప్టర్ వచ్చి వెళ్లిన తరువాత వచ్చే దుమ్ము ధూళి క్లియర్ కావడానికి సుమారు 15 నిమిషాల వరకు పడుతోంది. ఈ హెలిప్యాడ్‌ను కనీసం దేవాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటుచేస్తే మంచిగా ఉండేదని భక్తులు అనుకుంటున్నారు.