అక్షరాలోచన

బాల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇసుక కుప్పలుగా
గుజ్జనగుళ్ల బాల్యం
భావితరాల
సైకత శిల్పులుగా

వంతెన తినె్నపై
బాల్యం భుజాలుగా చేతులు
తంతి తీగెపై
పక్షుల విన్యాసాలు

చెరువు నీటి తలముపై
బోకె బిచ్చల కప్పగెంతులు
బెకబెకల కేరింతలైన
చిలిపి బాల్యం

కిర్రుమని చప్పుడు చేస్తూ
బొంబాయి మిఠాయి
చేతి గడియారమై చుట్టేస్తే
అమాంతం నోరు మింగింది

చౌర్యంగా పండ్లు కోస్తుంటే
పాలేరు అదిలింపునకు
పరుగు లంఘించడం
మోకాళ్లు నెత్తురోడాయి

బాల్యం మొరటుతనానికి చిహ్నాలు
చలికి కాళ్లన్నీ
బీడు భూమి పగుల్లు
ఎండకు ఒళ్లంతా ఉప్పుమేటలు

ఎండల్లో బాల్యం భూమిని
గుండ్రంగా చుట్టేస్తే
గెలిచిన గోళీలతో
బావి నీరు ఉబికి వచ్చింది

కోసుదూరం
లేతకాళ్లు నడవమని
మొండికేస్తే
తాత భుజం ఆసనంగా
ఏనుగు అంబారీపై యువరాజు

బడి స్వల్ప విరామంలో
టేలావాలా పిప్పర్‌మెంట్లకు పైసలడిగితే
జేబులో దాచిన ఆవకాయ ముక్కలు
నాలుక చప్పరించింది

శివరాత్రి ఆటగా కైలాసం
రాత్రంతా
చిలిపి బాల్యాన్ని
పాము మింగుతూనే ఉంది

ఇంటికి చుట్టాలొస్తే
ఆనవాలుగా ఆనందం
పలు వరుసలపై
నవ్వులు నాట్యమాడాయి

చుట్టాలు మరిక సెలవంటుంటే
ఆనవాలుగా
అలుక మొఖం
అత్తిపతె్తై ముడుచుకుంది

చిలిపి బాల్య చేష్టలకు
అంగీ లాగు దుమ్ముకొట్టుకుపోయి
దుర్గంధమైనా
హాయి నిదురనిచ్చేవి

బాల్యం పోయి
కౌమారమొస్తే
సమాజం కట్టుబాట్లకు
కళ్లు ఏడ్చాయి
*

-మడిపల్లి హరిహరనాథ్ 9603577655