అక్షరాలోచన

కర్తవ్య నిర్దేశనం (అక్షరాలోచనాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరుడా! పౌరుడా! పల్లకీ దించు
ఇక్కడ దేశం తలగబడిపోతోంది
భూమి బద్దలవుతోంది
దిక్కులు పిక్కటిల్లుతున్నాయి
గిరులు కూలిపోతున్నాయి
భూమి భూమంతా పక్షుల కలకలారావం..!

పౌరుడా! పౌరుడా! ఆ గోడను కూల్చు
అదెవడో బూర్జువా కట్టిన గోడ
చాన్నాళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది
ఎందరో ప్రయత్నించారు, చతికిలపడ్డారు
దాని కారణంగా సామాన్యుల రుధిరం
డబ్బుగా మారి వాడి ఖజానా నింపుతోంది..!!

పౌరుడా..! పౌరుడా..! వాణ్ణి తరిమికొట్టు
శతాబ్దాలుగా వాడు మన నోటిముద్దను కాజేస్తున్నాడు
తస్కరణ వాని నైజం... మోసం వాని భూమిక
వాడే ఈ వ్యవస్థకు పట్టిన చీడ పీడ
వాణ్ణి పాతరవెయ్...!

పౌరుడా! పౌరుడా!! తలెత్తు
నీలో అపారమైన శక్తి ఉంది
కొండల్ని పిండిచేయగలవు
ఆకాశాన్ని కిందకు దించగలవు
నక్షత్రాల్ని తోరణాలుగా కట్టి
ఈ భూమికి వేనవేల ఉగాదుల్ని ప్రసాదించగలవు...

పౌరుడా! పౌరుడా! నగారా మోగించు
ఇప్పుడిక్కడ కొత్త రాజ్యం స్థాపించబడాలి
కొత్త పాలన విస్తరిల్లాలి
ప్రజా హృదయ మందిరాల్లో నిత్యం
కళ్యాణోత్సవాలు పరిఢవిల్లాలి...
ఎవరూ రూపాయికి కిలో బియ్యానికి ఆశ పడవద్దు
ఎవరూ మతం ఉచ్చులో పడి మానవత్వాన్ని
కోల్పోవద్దు
రోజూ పుస్తక పఠనం జరగాలి
జ్ఞానం పునాదిగా అక్షరాస్యత విలసిల్లాలి...

పౌరుడా! పౌరుడా! త్వరపడు-
కవులు స్వస్తి వచనాలు పలుకుతున్నారు
విను-
కవులు జ్ఞానపథం సూచిస్తున్నారు
చూడు-
కవులు కర్తవ్య నిర్దేశనం చేస్తున్నారు
అనుసరించు-
ఇదిగో ఖడ్గం!
ధరించు-
ఈ దేశం నీదే... నువ్వే ఏలుకో...
నువ్వే ఈ దేశానికి రాజువి.. చక్రవర్తివి
అంతేకాదు, నువ్వే ఈ దేశానికి ప్రజవి కూడా-
*

ప్లాస్టిక్ బొకేలా

-మాదిరాజు రంగారావు

ఒక సమయం అందంగా కదలుతుంది
పచ్చికపై తిరిగే హరిణంలా
ఒక సమయం భయదంగా చరిస్తుంది
కొండ నుండి దిగే సింహంలా

జీవన యానంలో అపాయకరాలెన్నో
అనల గండం! అనిల గండం
నీటి గండం! ఎన్నిటి నుండో
క్షేమంగా బయటపడిన మనిషిలో

మెరపు భ్రమలు తొలగీ
పిడుగుపాటు మరచీ
మనిషి నుండి మాత్రం! మనిషికి భయం!
సందేహం! సంవేదన! జీవితమంతా
‘మనుషులంతా ఒకటే’ అన్నది ఎంత నిజమో
వారివారి పాత్రల్లో విభేదాలూ వాస్తవం

మనిషిలో మానవతా మధుర స్వరం
హృదయ తంత్రిని మీటితేనే వినిపిస్తుంది

వర్తమానం తోటలో అనుభవాల మొక్కలు
అందంగా ఎదిగీ మోదంగా పూచీ
పచ్చని కళతో! మనిషి ముందు ఆశారూపం
వాడిందీ, రాలిందీ గతమవుతుంది

స్మృతిలో ఒక కార్నర్‌లో నిశ్శబ్దంగా
ప్లాస్టిక్ బొకేలా మిగులుతుంది గతం

మడిచెక్క

-సిరికి స్వామినాయుడు

నెల తప్పిందో... లేదో..
‘ఓయ్ నీ పిండాన్ని తినేయనా..’
నిప్పుల నిట్టూర్పులిడుస్తూ అంది కరువు పిశాచి.
‘వద్దు వద్దు ఉండనీ.. ఆకుపచ్చని దీపమై
రేపటి చీకటిని తొలగించనీ..’ హడలిపోతూ వేడుకుందామె!

మరో నెల గడిచిందో.. లేదో...
‘ఓయ్ నీ పిండాన్ని తినేయనా..’
చినుకు శూలాలు గుచ్చుతూ అంది కరిమబ్బు రాకాసి.
‘వద్దు వద్దు ఉండనీ.. రేపటి ఆకలి కడుపుల్లో
మెతుకై పండనీ...’ బతిమాలుకుందామె!

నెలలు నిండాయి. పండంటి బిడ్డ.
అందరి కళ్లల్లోనూ హరిత కాంతులు
ఎలా వచ్చిందో అప్పుల గెద్ద
పురిటి మంచం మీద బిడ్డను తన్నుకుపోయింది
తల్లడిల్లుతూ.. తలబాదుకుందా తల్లి మడిచెక్క!

-సూరారం శంకర్ 9948963141