మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనదాసు సత్యనారాయణ, పెద్దాపురం
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుగారు ఆత్మీయ అభినందన సభలో పార్టీ ఫిరాయింపుదారులు గురించి మాట్లాడుతూ పదవికి రాజీనామా చేసి వెళ్లాలని అన్నారు. ఈ సలహా ఎంతవరకు పాటిస్తారు?
ఈ రోజుల్లో అంతటి నీతిమంతులు అరుదు. పదవినిబట్టే మనిషికి గిరాకీ.

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, బందరు
మనలో మనంలో మా సహ పాఠకులు పత్రిక ధరను పెంచమని (రూ.5/-) సూచనలు చేశారు. నా దృష్టిలో ఆంధ్రభూమి డైలీ ఒక నిరాలంకార భూషిత/ స్వచ్ఛ భారత పవిత్రగంగ/ నిండు కుంకుమ తిలక సువాసినిలా ఉంటుంది. నిరాడంబర లలన!! ఆమె వెల అమూల్యం. హంగులు, పొంగులు, ఇంద్రధనస్సు వర్ణాలతో, రూ.5/-లు ధరతో ఎన్నో పేజీలు, సవాలక్ష శీర్షికలతో, ప్రభుత్వ కొమ్ముకాసే, ఏ గాలికైనా గతులు మార్చే పత్రిక మా భూమి కాదని, యథాతథంగా, ఎప్పటిలాగానే నిర్వహించండని నా మనవి. రూ.5/-లకు మీరు నడిపితే మీరు కృత్రిమ ఆకర్షణలతో నడపవలసి వస్తుంది. ప్రస్తుత ఖశ్దళ్ఘఆ్దక ష్యౄఔళఆజఆజ్యశ తో మీరు తట్టుకోలేరు.
వినదగు నెవ్వరు చెప్పిన

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
ఆరోగ్య మంత్రిగారు చైనా టూర్‌లో ఉన్నారు, కార్మిక మంత్రిగారు మరో దేశం టూర్‌లో ఉన్నారు. మరొకరు ఇంకో దేశం. ఎ.పి. మంత్రులు, ముఖ్యమంత్రి టూర్ల, విమాన యాత్రలకు అంతు ఉండదు. ఇంకా 3 సం.ల పదవీ కాలం ఉండగా మరో నెల్లాళ్ళలో దిగిపోతామన్నట్లుగా ఈ అర్జంటు విదేశీ యాత్రలు ఎవర్ని ఉద్ధరించడానికి?
దండుగమారి విహార యాత్రల్లో వారికి తోడుబోయిన వారు దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు.

ఆర్.కె., హైదరాబాద్
సాంస్కృతిక కళా కార్యక్రమాలలో టీలు, కాఫీలు, టిఫిన్లు, భోజనాలు లభించేలా చేయడం ప్రేక్షకుల సౌకర్యార్థమా? అవి లేకపోతే జనం రారా?
రెండోదే నిజం.

కొలుసు శోభనాచలం, గరికపర్రు, కృష్ణాజిల్లా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అన్ని పక్షాలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నాయి. తీరా ప్రత్యేక హోదాపై రాజ్యసభలో బిల్లు పెట్టగా అన్ని పక్షాలు సమర్థించకపోగా, సభలో గందరగోళాల మధ్య సభ వాయిదాలు పడుతున్నాయ్. ఇంతకీ ప్రత్యేక హోదా బిల్లు ఆమోదింపబడుతుందంటారాః
నమ్మకం లేదు. రాజకీయ నాటకాల్లో మాయదారి మోసాల్లో అన్ని పార్టీలవీ అందె వేసిన చేతులు.

యశ్వంతరావు శేషగిరిరావు, ధవళేశ్వరం
సామాన్య మధ్యతరగతి ప్రజలను గ్యాస్ సబ్సిడీ త్యాగం చెయ్యమన్న మోదీగారు అతి కోటీశ్వరులైన పార్లమెంటు మెంబర్స్‌ను ‘క్యాంటీన్ సబ్సిడీ’, ట్రైన్ ఫ్రీ లాంటి ‘కక్కుర్తి’ సబ్సిడీలను వదులుకోమని చెప్పకపోవడం ఏమిటి?
ఎవరూ వినరు కనుక?

ఇస్లామీయులకి ఇఫ్తారు విందులు, హజ్ సబ్సిడీలు మరే దేశంలోనైనా ఇస్తున్నారా?
లేదనుకుంటా.

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
భారత భూభాగాలు ఆక్రమించి మావోయిజం విస్తరింపజేసి భారత్‌పై నిత్యం నిప్పులు రేపుతున్న చైనాకు ఏ.పి. సి.ఎం. చంద్రబాబు నాయుడుగారు అమరావతి నిర్మాణంలో సాంకేతిక సహకారానికి ఆహ్వానించి ఎర్రచందనం ఎగుమతికి ఒప్పందం కుదుర్చుకోవడం సబబుగా ఉందా?
ఆయన ఒక్కడే కాదు. చైనాతో చెలిమికి ఇంకా ఎందరో ప్రభుత్వ నాయకులు అంగలారుస్తున్నారు. ఈ వేలంవెర్రి పర్యవసానం వేచి చూడాలి.

సి.శ్రీకర్, సికిందరాబాద్
వయసు మీద పడినవారు కాలక్షేపం కోసం తీర్థయాత్రలు చేయాలిగానీ, ప్రతీరోజూ ఆడిటోరియమ్స్‌ని ఆక్రమించుకోవటం బాగుందా?
ఆ రకంగా రోజూ మినిమం గ్యారంటీ ఆడియెన్సును వారు సమకూర్చి పెడుతున్నందుకు సంతోషించాలి.

వై.వి.శివకాంత, అచ్యుతాపురం, నగరికటకం పోస్ట్
తమ ప్రియతమ నాయకుడు నిరాహారదీక్ష ప్రారంభించే శుభ సమయమప్పుడు, తమ సంఘీభావం తెలుపడానికి రాష్టమ్రంతటా అనుచరగణం పళ్లేల మీద గరిటలతో కొట్టడం వినూత్నంగా లేదూ?
ఏడ్చినట్టుంది.

డి.వి. వక్కలంక
నల్లధనం అంతా బయటకు వస్తే, ఆర్థిక అసమానతలు అన్నీ తొలగిపోతాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి సెలవిచ్చారు. ఎంత ఆలోచించినా దీని భావం నాకు అర్థం కాలేదు. మీరైనా చెబుదురూ?
ఆకాశానికి నిచ్చెనలు

వేదుల సత్యనారాయణ, కాకరపర్రు, ప.గో.జిల్లా
ఈ రోజులలో సంప్రదాయ సాహిత్యానికి ఏ పత్రిక అవకాశం ఇవ్వడం లేదు. ఎడారిలో ఒయాసిస్ మాదిరిగా మీ పత్రిక అప్పుడప్పుడు అవకాశం కల్పిస్తోంది. దయచేసి ఈ అవకాశం ప్రతి మూడు మాసాలకైనా ఒక పర్యాయం కల్పించవలసినదిగా మనవి.
రచయితలు సహకరిస్తే మాకు అభ్యంతరం లేదు.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఆదివారం అనుబంధంలో అన్ని రంగాలలో ప్రతిభ కనబరచిన ప్రముఖుల జీవిత విశేషాలను ఒక పేజీలో ప్రచురించమని ప్రార్థన.
ఆలోచిస్తాం.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com
*