తెలంగాణ

మంత్రుల ఇళ్లముట్టడికి విద్యార్థుల యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రభుత్వ రంగంలో విద్యావ్యవస్థను పటిష్టం చేయాలని, ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని నినాదాలు చేస్తూ ఎబివిపి నేతృత్వంలో సోమవారం ఉదయం మంత్రుల ఇళ్లను ముట్టడించేందుకు విద్యార్థులు యత్నించారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసాల్లోకి చొరబడేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. చివరికి ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.