అక్షరాలోచన

జీవనసంధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం నాటకానికి చివరి అంకం వృద్ధాప్యం
సుఖదుఃఖాలు జీవన సారాంశాలు
అన్నీ ఉండి అవసరానికి అక్కరకు రానప్పుడు
దగ్గరుండి చేతికి అందనప్పుడు
సంతానం - సంపద తనదై తనది కానప్పుడు
ఒంటరితనం కత్తిలా కోస్తున్నప్పుడు
వృద్ధాప్యం శాపవౌతుంది.
వృద్ధాశ్రమం దిక్కవుతుంది.

మానవ బంధం తెగిపోతుంది.
చూపు కోసం, పలకరింపు కోసం
చిరునవ్వు కోసం, ఓదార్పు కోసం
ఎదురుచూపులు - జీవనసంధ్యలో.

అయినా
కన్ను మనదే! వేలు మనదే!
కడుపు చించుకొని పేగుల్ని బయటపెట్టుకొంటామా?
ఆధునిక కాలంలో
కుటుంబ వ్యవస్థ కుంటుపడిపోయింది
గతిలేని కుటుంబం కావచ్చు!
ఆత్మాభిమానం నిండుతనం!
తరంతరం సంస్కారం మరిచి
ఆధునిక పోకడలతో సుఖ సౌఖ్యం కోసం బాధ్యతలేక
కుటుంబ వ్యవస్థ భ్రష్టు పట్టింది.
ఈసడింపులు ఎత్తిపొడిచే మాటలు
సూదులై గుచ్చుకుంటాయి
కళ్ల ముందుండి కానప్పుడు
మంచి చెడులను కలసి పంచుకోనప్పుడు
తన ఇల్లు, తన వాళ్లే పరాయిలా కనపడతారు.
తల్లిదండ్రులను ఆస్తులుగా పంచుకొన్నపుడు
చిన్ననాటి తల్లిపాల తీపి
తండ్రి ఎత్తుకొన్న ముద్దు మురిపాలు గుర్తుకురావు
జీవితానికి సార్థకత ఏది?
మదిమి - రోగం, నొప్పి, ఒంటరితనం
ప్రయాసపెడతాయ్ జీవన యాత్రలో...
అవసాన దశలో ఆసరా కావాలి!
నెత్తి మీద నీడై నిలవాలి!
కానీ-
సాయంసంధ్యలా జారిపోకూడదు
జీవగంజి కోసం, తన వాళ్ల కోసం
ఆత్మ తొక్కులాడుతుంది.
*

ఇది యుద్ధ కవిత కాదు

-సిహెచ్.మధు
9949486122

భారతం చదివి చదివి
ముసలివాణ్ని అయ్యాను కానీ-
యుద్ధమే చేయలేదు
శత్రువు కనిపిస్తున్నా యుద్ధ రంగాన్ని సృష్టించలేదు.
నేను అర్జునుణ్నే!
కుడి భుజం కృష్ణులే మారిపోతున్నారు
విశ్వరూపం చూపించకుండానే
భగవద్గీత చెప్పకుండానే-
ఏమి చేయాలో అర్థంకాని స్థితి
నా రాజ్యం పోయింది
నా భూమి పోయింది
అభిమానం ఎన్నడో ఆత్మహత్యగా మారిపోయింది
నా పంట పోయింది
కంట తడి మిగిలింది
శత్రువు ఎదురుగానే కనిపిస్తున్నాడు
వివిధ రూపాలలో వివిధ వేషాలలో
బహు నాటకాలలో-
సంక్షేమ దొంగాటలో
ఏం చేయాలి?
పనె్నండేళ్ల వనవాసం - ఒక ఏడాది అజ్ఞాతం
ఎన్నో ముగిసాయి అరువది ఏళ్లుగా-
చిన్నచిన్న యుద్ధాలలో
అభిమన్యుల నెందరినో పోగొట్టుకున్నాను
పద్మవ్యూహం వాడిది
పది అడుగులు ముందుకు వంద వెనక్కు నావి
భీముడు మొద్దు నిద్రపోతున్నాడు
ధర్మరాజు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు
నకుల సహదేవులు రెడీగా ఉన్నారు.
ద్రౌపతి వీధివీధిన యుద్ధం చేయుమని
పిలుస్తూనే ఉంది
ఆకాశం ఎప్పుడు ఎర్రబారుతుందో తెలియటంలేదు.
*

శాంతిమంత్రం

-కోడూరి రవి
9491470260

గొంతెత్తి ప్రశ్నించిన పావురం
ఎంత కండకావరం
శాంతి కపోతం శాంతి కపోతం
అని నినదించలేదా
రెక్కలు కట్టుకు నిలబడాలి
రెప్పలు వాల్చి తలవంచాలి

అణువణువునా
వినయమే కనపడాలి
బడబాగ్ని రగులుతున్నా
శరపరంపరగా శత్రువులు విసిరే
బాణాలు గుండెల్లో గుచ్చుతున్నా
శాంతి మంత్రం జపించాలి

కన్నీటిని దాచి
బాధలను మరిచి
పెదాలపై మల్లెలు పూయించాలి
ఎదలోన
వెనె్నల కురిపించాలి

రక్తాశ్రులు ఏరులై పారుతున్నా
కన్నుల ఆనందం కనిపించాలి
ప్రపంచపు ప్రశంసలు
దిగ్ధిగంతాలదాకా వినిపించాలి...

-మహమూద్ పాషా 9010597575