నమ్మండి! ఇది నిజం!!

వింత సంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం మన దేశంలో పెళ్ళిళ్ల పేరయ్యలు సంబంధాలు కుదిర్చేవారు. ఇప్పుడు అది మేరేజ్ బ్యూరో వ్యాపారంగా మారింది. వధూవరుల కోసం ఓ సంత జరగడం వింతే. చైనాలోని షాంఘైలో పీపుల్స్ స్క్వేర్ అనే చోట ఈ సంత ప్రతీ శని, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నించి సాయంత్రం ఐదు దాకా జరుగుతోంది. పెళ్లి కాని పిల్లలు గల తల్లిదండ్రులు ఈ సంతలో పాల్గొంటూంటారు. వీరి లక్ష్యం తమ పిల్లలకి తగిన వధువు/ వరుడిని కనుగొనడమే. ఇందుకు కొలబద్దలుగా వీరు వయసు, ఎత్తు, ఉద్యోగం లేదా వృత్తి, చదువు, ఆదాయం, కుటుంబ విలువలు, చైనీస్ జోడియాక్ సైన్, చివరగా అందం పరిగణనలోకి తీసుకుంటారు. తల్లిదండ్రులు తమ బిడ్డలకి చెందిన ఈ సమాచారాన్ని ఓ కాగితం మీద రాసి దీని కోసం ఏర్పాటు చేసిన దణ్ణానికి వేలాడదీస్తారు. ఇలాంటి కాగితాలు అక్కడ అనేకం వేలాడుతూంటాయి.
తల్లిదండ్రులు ఆ ప్రకటన కాగితాలని చదువుతూ అక్కడ తిరుగుతూ కనిపిస్తారు. తాము అనే్వషించే అన్ని కొలబద్దలు గల కాగితం కనిపిస్తే ఆగి, ఆ కాగితంలోని వధువు/ వరుడు తల్లిదండ్రులతో ముచ్చటిస్తారు. కొలబద్ద విషయంలో సాధారణంగా తల్లిదండ్రులు రాజీపడరు.
ఆధునిక యువతీ యువకులు తమ తల్లిదండ్రులు ఈ సంతకి తమ వివరాలతో వెళ్లడాన్ని ఇష్టపడరు. పశువుల మార్కెట్‌లా లేదా రైతు బజార్లా తాము కూడా ఓ వినియోగ వస్తువుగా చూడబడటం వారికి ఇష్టంలేదు.
తమ చైనీస్ సంప్రదాయ విలువలని కాపాడుకునేందుకు షాంఘై మేరేజ్ మార్కెట్ ఉపయోగిస్తుందని ఆధునిక చైనాలోని తల్లిదండ్రుల భావన. ఇండియన్స్‌లా చైనీస్ కూడా తమ కుటుంబ సంస్కృతి సంప్రదాయాలకి అధిక విలువని ఇస్తారు. కోడలు లేక అల్లుడిగా తమ కుటుంబంలోకి వచ్చే వారి కుటుంబంలో అలాంటి విలువలని తీవ్రంగా కోరుకుంటారు.
చైనాలోని ఒకే బిడ్డ పాలసీ వల్ల ఈ సంతకి కొంత గిరాకీ తగ్గింది. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా చైనాలో వచ్చిన మార్పుల వల్ల పిల్లలు తమ జీవిత భాగస్వామిని తామే ఎంపిక చేసుకోవాలనుకోవడం, డేటింగ్ చేయడం లాంటివి చోటు చేసుకోవడం కూడా ఇందుకు దోహదం చేస్తోంది. చైనాలో ఒకే బిడ్డ పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నించి మొదటి కానుపులో ఆడపిల్ల పుడితే చంపేయడం జరుగుతోంది. కారణం ఆడపిల్ల కాక అంతా మగ సంతానాన్ని కోరుకోవడం. దాని ఫలితంగా నేడు వరుల సంఖ్య అధికమై, వధువుల సంఖ్య బాగా తగ్గిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ కెంట్ సర్వే ప్రకారం 2020కల్లా రెండు కోట్ల నలభై లక్షల బ్రహ్మచారులకి భార్యలు లభ్యంకాక పెళ్లిళ్లు కావు అని అంచనా. మగవారికి పెళ్ళిళ్లు కాకపోవడానికి మరో కారణం పెద్ద చదువులు చదివిన ఆడవారు కెరీర్‌ని ప్రధానంగా భావించి పెళ్లిని వాయిదా వేసుకోవడం. పాత తరాలతో పోలిస్తే నేటి యువతులకి పెళ్లి విషయంలో ఎక్కువ స్వతంత్రం, అవకాశాలు ఉన్నాయి. దాంతో సామాజికంగా పరిస్థితి తారుమారై, మగవాళ్ల ఆధిపత్యం తగ్గిపోయి నేడు చైనాలో ఆడవారి ఆధిపత్యం మొదలైంది. గతంలో కుటుంబ నిర్వహణలో శ్రద్ధ, కుటుంబ బరువు బాధ్యతలని మోయగలగడం వధువులకి ప్రధాన అర్హతలుగా భావించేవారు. నేడు చక్కటి కెరీర్, హుందాతనాలు ప్రధాన అర్హతలు అయ్యాయి.
2004 నించి ఈ పెళ్లిళ్ల సంత జరుగుతోంది. ఈ ప్రకటనలని వరుసగా ఐదు నెలల పాటు వేలాడదీసి ఉంచడానికి సుమారు రెండు వందల రూపాయలు ఖర్చవుతుంది. చైనాలో మేరేజ్ బ్యూరోలు కూడా విస్తరించుకుంటున్నాయి. వారి రిప్రజెంటేటివ్స్ కూడా ఈ సంతకి వచ్చి, తల్లిదండ్రులకి తమ ప్రకటన కాగితాలని, విజిటింగ్ కార్డులని పంచుతూంటారు. వీరి రిజిస్ట్రేషన్ ఫీజు సుమారు 1,200 రూపాయలు. వీరు ఫొటోలు, మొత్తం సమాచారం అందిస్తారు.
కొందరు తల్లిదండ్రులు గొడుగుల మీద తమ బిడ్డల వివరాలని రాసి ఎండలో ఆ గొడుగు కింద కూర్చుంటారు. షాంఘైలోనే కాక బీజింగ్‌లో, ఇంకా చైనాలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి పెళ్లి సంతలు జరుగుతున్నాయి.
ఇది సంప్రదాయ మేరేజ్ మేచ్.కాంగా చెప్పచ్చు.
వియత్నాంలో మరో వింత సంత జరుగుతోంది. దాని పేరు ఖావ్ వాయ్ లవ్ మార్కెట్. ఈ మార్కెట్‌కి వచ్చేవారు ఏదీ అమ్మరు. కొనరు. ప్రేమలో విఫలం చెందిన యువతీ యువకులు పెళ్లికి జీవిత భాగస్వామిని ఎంచుకోడానికి లేదా తమ మాజీ ప్రేమికుల్ని కలుసుకోవడానికి మాత్రమే ఈ సంతకి వస్తారు. దీని వెనుక ఓ సంప్రదాయం బాధాకరమైన ప్రేమ సంఘటనలోంచి పుట్టింది.
వందల ఏళ్ల క్రితం రెండు విభిన్న తెగలకి చెందిన యువతీ యువకులు ప్రేమలో పడ్డారు. కాని ఆ తెగల మధ్య పెళ్లి నిషేధం. వీరి పెళ్లి విషయంలో ఆ తెగల మధ్య రక్తపాతం జరగడంతో మనసు విరిగిన ఆ ఇద్దరూ పెళ్లి ఆలోచనని విరమించుకున్నారు. ఏటా మార్చి 26న వారు ఖావ్ వాయ్‌లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పట్నించి ఆ తారీఖున ఆ ప్రదేశంలో ప్రేమలో వైఫల్యం చెందిన వారు అక్కడ కలుసుకోవడం ఆరంభమైంది. భార్యాభర్తల్లో ఎవరైనా ఈ సంతకి వస్తే ఆ జంటలోని రెండో వ్యక్తి అసూయ చెందరు. ఎందుకంటే ఇది రెండు గంటల తాత్కాలిక కలయిక మాత్రమే.
మొదటి రోజు చక్కటి పంట కోసం ప్రార్థనలు జరిపాక ఈ సంత ఆరంభం అవుతుంది. రెండో రోజు అన్నదానం జరుగుతుంది. విఫల ప్రేమకి ప్రాధాన్యతని ఇచ్చే ఇలాంటిది మరోటి ప్రపంచంలో ఎక్కడా లేదు.

-పద్మజ