నమ్మండి! ఇది నిజం!!

హిట్లర్ ఏమయ్యాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికన్ గూఢచార సంస్థ సిఐఏ (ఆనాటి ఓఎస్‌ఎస్) ఇరవయ్యవ శతాబ్దం మొదటి భాగంలో ఓ వ్యక్తి కోసం జరిపిన వేట, మళ్లీ ఇంతదాకా ఆ స్థాయిలో జరిగింది ఒక్క బిన్‌లాడెన్ విషయంలోనే.
రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన అడాల్ఫ్ హిట్లర్ ఓడిపోతున్నాడని గ్రహించగానే, అతను పారిపోతాడని సిఐఏ అధికారులు భావించారు. దాంతో అతను మారువేషం వేసుకుంటే ఎలా ఉంటాడో, అనేక ఫొటోలని తయారుచేయించారు. 30 ఏప్రిల్ 1945న హిట్లర్ బెర్లిన్‌లోని ఫ్యూరర్ బంక్‌లో కాల్చుకుని మరణించాడన్న వార్త ప్రపంచానికి 2 మే దాకా తెలియలేదు. సిఐఏకి వెంటనే తెలిసింది. అతని శవాన్ని ముందుగా బెర్లిన్ చేరుకున్న సోవియట్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. వారి పరిశీలనకి కూడా దాన్ని అమెరికన్స్‌కి ఇవ్వలేదు. పైగా హిట్లర్ శవాన్ని పెట్రోల్ పోసి తగులపెట్టడంతో మరణించింది హిట్లరా లేక మరొకరా అన్న అనుమానాలు అందరిలో కలిగాయి. లేకపోతే తగులపెట్టాల్సిన అవసరం ఏమిటి అనే ప్రశ్న సిఐఏకి ఉదయించింది.
నాజీ పార్టీలోని చాలామంది ప్రముఖులు జర్మనీ నించి మాయమయ్యారు. అలా హిట్లర్ కూడా మాయమయ్యాడని సిఐఏ అనుమానించి సిద్ధంగా ఉన్న హిట్లర్ మారువేషం ఫొటోలని వివిధ దేశాల్లో ఉన్న తమ ఏజెంట్లకి పంపించింది. వారంతా హిట్లర్ వేటలో పడ్డారు.
ఈ ఫొటోలని తయారుచేసింది న్యూయార్క్‌కి చెందిన ఎడ్డీసెంజ్ అనే మేకప్ ఆర్టిస్ట్. ఇతని తండ్రి మెట్రోపాలిటన్ ఒపేరా హౌస్‌లో మేకప్ డైరెక్టర్. చిన్నప్పటి నించి తన తండ్రి నటీనటులకి మేకప్ వేస్తూండగా సెంజ్ దగ్గరుండి గమనించేవాడు. పెద్దయ్యాక తండ్రి వృత్తినే చేపట్టి హాలీవుడ్ చేరుకున్నాడు. పేరావౌంట్, ఫాక్స్, వార్నర్ బ్రదర్స్ స్టూడియోల్లో నటీనటులకి మేకప్ చేసేవాడు. రుడాల్ఫ్ వేలంటినో లాంటి ప్రముఖులకి ఇతనే మేకప్ చేసేవాడు.
6 జూన్ 1944న మిత్రసైన్యాలు జర్మన్ ఆక్రమిత ఫ్రాన్స్ మీద దాడి చేసి, జర్మన్స్‌ని యూరప్‌లో వెనక్కి నెట్టడం ఆరంభించాక, హిట్లర్ చరమగీతం దగ్గిర పడిందని గ్రహించగానే సిఐఏ ఎడ్డీ సెంజ్‌కి హిట్లర్ ఫొటోలు కొన్నిటిని ఇచ్చి, అన్ని రకాల మారువేషాలని తయారుచేయమని కోరారు. మారువేషంలో పారిపోవడమే కాక, ఆ వేషంలోనే కొనసాగుతాడని వారు భావించారు. ఆ తర్వాత దాక్కున్న చాలామంది నాజీ ప్రముఖులని విదేశాలలో, ముఖ్యంగా సౌత్ అమెరికాలోని దేశాల్లో పట్టుకున్నారు. 1970 దాకా హిట్లర్ ఎక్కడో జీవించే ఉన్నాడని సిఐఏ బలంగా నమ్మి అనే్వషణని కొనసాగించింది. అతని మీసాలని తొలగించి, ఫేషియల్ సర్జరీ ద్వారా మార్పించుకునే ముక్కుని, అతనికి వయసుతోపాటు వచ్చే బట్టతల లేక తెల్లజుట్టుతో కూడిన ఫొటోలని ఎడ్జీ సెంజ్ రూపొందించాడు.
అదే సమయంలో జర్మన్ పత్రికా విలేఖరి విక్టర్, హిట్లర్ మారువేషంలో దాక్కున్నాడని, జుట్టుకి తెలుపు లేదా ఎరుపు రంగు వేసుకుని, గేదెకొమ్ము ఫ్రేం కళ్లద్దాలు, బౌలర్ హేట్‌లని ధరించి ఉంటాడని రాసాడు. వెంటనే సిఐఏ టైమ్స్ పత్రికకి ఎడ్డీ సెంజ్ రూపొందించిన అడాల్ఫ్ హిట్లర్ మారువేషాల ఫొటోలని ఇచ్చి ప్రచురింపజేసింది.
సిఐఏ మునుపటి పేరు ఓఎస్‌ఎస్ (ది ఆఫీస్ ఆఫ్ స్ట్రీటజిక్ సర్వీసెస్) రికార్డులని కొంత కాలానికి డిక్లాసిఫై (రహస్యమైనవిగా భావించక) చేయడంతో, అవి 1998లో ఆన్‌లైన్‌లో చోటు చేసుకోసాగాయి. వాటినిబట్టి సిఐఏకి హిట్లర్ అనే అనుమానంగల 182 మంది మీద ఫిర్యాదులు అందాయని, అధికారులు అందరి చరిత్రని పరిశీలించి వారు హిట్లర్ కాదని నిర్ధారణ చేశారని తెలిసింది. ఇలా మొత్తం 75 దేశాల్లో సిఐఏ ఏజెంట్స్ హిట్లర్‌ని పోలిన 182 వ్యక్తులని అనుమానించారు. హిట్లర్ ఆత్మహత్య చేసుకోలేదని, మారువేషంలో పారిపోయాడని 1988 దాకా చాలామంది విశ్వసించారు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోకుండా పారిపోయే అవకాశం హిట్లర్‌కి ఆనాడు విస్తారంగా ఉంది.
హిట్లర్ అర్జెంటీనాలో జీవించాడని కొన్ని పుస్తకాలు వెలువడ్డాయి. ఒకేచోట ఉండకుండా, హిట్లర్ రకరకాల మారువేషాల్లో పారిపోతున్నాడని, కొన్ని పుస్తకాల్లో రాశారు. అమెరికాలో లాస్‌ఏంజెలెస్‌లోని ఓ కేఫ్టీరియాలో అతన్ని చూశామని 1952లో కొందరు పోలీసులకి ఫోన్ చేశారు. విస్కాన్సిన్‌లో వయొలిన్ వాయిస్తూ పిచ్చివాడిలా నటించేవాడని, మయామీలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని, సోవియట్ యూనియన్‌లో, ఇంకా డెన్మార్క్ లాంటి దాదాపు డజను దేశాల్లో దాక్కున్నాడని అనేక సందర్భాల్లో దినపత్రికల్లో కూడా రాశారు. ప్రతీ వార్తని సిఐఏ క్షుణ్ణంగా పరిశీలించింది.
నేటికీ హిట్లర్ ఆత్మహత్య చేసుకోకుండా తెలివిగా తప్పించుకున్నాడని నమ్మేవారి సంఖ్య తక్కువేమీ కాదు. ముఖ్యంగా హిట్లర్‌తో వ్యక్తిగత పరిచయం గలవారు అతను తప్పించుకున్నాడనే విశ్వసించేవారు. అతను ఏమైంది అన్నది ఒక్క హిట్లర్‌కే బహుశా తెలుసు.

-పద్మజ