నమ్మండి! ఇది నిజం!!

ఇప్పుడు నీ భార్య ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లి ప్రతీ వారి జీవితంలో ఆనందదాయకమైనదే. విడాకులు? అదీ ఆనందదాయకమైందే. లేకపోతే విడాకులు తీసుకోరుగా? సౌదీ అరేబియా దేశాన్ని స్తాపించిన ఇబిన్ సౌద్ 17 సార్లు, ముస్త్ఫా ఈద్ సమిద్ అనే సంగీతకారుడు 23 సార్లు పెళ్లి చేసుకున్నారు. విడాకులకి అవకాశం లేకపోతే మళ్లీ పెళ్లి చేసుకోవడం కష్టం. లేదా అంతమంది భార్యలని ఓ భర్త ఎలా పోషించగలడు?
అత్యధిక పెళ్లిళ్లు అనగానే మనకి హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్, ఒకనాటి నటి జా జా గేబర్, చరిత్రతో పరిచయం ఉన్న వారికి హెన్రీ ది ఎయిత్ గుర్తొస్తారు. కాని ఈ ముగ్గురు ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నారో వారికన్నా అధికసార్లు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి స్కాటీ ఉల్ఫ్.
అవును. గ్లెన్ స్కాటీ ఉల్ఫ్‌కి 29సార్లు పెళ్లైంది. 28సార్లు విడాకులు అయ్యాయి. ప్రపంచంలో అత్యధిక పెళ్లిళ్లు చేసుకున్న రికార్డ్ ఇతనికే ఉంది. అన్నిటా ముందుండే అమెరికా పౌరుడే ఇతను. ఇతని మిత్రులు ‘ఇప్పుడు నీ భార్య ఎవరు?’ అని అడుగుతూండేవారు. అతను పెళ్లి చేసుకున్న వారిలో టీనేజర్స్, అమ్మమ్మలు, రైతు పిల్లలు, కన్యలు, వేశ్యలు, దొంగలు, డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు.
ఇండియానా రాష్ట్రంలోని నాక్స్ కౌంటీకి చెందిన ఉల్ఫ్ 1931లో తన 22వ ఏట మొదటి పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతని స్కూల్ మేట్ హెలెన్. ఆమెని చూసీ చూడగానే తక్షణం పెళ్లి చేసుకోమని అడిగాడు. కాని పెళ్లయిన కొద్ది కాలానికే ఆమెకి విడాకులు ఇచ్చాడు. మూడో భార్య మిల్‌డ్రెడ్‌కి విడాకులు ఇచ్చినప్పుడు ఇండియానా కోర్ట్‌లోని జడ్జిని తన భార్యగా మిల్‌డ్రెడ్‌ని రికార్డుల్లో తొలగించి, అంతకు మునుపు భార్య మార్జి పేరుని ఉంచమని కోరాడు. జడ్జి అతన్ని కోప్పడుతూ ఇలా చెప్పాడు.
‘పెళ్లి విషయంలో నువ్వు ఇలా ప్రవర్తించేట్లయితే హాలీవుడ్‌కి వెళ్లు’
ఆ సలహా నచ్చడంతో స్కాటీ లాస్ ఏంజెలెస్‌కి వెళ్లి అడెల్ అనే నాట్యకత్తెని పెళ్లి చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఆమె అతనికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత అతను బాప్టిస్ట్ మినిస్టర్‌గా పని చేస్తూ అనేక పెళ్లిళ్లు చేసుకున్నాడు.
ఒక భార్యతో విసుగు పుట్టగానే, లేదా తన భార్యకి తనంటే విసుగు పుట్టింది అనిపించగానే అతను విడాకులు ఇచ్చేసేవాడు. వారికి భరణం కూడా తక్కువ మొత్తంలో ఇచ్చేవాడు. ఇందుకోసం మెక్సికో దేశానికి వెళ్లి విడాకులు తీసుకునేవాడు. కాలిఫోర్నియాలోని బ్లిత్ బాప్టిస్ట్ మినిస్టర్‌గా పనిచేసే ఉల్ఫ్ పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అతి తక్కువ కాలం వైవాహిక జీవితం గడిపింది 19 రోజులు. అతి ఎక్కువ కాలం వైవాహిక జీవితం గడిపింది - పదకొండేళ్లు. మరణాల వల్ల ఐదుగురు భార్యలతో వైవాహిక జీవితం అంతం అయింది. మిగిలిన ఇరవై నాలుగు సందర్భాల్లోను విడాకుల వల్లే వివాహాలు అంతం అయ్యాయి. పదమూడు మంది భార్యలకి ఏడాది తిరక్కుండానే విడాకులు ఇచ్చాడు. మిగిలిన భార్యలతో సగటున రెండున్నరేళ్ల వైవాహిక జీవితాన్ని గడిపాడు. ఆఖరి భార్య 53 ఏళ్ల లిండా ఎవాన్స్. ఈమెకి స్కాటీ ఉల్ఫ్ 23వ భర్త! ఈమెది ప్రపంచంలోని ఆడవారిలో అత్యధిక పెళ్లిళ్లు చేసుకున్న రికార్డ్. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్‌గా జరిగిన పెళ్లి మాత్రమే. పెళ్లయిన వారానికి ఆమె ఇండియానా రాష్ట్రంలోని తన స్వగ్రామం ఏండర్సన్‌కి వెళ్లిపోయింది.
ఉల్ఫ్‌కి నలభై మంది పిల్లలు, 19 మంది మనవలు, మనవరాళ్లు, 19 మంది ముని మనవలు, మనవరాళ్లు కూడా ఉన్నారు. నలభై మంది పిల్లల్లో జాన్ అనే కొడుకు మాత్రమే తండ్రి ఉల్ఫ్‌ని అప్పుడప్పుడు పలకరించేవాడు.
కేలిఫోర్నియాలోని రెడ్ లేండ్స్‌లో ఉల్ఫ్ తన 89వ పుట్టిన రోజుకి నెల ముందు 20 జూన్ 1997న మరణించాడు. ప్రపంచంలో అత్యధిక పెళ్లిళ్లు చేసుకున్నా, ఆశ్చర్యంగా అతని మరణానికి చింతించిన వారు ఎవరూ లేరు. ఒంటరిగా జీవిస్తూ మరణించాడు. బీదరికం కారణంగా జాన్ తన తండ్రికి శవ సంస్కారం చేయలేదు. ఓ మాజీ భార్య ఆ పని చేద్దామనుకుంది కాని విడాకుల కారణంగా ఆమె ఆ హక్కుని కోల్పోయింది. ఆమెకి ఉల్ఫ్ శవాన్ని అందించే కాగితం మీద జాన్ ఆలస్యంగా సంతకం చేశాడు. చివరికి ఆమె ఉల్ఫ్ శవాన్ని త స్వగ్రామంలో ఖననం చేసింది.
పెళ్లి పరుగు పందెంలో ముందు ఉండటంతో ఇతని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో ప్రపంచంలో అత్యధిక పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తిగా నమోదైంది. ఈ 29 మంది కాక బోనీ లే బేక్లీ అనే ఆమెని కూడా ఉల్ఫ్ పెళ్లి చేసుకున్నాడు. ఐతే రుజువు దొరక్క ఈ వివాహం గిన్నీస్ బుక్‌కి ఎక్కలేదు. అంటే ముప్పైసార్లు పెళ్లి చేసుకున్నట్లు.
మేరేజ్ కౌనె్సలర్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కేలిఫోర్నియా డైరెక్టర్ కాన్‌స్టేన్స్ ఇలా చెప్పాడు.
‘స్కాటీ ఉల్ఫ్‌ది నేర చరిత్ర. అతను చట్టాన్ని అధిగమించకుండానే నేరపూరిత వైవాహిక జీవితాన్ని గడిపాడు. విడాకులు ఇచ్చే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవడం సామాజిక నేరం’
ప్రపంచంలో అత్యధిక కాలం కలిసి వైవాహిక జీవితం గడిపిన జంట కరంచంద్, కర్తారి చంద్. వీరు భార్యాభర్తలుగా 90 ఏళ్ల 60 రోజులు కలిసి ఉన్నారు. 11 డిసెంబర్ 1925న వీరికి పెళ్లయింది. 10 జూన్ 2014న ప్రపంచంలో అత్యధిక కాలం వైవాహిక జీవితం గడిపిన వ్యక్తులుగా వీరి పేర్లు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యాయి.

-పద్మజ