అమృత వర్షిణి

లయ జ్ఞానంతోనే ధ్వని మాధుర్యం ( అమృతవర్షిణి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనకటి తరంలోని మృదంగ విద్వాంసులు మాత్రం సౌఖ్యానికి మాత్రమే ప్రాధాన్యత నిస్తూ సాహిత్యంలోని భావం శ్రోతలు అర్థం చేసుకుంటూ ఆనందించే విధంగా తమ మృదంగ వాద్యంతో సంగీత కచేరీ రక్తికి
దోహదపడుతూ గాయకుల ప్రశంసలతోబాటు సంగీత రసికుల
ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం - మృదంగ విద్వాంసులకు వీలైనప్పుడే, గాత్ర విద్వాంసులు సంగీత
కచేరీలు ఒప్పుకునేవారు. సొగసైన మృదంగ వాద్యానికి అర్థం వారే.
పాడే పాటలోని సాహిత్యం శ్రోతలకు బాగా అర్థమవ్వాలి. మాటలు
సరళంగా ఉండి సుబోధకంగా ఉండాలి. ఏం పాడుతున్నాడో
తెలియకుండా పాటను మింగేసేలా వాద్యఘోష ఉండకూడదు.

ప. సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిన్ను
సొక్క జేయు ధీరుడెవ్వడో ఆ ధీరుడెవ్వడో॥
అ.ప. నిగమ శిరోర్థము కల్గి నిజ వాక్కులతో స్వరశుద్ధముతో॥
చరణం: యతి విశ్రమ సద్భక్తి విరతి ద్రాక్షారస నవరస
యుత కృతిచే భజియించే యుక్తి త్యాగ
రాజుని తరమా రామా ॥
చీమ నుండి బ్రహ్మ వరకూ ప్రతి జీవికీ ఏదో ఆనందం ఎప్పుడో ఒకప్పుడు లభిస్తూనే ఉంటుంది.
సామాన్యులకు దొరికేది అల్పానందమైతే అసామాన్యులకు దొరికేది శాశ్వతానందం.
క్షణికమైన ఆనందానికీ శాశ్వతమైన ఆనందానికీ ఎంతో వ్యత్యాసం ఉంది.
మాయతో నిండిన పరమాత్మ, పాలలో నెయ్యిలా కంటికి కనిపించకుండా ప్రతి జీవిలోనూ అంతర్యామిలా ఉన్నాడని గ్రహించిన నాద యోగులు తమ గానంతో ఆ పరమాత్మను ‘కాస్తా’ వశం చేసేసుకుని పునీతులై పోయారు - ఆయన నాదప్రియుడు కదా?
జీవితం మీద, శరీరం మీద వ్యామోహాన్నీ మమకారాన్నీ చంపుకుని, శాశ్వతానందాన్నిచ్చే సంగీతాన్ని గట్టిగా పట్టుకున్నారు.
నాదప్రియుడైన పరమాత్మకు సన్నిహితులై పోయారు - ఇది అనుకున్నంత తేలికైన విషయం కాదు.
ప్రతి వ్యక్తికీ ‘ఆత్మ’ ఉంటుంది. దీని ఉనికిని నిర్ధారించగలగటం సాధ్యం కాదు.
కానీ దీని వ్యాపారం మాత్రం మనస్సు, బుద్ధి, హృదయం అనే మూడు అంతస్తులలో జరుగుతుందనుకోవచ్చు.
మనస్సుతో గ్రహించిన దానిని, బుద్ధితో దాని గుణగణాలను ఏర్పరచుకుని, హృదయంతో అనుభవిస్తాం. ఈ హృదయ వ్యాపారమే భావం. సంగీతంలో ఆకర్షించేది ఈ భావమే.
అసలు సంగీతమే ‘ఒక భాష’. ఎవరికీ అర్థంకాని భాష. మాటల ద్వారా అర్థమయ్యేది కొంత మాత్రమే. గాయకులు, వాదకులూ ఏదో ఒకటి మనకందిస్తారు. మనం దాన్ని స్వీకరిస్తాం. అనుభవిస్తూంటాం. యిదనీ, యిట్టిదనీ వారూ చెప్పలేరు. మనమూ తెలుసుకోలేం. కారణం?
పలుకులకు భాషలో వున్న సంకేతం, లేదా ఒప్పందం సంగీతంలో లేదు.
స్వరం, శ్రుతి, రాగం, తాళం, లయ, లెక్క, సంవాదం, వివాదం, అనువాదం, గమకం లాంటివన్నీ విద్వాంసులకు మాత్రమే అర్థమయ్యే మాటలు. అవన్నీ పారిభాషిక పదాలు. వేదాంతంలోని నిగూఢమైన విషయాలను శుద్ధమైన స్వరంతోనూ యతిప్రాస నియమాలను పాటిస్తూ, విరామాన్ని పాటిస్తూ, సరళమైన భాషలో, సులభంగా అర్థమయ్యే రీతిలో నవరసాలనూ చొప్పించి కూర్చిన కృతికి ‘మద్దెల’ తాళాన్ని జోడించి నిన్ను సంతోషపెట్టగలిగిన నేర్పు కలిగిన మహానుభావుడెవడో, నాకు తెలిస్తే, బాగుణ్ణు కదా! అంటూ తన వినమ్రత, సంస్కారం ఉట్టిపడేలా భావించిన త్యాగయ్య -
‘యతి విశ్రమ సద్భక్తి వి
రతి ద్రాక్షారస నవరస
యుత కృతిచే భజియించే యుక్తి
త్యాగరాజుని తరమా! శ్రీరామా! - అంటారు.
సహజపండితుడై సంగీత సాగరాన్ని పుక్కిట పట్టిన త్యాగరాజే ఆ మాటంటే, ఇంక సామాన్యుల సంగతి చెప్పాలా? కర్ణాటక సంగీత కచేరీల్లో ప్రధానమైన పక్క వాద్యాలు వయొలిన్, మృదంగం ఒకటి శ్రుతి మాధుర్యానికి ప్రతీకగా నిలిస్తే, మరొకటి లయకు ప్రామాణికమై నిలుస్తుంది. ఈ రెండింటి సమ్మేళనంతో నిండిన సంగీతం శ్రవణపేయమై మనసుని రంజింపజేస్తుంది. సాహిత్యంలో శబ్దార్థాల కసరత్తులూ, వింతలూ చోటు చేసుకుని వున్నా, దాని పరమ ఫలం హృదయ స్పందన నిచ్చే భావమే.
సంగీతం మనకందించేది ఏ అర్థమూ లేని తన రూపం మాత్రమే. సాహిత్యం సంగీతానికి చేసే సహాయం వట్టి అలంకారం మాత్రమే కానీ, అర్థవితరణ కాదు. గాయకులు విస్తరించే రాగాలాపన, తాన విస్తరణ, స్వర ప్రస్తారం - భాషతో సంబంధం లేకుండా సాగే అంశాలే.
భావ ప్రధానమైన గానానికీ, వాద్యానికీ శుద్ధమైన గతితో, నికరమైన గణితంతో సహకరించేది లయ వాద్యాలు -
కర్ణాటక సంగీతానికి ప్రధానమైన లయ వాద్యం మృదంగం.
హిందూస్తానీ సంగీతానికి తబ్లా లేదా పఖ్‌వాజ్.
కర్ణాటక సంగీత ప్రపంచంలో మృదంగ వాద్యంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వారిలో పళని సుబ్రహ్మణ్య పిళ్లై, పాల్ఘాట్ మణిఅయ్యర్ ఇద్దరూ ధృవతారలు. వీరు లయ జ్ఞాన సంపన్నులు.
నేటి తరంలోని విద్వాంసులు ఈ ఇద్దరినీ తలచుకుంటూనే ఉంటారు. వీరి మృదంగ వాద్యం ప్రధాన గాయకుణ్ణి అనుసరించేదే కాని, ఆక్రమించేది కాదు - అదీ, వీరి బాణీల్లోని ప్రత్యేకత.
దక్షిణాదిలో పళని శైలికి మూలపురుషుడు మాన్ పుండియా పిళ్లై. స్వచ్ఛమైన సంగీతానికి శ్రుతి ఎంత ముఖ్యమో, లయ కూడా అంతే ముఖ్యం. పుట్టుకతోనే కొందరికి ఈ శ్రుతి జ్ఞానం లభిస్తుంది. అలాగే మరి కొందరికి లయ జ్ఞానం అబ్బుతుంది.
ఈ రెండూ మరి కొందరికి వినికిడి వల్ల కూడా లభించే అవకాశాలున్నాయి.
వెనకటి తరంలో ఒకప్పుడు సంగీతం ఆధ్యాత్మిక ధోరణిని పెంచేందుకే దోహదపడి ఎందరినో విద్వాంసుల్ని తయారుచేసింది. ఆ రోజుల్లో సంగీత కళను లౌకిక విద్యగా భావించే వారు కాదు. నేర్పిన వారూ కాదు. వారికి లభించిన సంగీతాన్ని శ్రద్ధతో ఇంటి భజనల్లోనో, దేవాలయాల్లోనో ఎక్కువగా వినిపించేవారు. వారు బ్రతకడానికే సంపాదన చేసేవారు గానీ, సంపాదించటం కోసమే బ్రతకలేదు. వౌలికంగా ఇదే భావనతో వుండటం వల్ల సమాజంలో సంగీత సరస్వతి మీద శ్రద్ధ్భాక్తులు, చక్కని అభిరుచులూ, అనుభవాలూ వ్యాపించి ఉండేవి. కాలం మారిపోయింది. దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. కానీ, సంప్రదాయ కళల మీద ఆసక్తి మాత్రం లేదు. మన దేశంలోని గుళ్లల్లో కనీసం నాదస్వర వాద్యం కూడా కమ్మగా వినే అవకాశం లేదు.
సంప్రదాయం మీద శ్రద్ధ కంటే భక్తిని ఆడంబరంగా చూపించటం ప్రధానమై దేవాలయాలన్నీ సంపాదనపైనే దృష్టి పెట్టడం వల్ల దాపురించిన పరిస్థితి ఇది. దీనివల్ల పవిత్రమైన సంగీతం కాస్తా ఇల్లూ, వాకిలీ, గుడి, గోష్టి వదిలేసి సమాజాలను ఆశ్రయించటం ప్రారంభమైంది.
ఒకప్పుడు ఇళ్లల్లో భజన గోష్టులు ఏర్పాటు చేసుకునేవారు. దక్షిణాదిన ఆ రోజుల్లో దేవాలయాలలో నాదస్వరం ప్రధానంగానూ విస్తృతంగానూ వినిపించేది. అనుభవజ్ఞులైన నాదస్వర విద్వాంసులతోబాటు లయ జ్ఞానంతో మూర్త్భీవించిన మహావిద్వాంసులుండేవారు. అటువంటి మహా విద్వాంసుడే ఈ మాన్ పుండియా పిళ్లై.
ఇంట్లో సంగీత వాతావరణం అంటూ ఏమీ లేని పిళ్లై కేవలం లయపై ఎంతో మక్కువతో ‘కంజిరా’ వాద్యంతో తన సంగీత యాత్ర మొదలుపెట్టి కర్ణాటక సంగీత చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించాడు.
19వ శతాబ్దంలో బాగా పేరున్న మృదంగ విద్వాంసుడు నారాయణస్వామి అప్పతో సన్నిహిత సంబంధాన్ని మరింత పెంచుకుని మృదంగ వాద్య మర్మాలు తెలుసుకుని ఉద్దండులైన ఎందరో శిష్యులను తయారుచేశాడు.
పుదుక్కొటై దక్షిణామూర్తి పిళ్లై, పళని ముత్తయ్య పిళ్లై (పళని సుబ్రహ్మణ్య పిళ్లై తండ్రి) తిరుచ్చందూర్ రామయ్య పిళ్లై, పుదుక్కొటై రామయ్య పిళ్లై, రామనాథపురం సి.ఎస్.మురుగభూపతి వంటి మేధావులను తయారుచేసిన మహా విద్వాంసుడు ఈ మాన్ పుండియా పిళ్లై.
ఎవరికైనా మృదంగం పేరు చెప్పగానే పళని సుబ్రహ్మణ్య పిళ్లై, పాల్ఘాట్ మణిఅయ్యర్ పేర్లు వెంటనే గుర్తుకొస్తాయి.
రామనాథపురం, ఎం.ఎన్.కందస్వామి, తిరుచ్చి శంకరన్ వంటి మృదంగ విద్వాంసులంతా పుదుక్కొటై బాణీకి వారసులే.
నందీశ్వరుని అవతారాలుగా సంగీత విద్వాంసులు భావించే ఈ విద్వాంసులలోని గొప్పతనం: ‘ప్రధాన గాయకుణ్ణి లేదా వాదకుణ్ణి జాగ్రత్తగా అనుసరించటం, సాహిత్య భావం ఏమిటో శ్రోతలు అర్థం చేసుకోవాలని చేసే ప్రయత్నంలో అసలేమీ వాయించకుండా ఒక్కోసారి నిశ్శబ్దాన్ని పాటించడమే’ అనేవారు శ్రీ వోలేటి. నిశ్శబ్దానికి ఒక అర్థం ఉంది. వౌనానికి ఒక పరమార్థం ఉంది. గాయకుడికీ, వయొలిన్ విద్వాంసుడికీ వుండే అవినాభావ సంబంధం కంటే, కీర్తనలోని సాహిత్య భావం శ్రోతల కందించటంలో మృదంగ విద్వాంసుని పాత్ర కూడా చాలా గురుతరమైనదే. సాహిత్యంలోని మాటల కూర్పునుబట్టి అప్పటికప్పుడు తాళ నిర్ణయం చేసుకుంటూ లయతో సహకరించేది మృదంగ విద్వాంసుడే. ఆ మాటల యొక్క నడక విళంబంగా వుంటే మృదంగం నడక ఒకలా ఉంటుంది. దీనికి ‘తత్తం’ అని పెద్దలు పేరు పెట్టారు. సాహిత్యంలోని మాటలు ధ్రుత గతిలో నడిస్తే దాన్ని ‘ఓఘం’ అన్నారు.
‘ఓఘం’ అంటే ప్రవాహం. పట్టుకు దొరకదు నిలకడ ఉండదు. అదొక నడక. ఈ రెండు గతులకు మధ్యనుండే గతిని ‘అంతం’ అంటారు. ఈ నడకలో స్వరాల నడక, శబ్దార్థాలు, గతి గణితాలూ వినే వారికి సులభంగా దొరుకుతాయి. వింత వింతలైన తాళాలు, ఒక పద్ధతిలో లేని స్వరకల్పనలు, రక్తి లేకుండా సాగే తీర్మానాలు ఏవో సర్కస్ విన్యాసాలుగా మారిపోయి వినేవారికి తాత్కాలికంగా ‘ఆహా’ అని అనిపించవచ్చు. కానీ, సంగీత పరమార్థమైన హృదయానంద సౌఖ్యాన్ని మాత్రం ఇవ్వలేవు.
వెనకటి తరంలోని మృదంగ విద్వాంసులు మాత్రం సౌఖ్యానికి మాత్రమే ప్రాధాన్యత నిస్తూ సాహిత్యంలోని భావం శ్రోతలు అర్థం చేసుకుంటూ ఆనందించే విధంగా తమ మృదంగ వాద్యంతో సంగీత కచేరీ రక్తికి దోహదపడుతూ గాయకుల ప్రశంసలతోబాటు సంగీత రసికుల ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం - మృదంగ విద్వాంసులకు వీలైనప్పుడే, గాత్ర విద్వాంసులు సంగీత కచేరీలు ఒప్పుకునేవారు. సొగసైన మృదంగ వాద్యానికి అర్థం వారే.
పాడే పాటలోని సాహిత్యం శ్రోతలకు బాగా అర్థమవ్వాలి. మాటలు సరళంగా ఉండి సుబోధకంగా ఉండాలి. ఏం పాడుతున్నాడో తెలియకుండా పాటను మింగేసేలా వాద్యఘోష ఉండకూడదు. పాటలో పట్టువిడుపులు తెలియాలి. అంటే ఎక్కడ ఏ మాటను ఎంత భావంతో నింపి పాడాలో తెలియాలి. ఎక్కడ ఆపాలో కూడా తెలియాలి. కవిత్వం వచ్చు కదాయని అర్థంకాని మాటలతో గజిబిజిగా అల్లేసి పాడేస్తూ శ్రోతల మనసంతా చిందరవందర చేసేస్తే ఏమిటి ప్రయోజనం? చల్లగా సాగే పాట సొగసైన లయ వాద్యం తోడుగా, మనసుకు హాయినిచ్చేలా ఉండాలి. అలా గానం చేయగల ధీరుడెవడో కదా? అంటారు త్యాగయ్య. నిజానికి అలా పాడగలిగే శక్తి ఆయనకు గాక మరెవరెవరికి సాధ్యం?
గాత్ర ధర్మం వేరు. వాద్య ధర్మం వేరు. అన్ని లయ వాద్యాలకు ఒకే వరసలుండవు. మృదంగంపై పలికించే వరసలు, ఆ వాద్య ధర్మాన్ని అనుసరించే ఉంటాయి. తబ్లా, పఖ్‌వాజ్, డోలక్, డోల్‌కీ, కంజరా, ఘటం, మొర్సింగ్, మొదలైన వాద్యాల మనోధర్మాలు వేరు. మైకు సౌకర్యం లేని వెనుకటి రోజుల్లో గాత్ర విద్వాంసులంతా హెచ్చుశ్రుతుల్లో అందరికీ వినిపించేలా గంభీరంగా పాడేవారు. వారి సాధన, వారి కంఠధ్వనికి తగ్గట్టుగానే ఉండేది. ఆశ్చర్యాన్ని కలిగించే మరో విషయం. 19వ శతాబ్దంలో (మూర్తిత్రయం వారి తర్వాత) పుదుక్కోటై ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్వాంసులు నన్నూ మియ్యా, ఛోటూ మియ్యా అనే డోలక్ విద్వాంసులుండేవారు. ‘నన్నూ ఛోటూ’ అనేవారు. కర్ణాటక సంగీత కచేరీలకు వీరి డోలక్ వాద్యం ఉండేది. (మృదంగానికి బదులు) పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, మహావైద్యనాథన్ స్థాయిలోని విద్వాంసులకు సహకారంగా, నన్నూ ఛోటూ డోలక్ వాద్యంతో సమ్మోహనపరిచే వారంటే ఊహించండి.
తుకా రామప్ప (1860-1900) అనే మృదంగ విద్వాంసుడు అద్వితీయమైన తన వాద్యంతో అటు విద్వాంసులను మైమరపింప చేయటమే కాదు, శ్రోతల అభిమానాన్ని విశేషంగా సంపాదించి కీర్తిని పొందారు. వారితో సమానమైన విద్వాంసులెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. పుదుక్కోటై దక్షిణామూర్తి పిళ్లై, అళఘనంబి పిళ్లై వంటి పేరున్న మృదంగ విద్వాంసులు, నారాయణపు మృదంగ వాద్యాన్ని, ఆయన వాయించే తీర్మానాలను అనుసరించే వారంటే వారికున్న ప్రతిభను అంచనా వేసుకోవచ్చు.
వీరిలో ఏ ఒక్కరూ ప్రధాన విద్వాంసుణ్ణి దాటిపోయి వాయించేవారు కాదు. త్యాగయ్య భావించిన సొగసైన మృదంగ వాద్యానికి ప్రతిబింబాలు వీరు. ఆ తర్వాత తరంలోని పళని, పాల్ఘాట్ మణిఅయ్యర్‌లకు వీరే ఆదర్శం. వీరు భావితరాలకు ఆదర్శం.
మృదంగానికి మాధుర్యం, మార్దవం వుంటేనే సొగసైన మృదంగ తాళవౌతుంది. లేకపోతే అర్థంలేని ధ్వనియే.

- మల్లాది సూరిబాబు 9052765490