అమృత వర్షిణి

మాగ్నెటిక్ హిల్... వాహనాలకు రెడ్‌సిగ్నల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సృష్టి మహా విచిత్రమైనది. అందులోని వింతలు అన్నీ ఇన్నీ కావు. చందమామ కథల్లోలా కొన్ని వింతలైతే వింటేనే సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అటువంటి వింతలకే వింత మన దేశంలోని కార్గిల్-శ్రీనగర్ జాతీయ రహదారికి సమీపంలో కొలువై ఉంది.
అదే మేగ్నటిక్ హిల్... అయస్కాంత కొండ.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ కొండ చెంతకు వెళ్లిన వారికి జరిగే విచిత్ర అనుభవాలు వింటుంటే ఇదెంతటి చిత్రమైన కొండో మనకి అర్ధమవుతుంది.
ఈ కొండ సమీపం నుండి వెళ్లే కార్లు, ట్రక్కులు, ఇతర వాహనాలను ఈ కొండ ఇట్టే ఆకర్షిస్తూ ముందుకెళ్లడం దాదాపు అసాధ్యమైపోతుంటుంది. అప్పటి వరకు వేగంగా సాగిపోయే వాహనాలు ఈ మేగ్నటిక్ హిల్ సమీపంలోకి రాగానే ఎవరో చేత్తో పట్టి ఆపేసినట్లు వేగం మందగించి మందకొడిగా ముందుకు సాగుతాయి. సముద్రమట్టానికి పదకొండు వేల అడుగుల ఎత్తున ఈ కొండ లేహ్ ప్రాంతానికి సరిగ్గా ఏభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి దక్షిణం వైపున ఇండస్ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ చోటు నుండి అలా ముందుకు సాగిపోతే టిబెట్, పాకిస్తాన్ దేశాలు వస్తాయి. మేగ్నటిక్ హిల్ ప్రాంతం గొప్ప టూరిస్టు కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. ఈ ప్రాంతంలో మోటారు వాహనాల ఇంజన్లు ఆపేసినా సరే అవి కొండ వైపు గంటకి ఇరవై కిలోమీటర్ల వేగంతో సాగిపోతుంటాయి.
ఇక్కడ అలా జరగడానికి కారణం ఆ కొండకి అయస్కాంత శక్తి ఉండడమే అని కొందరంటుంటే మరి కొందరు మాత్రం ఈ కొండ ప్రాంతంలో కంటికి కనిపించని అదృశ్యశక్తులు ఉంటాయని, ఈ కారణంగానే కార్గిల్-శ్రీనగర్ జాతీయ రహదారికి సమీపంలో ఉండే ఈ కొండ వద్ద అనూహ్య సంఘటనలు జరుగుతుంటాయని అంటున్నారు.
కొద్ది కాలం కిందట మన దేశానికి చెందిన అయిదుగురు సైనికులు ఒక ట్రక్కు మీద ఈ కొండ సమీపంలో ప్రయాణించారు. ఆ సమయంలో వారికి ఈ కొండ గురించి తెలుసుకోవాలని అనిపించింది. దాంతో వారు తమ ట్రక్కు ఇంజన్ ఆపేశారు. అయినా వారి ట్రక్కు దాటి వచ్చేసినా కొండ వైపు వెనక్కి సాగడం మొదలుపెట్టింది. అంటే ఇంజన్ ఆపేసిన వాహనాన్ని వెనుక నుండి అయస్కాంత కొండ ఆకర్షిస్తుందన్న మాట. అలాగే ఒక వ్యక్తి ఈ కొండ సమీపంలో కారు ఆపి పక్కకి వెళితే ఆ కారు కొండ దిక్కు జారిపోవడం మొదలుపెట్టింది. ఇది గమనించి ఆ వ్యక్తి పరుగు పరుగున కారును చేరుకుని అందులోకి ఎక్కి ఆపాల్సి వచ్చింది. అదే విధంగా ఇండో-టిబెటన్ పోలీసులు (ఐటిబిపి) కూడా ఈ కొండ గురించి చెబుతూ ఈ కొండ సాధారణ వాహనాలనే కాకుండా హెలికాప్టర్లను కూడా ఆకర్షిస్తుందని, ఈ కొండ సమీపంలోకి రాగానే హెలికాప్టర్ల వేగంలో అనూహ్యమైన మార్పులు వస్తాయని అంటున్నారు.
మేగ్నటిక్ హిల్‌కి దగ్గరలోనే సిక్కుల పదవ గురువైన గురుగోవింద సింగ్ 17వ శతాబ్దంలో ధ్యానం చేసిన ప్రదేశం ఉంది. దీనిని దర్శించుకోవడానికి వచ్చే సిక్కులు తమ వాహనాలను మేగ్నటిక్ హిల్ దగ్గరలో ఆపడం, అవి కదిలి ఆ కొండ వైపు సాగిపోవడం చూసి ఆశ్చర్యపోవడం జరుగుతుంటుంది.
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి మేగ్నటిక్ కొండ దగ్గరకి వచ్చే టూరిస్టులు, లేహ్, కార్గిల్ ప్రాంతాలకు చెందిన వారు ఈ అయస్కాంత కొండ వద్ద ఏవో శక్తులు ఉన్నాయని, అందుకే ఇక్కడ అనూహ్య సంఘటనలు జరుగుతుంటాయని అంటుంటే కొందరు మాత్రం అయస్కాంత ప్రభావం వల్లనే ఈ కొండ వాహనాలను ఆకర్షిస్తుందని అంటున్నారు. కెనడాలోని న్యూబ్రన్స్‌విక్‌లో ఉన్న మాంక్‌టన్ మేగ్నటిక్ కొండ, చైనాలోని గన్సు కొండ, డొమెనికన్ రిపబ్లికన్‌లోని పోలో కొండ, చెక్ రిపబ్లిక్‌లోని మోరావాస్కా ట్రెబోవా కొండ, గాటిమాలాలోని పాసో మిస్టీరియాసో కొండ, మన దేశంలోని గుజరాత్‌లో ఉన్న మరో మేగ్నటిక్ కొండ, ఇండోనేషియాలోని లింపాకువుస్ కొండ, ఇటలీలోని మేగ్నటిక్ కొండ, రోమ్‌లోని లాజియో కొండ, లెబనాన్‌లోని హమత్ కొండ, మలేషియాలోని కిమాన్సిస్ కొండ, మెక్సికోలోని నీల్‌టికాన్ కొండ, ఫిలిప్పీన్స్‌లోని పకార్డ్ కొండ, పోర్చుగల్‌లోని మేగ్నటిక్ కొండ, రొమేనియాలోని మేగ్నటిక్ కొండ, సౌదీ అరేబియాలోని వాదీ అల్ జిన్, సెర్బియాలోని రాడాన్ కొండ, సౌత్ కొరియాలోని మేగ్నటిక్ కొండ, ఎసెక్స్‌లోని హాంగ్‌మేన్స్ మేగ్నటిక్ కొండ, వెస్ట్ ససెక్స్‌లోని రోగెట్ మేగ్నటిక్ కొండ, స్కాట్లాండ్‌లోని అర్‌షైర్ మేగ్నటిక్ కొండ, యునైటెడ్ స్టేట్స్‌లోని అలబామా మేగ్నటిక్ కొండ, ఆర్కాన్సాస్‌లోని హెలెనా మేగ్నటిక్ కొండ, కాలిఫోర్నియాలోని మేగ్నటిక్ కొండ వంటివన్నీ మామూలు అయస్కాంత కొండలేనని, వాటిక్ మల్లే కార్గిల్-శ్రీనగర్ జాతీయ రహదారి సమీపంలో గల కొండ కూడా సాధారణ అయస్కాంత కొండేనని అనేవారూ ఉన్నారు. అయితే దీనిపై పెద్దగా పరిశోధనలు జరగకపోవడం వల్ల ఎవరి వాదన నిజమో స్పష్టం కావడంలేదు. ఇటుగా వచ్చే టూరిస్టులు మాత్రం విచిత్రమైన ఈ అయస్కాంత కొండని చూసి అబ్బురపడుతున్నారు.
- దుర్గాప్రసాద్ సర్కార్ సృష్టి మహా విచిత్రమైనది. అందులోని వింతలు అన్నీ ఇన్నీ కావు. చందమామ కథల్లోలా కొన్ని వింతలైతే వింటేనే సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అటువంటి వింతలకే వింత మన దేశంలోని కార్గిల్-శ్రీనగర్ జాతీయ రహదారికి సమీపంలో కొలువై ఉంది.

- దుర్గాప్రసాద్ సర్కార్