రంగారెడ్డి

వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన కేరళ వర్సిటీ పాలకమండలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, నవంబర్ 20: జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుల బృందం శుక్రవారం సందర్శించి పలు విషయాలను తెలుసుకున్నారు. పాలక మండలంలోని ఇద్దరు శాసనసభ్యులు, ఎంపి వినె్సంట్, ఐసి బాలకిషన్, అధికారులు పిఏ సలాం, అజిప్రాన్సిస్, బి.అజిత్ కుమార్‌తో కూడిన బృందం వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భనవంలో ప్రత్యేక అధికారి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపడుతున్న కార్యక్రమాలపై కేరళ బృందం అధ్యయనం చేసింది. కూరగాయలు, పండ్లు, వివిధ ఆహార పంటల విత్తనోత్పత్తిలో తెలంగాణ స్వయం సంవృద్ధి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రవీణ్‌రావు వారికి వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బోధన, పరిశోధన, విస్తరణ కార్యక్రమాలను తమ విశ్వవిద్యాలయం రూపొందించుకుంటుందని వెల్లడించారు. భారతదేశంలోని విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన వివరించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సుమారు 360కి పైగా జాతీయ, అంతర్జాతీయ విత్తన కంపెనీలు రాష్ట్రంలో విత్తనోత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. తెలంగాణ నుంచి 14 దేశాలకు వరి విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని బృందానికి వివరించారు. కొత్తగా ఏర్పాటైన విశ్వవిద్యాలయం కావడంతో ప్రభుత్వం హితోధికంగా సహకరిస్తుందన్నారు. పరిశోధనా, బోధన కార్యక్రమాల కోసం గత బడ్జెట్‌లో కేటాయింపులు పెంచిందని వారికి వెల్లడించారు. యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు తమ విశ్వవిద్యాలయం యువ రైతు కోసం ‘యువ రైతు సాగుబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. అంతేకాకుండా రైతులు, విద్యార్థులతో కలిసి చేను కబుర్లు పేరుతో రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కేరళ బృందానికి వివరించారు. విశ్వవిద్యాలయంలోని మిల్లెట్ ఇంక్యూబేషన్ సెంటర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, వరి పరిశోధనా కేంద్రం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ యూనిట్, వ్యవసాయ యాంత్రీకరణ, పనిముట్ల కేంద్రం, పెస్టిసైడ్ రెసిడ్యువల్, క్వాలిటీ కంట్రోల్ లేబొరేటరీలను కేరళ ప్రతినిధి బృందం సందర్శించింది. వారితోపాటు అచ్చంపేట శాసనసభ్యుడు గవ్వల బాలరాజు రాజేంద్రనగర్‌లోని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ క్షేత్రాన్ని సందర్శించారు. సందర్శించిన వారిలో విస్తరణ సంచాలకులు ఎన్.వాసుదేవ్, దండా రాజిరెడ్డి, పీసీరావు, అనురాగ్ చతుర్వేది, కేవీ ఎస్ మీనాకుమారి, సదాశివరావు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.