అక్షరాలోచన

అనుకున్నది అనుకున్నట్లుగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలలాంటి ఒక అద్భుతం జరిగి
కారే కన్నీటి మూలాలు
కదలాడే బొమ్మల్లా ప్రతిబింబిస్తే...
ఆమూలాన్ని సమూలంగా నిర్వీర్యం చేయొచ్చు
గుండె గాయాల కథల్ని ఎక్స్‌రేలా
తెలియజేసే పరిశోధన మొదలైతే
గాయాలకు ఔషధ లేపనం అద్దినట్లే!
కరువు కాటకాలను కాటేసి
రైతుల పెదాలపై చిరునవ్వును చూడగలిగే
మంత్రం లాంటి కొత్త పరికరం రూపొందిస్తే
పుడమి పులకించినట్లే!
దేశ వినాశనానికి పావులుకదిపే
దేశ విద్రోహుల్ని
ఏకకాలంలో తుదముట్టించే
సరికొత్త ఆయుధం మన ముందుకొస్తే
సంబరాల వేడుకలు ఊరు వాడ నిండినట్లే!
హంతకుడి ఆవేశాన్ని కంటిచూపుతో
ఆపే టెక్నాలజీ కనిపెడితే
అడుగడుగూ ఆనంద పారవశ్యమే!
తుఫాన్లు, సునామీలు, భూకంపాలను
తృటిలో అడ్డుకొనే పరిశోధన దిశగా
శాస్తవ్రేత్తలు అడుగేస్తే-
జీవితం మూడు పువ్వులు ఆరు కాయలే!
ఈ ఇగోలు
ఈ స్వార్థ పరంపరలు
ఈ పదవీ వ్యామోహాలు
ఈ ఎత్తులు, జిత్తులు, గమ్మత్తులు
ఈ తరతమ భేదాలు
అన్నీ సమాంతర రేఖలైనపుడు
యావత్ ప్రపంచం
పచ్చదనాల ఆరబోతల్ని
మన ముందు వొంపరా?
శాంతి సౌభాగ్యాలతో
సర్వేజనా సుఖినోభవంతు కాదా?

-గుర్రాల రమణయ్య
9963921943
****

సర్పదష్టులు

వల్మీకం ఛిద్రమై బుసలు కొడుతూ
ఒక్కొక్కటిగా విశ్వరూపం దాలుస్తున్నాయి
అర్థ భార వడ్డీతో కర్కోటక కూష్మాండక
కలశపోతక కళింగ నాగులు కరాళ నృత్యం చేస్తున్నాయి
సభ్య సమాజాన్ని భ్రష్టు పట్టించే దురాగతాల
అనలానికి ఆజ్యం పోసినట్టు
గొలుసుకట్టు ‘పైసా’చిక అకృత్యాలు బయల్పడుతున్నాయి
అనాగరిక ప్రజాస్వామ్య పాలికలో
రాచరిక మధ్యయుగ నియంతృత్వ పోకడలతో
జీవనం సాగిస్తున్న మనకు సంశయాత్మకమే
అరువుకై అర్రులు చాచిన అవసరార్థులకు
వడ్డీ రుణం ఇచ్చే అపర శ్రీమన్నారాయణులు
అవతారం రూపుమాపి - రావణ, కీచక, దుశ్శాసనులుగా
భావి చరిత్ర పుటల్లో పదిలంగా శాసనాలు.
పేదల మధ్యతరగతి వర్గాల రుధిరాస్తికల్ని జుర్రుకొని
పిప్పి చేస్తున్నారు. తులసీవనంలో గంజాయి మొక్కలు
కాయాకష్టం మరచిన కాలభైరవులు!
ఖాళీపత్రాలపై దౌర్జన్యపు చేవ్రాళ్లు
లెక్కాపక్కా తేదీ ఏదీ లేని చెక్కులు
ప్రామాణిక పత్రాలు ఆస్తుల ఆక్రమణలు
రుణగ్రస్త జనాన్ని రాచి రంపాన పెడుతున్న
పాపాల భైరవులు!
అసలు సిసలు చెల్లించని రుణగ్రహీతల్ని బెదిరించి
అర్ధాంగుల్ని వంచించి నీలిచిత్రాల్ని తీయడం
పడుచుదనాలను పడుపులోకి గుంజడం
దాష్టీక విశృంఖలాల చెరలో రుణ బాధితులు
మానవ జాతి అంతరించి దానవ నీతి జ్వలిస్తోంది
అధిక వడ్డీకి అస్తిత్వాన్ని కోల్పోతున్న అమాయకుల
బతుకులు నిర్వీర్యం చేయడం అమానుషం
సూక్ష్మ రుణాసురులకు చట్టం కట్టుదిట్టం చేసింది
ఇపుడు కాల్‌మనీ కోరలు పీకి కాలకూటాన్ని కక్కిద్దాం.

-సయ్యద్ జహీర్ అహ్మద్
9505152560
***