అక్షరాలోచన

సముద్ర ఘోష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్ర ఘోష
నా గోస
నడి సంద్రంలో
నా జీవన సమరం
సగం జీవితం
సముద్రయానమే
ఆలి తీరంలో
నేను బతుకు తెరువుకై
సంద్రంలో
పడవలో
వలలతో
చేపలకై
వారం పక్షం రోజులో
ఎన్ని రోజులో ఏమో
ఆకలి దప్పిక ఎరుగను
చేపలు ఎన్ని పడితే
అంత ఆనందం నా కళ్లల్లో
నా రాకకై
సూర్యోదయం నుండి
సూర్యాస్తమయం దాకా
కనుచూపు మేర
నా పడవ కానవస్తుందేమోనని
కానరాకపోతే నిరాశ
కానవస్తే నా చెలి కళ్లల్లో కాంతి
దినదిన గండం నా పయనం
ఐనా సమరం సంద్రంతో నిరంతరం
అలల అలజడి
ఉవ్వెత్తున ఎగసే అల
పడవపై ప్రతాపం జూపె
నా ప్రావీణ్యం పడవపై సయ్యాట
చేపలు నిండగా
తీరం చేరే పడవ
శ్రీమతి మోము వెలుగగా
సముద్ర సమర జయ కేతనం
నా బతుకుపోరు అలుపెరుగదు
ఆగదు

-గిరిప్రసాద్ చెలమల్లు 9493388201