అక్షరాలోచన

వ్యాపారాత్మకం కాక ఇంకేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురిటి నొప్పులు పడకుండా
నవమాసాలు మోయాలన్న బాధ లేకుండా,
ప్రసవ వేదన అనుభవించకుండా,
అద్దె గర్భాలు దొరుకుతున్నప్పుడు
‘మాతృత్వం’ మమకారం లేనిదైనప్పుడు
వ్యాపారాత్మకం కాక ఇంకేమిటి?

ఆప్యాయంగా మాట్లాడుకుందామన్నా
మనిషికి మనిషి దొరకని ఈ రోజుల్లో
మాటల్ని అమ్ముకునే వాళ్లు అమ్ముకుంటుంటే
కొనేవాళ్లు ధర నిర్ణయించి కొంటుంటే
‘మాట’ అనురాగాప్యాయతలు కరువై
వ్యాపారాత్మకం కాక ఇంకేమిటి?

బంధాలు, బంధుత్వాలు వీగిపోతున్నా
మనిషి ‘మనీ’ వెనక పరుగులు పెడుతుంటే
కాసుల రాశుల్తో
దొరకనిదంటూ లేకపోతుంటే
మమతల కోవెలలెక్కడ వెల్లివిరుస్తాయి
‘సహృదయం’ సాంకేతికంగా మారినప్పుడు
వ్యాపారాత్మకం కాక ఇంకేమిటి?

అమ్మతనం అంగడి సరుకై
కమ్మని మాట వినేందుకే కరువై
సహృదయం ఇంకో సహృదయానికి
తారసపడక
‘కళ’ కళ కోసం కాక కాసుల కోసమైనప్పుడు
‘కళ’ విహీనమై క్షుద్ర భూషణమైనప్పుడు
వ్యాపారాత్మకం కాక ఇంకేమిటి?

బియ్యం రాళ్లతో కల్తీ
మనసు మలినంతో కల్తీ
నుదుటికి నామాలద్దుకున్నా
తనువుకు భక్తిలేనప్పుడు
కుయుక్తులకు ముక్తి ఎక్కడిది?
‘్భగవన్నామస్మరణ’
ఆధ్యాత్మికత లేని ఆశలదైనప్పుడు
వ్యాపారాత్మకం కాక ఇంకేమిటి?
*

-మొగిలి స్వామిరాజ్ 9963642205