అక్షరాలోచన

సాక్షిని నేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిక్కులన్నీ ఎడారులైన అబుదబిలో
ఉదయించే సూర్యుడు భూమిపై
విత్తులా మొలకెత్తినట్లు
అస్తమించే సూర్యుడు తల్లి సీతమ్మలా
భూగర్భంలోకి దిగినట్లు ఉంది!
రోడ్లు సరళ రేఖలై సమాంతరంగా
వృత్తాలు అర్ధవృత్తాలుగా నిర్మించబడి
బెల్జియం అద్దాల్ని మరపించటం చూశాను!
ట్రాఫిక్ సిగ్నల్ గీచిన లక్ష్మణరేఖ ముందు
వాహన దండు వినమ్రంగా నిల్చి
ఎదురొచ్చిన వాహన సమూహానికి
సాదర వీడ్కోలు పలకటం
రోడ్డెంబడి భద్రతా సిబ్బందిలా
అడుగడుగునా కెమెరాలు నిల్చి
రక్షణ వ్యవస్థను పరిరక్షించటం చూశాను!
ఆకాశం అంటిన సుందర హర్మ్యాల
ఆఖరి అంతస్తులపై
నక్షత్రాల పూదోటలు పూయటం
చీకట్లో సూర్యుడికి ప్రత్యామ్నాయమై
వెలిగిన బల్బులు
సూర్యుడి రాక చూసి కొడిగట్టిన దీపాలై
నిర్యాణగంధాన్ని విడవటం చూశాను!
ఉప్పునీటి సముద్రానికి మందులిచ్చి
ఉద్భవించిన మంచినీటితో
దేశ దాహార్తి తీర్చటం
భర్తృహరిని గుర్తుచేస్తూ ఇసుకలో తైలాన్ని పిండి
వేళ్లపై లెక్కించే వాణిజ్య దేశమై నిలవటం
ఉద్యోగుల జీతాల్లో టాక్స్ మినహాయింపుల్లేని
దేశ విధాన నిర్ణయాన్ని చూశాను!
పొట్టచేతబట్టి పాస్‌పోర్టు పరాయి చేతిలో పెట్టి
జట్లు జట్లుగా విదేశీ కార్మికుల రాక చూశాను!
విమానాశ్రయంలో కార్మికుల్ని
అధికార్లు అదిలించటం
ఆకల్ని మోసుకొచ్చిన కార్మికులు
విదిలింపుల్ని వినమ్రంగా స్వీకరించటం చూశాను!
బిడ్డను కని వచ్చి ఐదేళ్లు నిండినా
కంటిచూపునకు నోచని కన్నతల్లుల్ని
విమానాలు మిడతల దండులా తిరుగాడుతున్నా
ఎక్కలేని కార్మికుల దీన చరితను చూశాను!
పాస్‌పోర్టు దాచిన వ్యక్తి పార్థుడిలా
అజ్ఞాతవాసం చేస్తూ
కార్మికుల జీతాల్లో కమిషన్లు పుచ్చుకోవటం
ఫోన్లు ఉత్తరాలు లేక బాధల గాథలు
మేఘ సందేశాలై తిరుగాడటం చూశాను!
చనిపోయిన తల్లిని చూడ్డానికి స్వదేశానికి పోలేక
రాయబారి కార్యాలయం ఎదుట అనాధ
ఉన్మాదిగా సంచరించటం
భార్య శవం కోసం స్వదేశంలో భర్త
వారాల తరబడి అధికార్లను ఆశ్రయించి
అర్థించటం చూశాను!

-అడిగోపుల వెంకటరత్నమ్