అక్షరాలోచన

చింతచెట్టు తేనెపట్టు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఊరి
చింతచెట్టు కింద
మస్తుగా ఆటలాడటోళ్లం
ఆ మానుకున్న తొర్రలో
దాగుడుమూతలుగా దాక్కునేటోళ్లం
చింతగింజలు పగలగొట్టి
చిత్తూ బొత్తూ ఆడుకునేటోళ్లం
చింతచెట్టంటే మాకెంతిష్టమో...
ఆ పేరింటేనే
నోట్లో నీళ్లూరుతై
పాత చింతకాయ తొక్కు
చప్పరించినప్పుడల్లా
మా ఊరి చింతచెట్టు గుర్తొస్తది
పచ్చిపులుసు పప్పుచారు పులిహోర
అబ్బో అన్ని రుచుల్లో చింతపండే
ఇమ్లిబన్ బస్టాండ్ కాడ దిగ్గానే
చింతతోపు స్మృతుల జాడ
ఎంత చెప్పుకున్నా
చింతచెట్టు మధురస్మృతుల తేనెపట్టు
నా చింతనిప్పుల్లాంటి కళ్లల్లోనూ
బాల్యపు ఆనవాళ్లు

మా పిల్లలు ఇంట్లో
సి విటమిన్ టాబిలేట్లు చప్పరిస్తుంటారు
చింత చచ్చినా పులుపు చావని బతుకు నాది
అందుకేనేమో...
చింతాకంత చింత కూడా లేకుండా
చింతకాయల్ని చప్పరిస్తూ
ఆ చెట్టు కిందే ఇప్పటికీ సేద తీరుతుంటా...!

-కటుకోఝ్వల రమేష్ 9949083327